Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 28

 

    "అలా అవి కైవల్యం కేవలం యోగం వలనో, జ్ఞానం వలనో ప్రాప్తించదు. అందుకు సాధన ముఖ్యం. మనసు నందలి సంక్షోభం సమసిపోనిదే సాధన యందు స్థిరత్వము చిక్కుట దుర్మభము. ఆ భగవానుడు మోహపీడుతులైన మానవులను ఉద్దరించు తలంపుతో గురువు రూపంలో అవతరిస్తుంటాడు. సాక్షాత్తూ భగవద్రూపమున మనముందున్న ఈ విష్ణు గురుదేవుల సాధన యందు తమ అమూల్యమైన బోధనలతో మనలను మార్గదర్శకులు కాగలరనే సదుద్దేశ్యంతో ఈ బహిరంగ వేదిక ఏర్పాటు చేయించటమైనది....."
    నగర మేయర్ గంభీరమైన తన వాక్కులతో చెప్పదలుచుకున్నది సూటిగా రెండే రెండు మాటల్లో చెప్పి కూర్చుంది పోయాడు.
    తరువాత వంతు సి.ఏ. పృద్విరాజ్.....
    ఆయనకు విష్ణు పై ఎలాంటి భక్తీ భావం లేకున్నా అంతమంది జనసందోహం మధ్యలో ఏర్పాటు చేసిన బహిరంగ చర్చకు ఆహ్వానం రావడం వలన రాక తప్పలేదు.
    ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి పుల్ల విరిచినట్టు చెప్పి కుర్చుండిపోయాడు.
    ఇప్పుడు అందరి దృష్టి ధీరజ పైకి మళ్ళింది.
    ధీరజ లేచి నిలుచుని మైక్ ను తన ముందుకు జరుపుకుంది, ఆమె చెప్పే మాటలను వినడానికి విష్ణు సైతం ఆసక్తిగా తల తిప్పి చూశాడు.
    "సాధకుని యందు నిద్రాణమై వున్న శక్తిని చైతన్యవంతం చేసి జ్ఞాన శక్తిగా రూపాంతరం మొందింపగల సమర్ధులు విష్ణు గారు. వాస్తవానికి శక్తి జాగారం అనంతరమే సాధన ప్రారంభమవుతుంది. అందుకే విష్ణు గారి కృపాకటాక్ష వీక్షణాలు ఈ నగరం వరకే పరిమితం కాకుండా ఎల్లెడలా వ్యాప్తి చెందాలని , అయన చల్లని నీడలో మరెందరో స్వాంతన పొందాలని నా అభిలాష......"
    కలెక్టర్ ప్రసంగం వింటున్న ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ కు అంతా అయోమయంగా వున్నది. ఆమె అలా మాట్లాడుతుందని అతను ఏ మాత్రం ఊహించలేదు.
    విష్ణులో ఎలాంటి మహిమలూ లేవని ఇప్పటి వరకూ తమతో ఘంటాపదంగా చెప్పి, పరిశోధించమని తనను ప్రోత్సహించిన జిలా కలెక్టర్ ఎంతో ఆవేశ పూరితంగా విష్ణు అతీంద్రియ శక్తులు వున్న మహా మహిమాన్వితునిగా వందలాది ప్రజల ముందు చెప్పడాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలో తోచక సతమతమైపోతున్నాడు.
    ఏసిపి కిరణ్మయి కూడా అలాంటి డైలమాలోనే వున్నది.
    వేదిక పైనున్న భారతి, రీటాలలో చెప్పలేనంత అనందం.......తాము అభిమానించే విష్ణుని గురించి అంత గొప్పగా అందరూ పొగుడుతుంటే వాళ్ళ మనసు పొరల్లో అంతులేని తన్మయత్వం చిందులు వేస్తున్నది.
    తిరిగి ధీరజ ప్రసంగం కొనసాగించింది.......
    "నాకు కొద్దో, గొప్పో ఆద్యాత్మిక చింతన చిన్నతనం నుంచి అలవడటం వలన ఎందరో మహోమాన్వితుల భోదనామృతాలను ఆసక్తిగా వినేదానిని. నాకు తెలిసిన కొద్ది జ్ఞానాన్ని విజ్జుల ముందుంచాలనుకుంటున్నాను. నా ప్రసంగంలో కాని, భావంలో కాని , బాధలో గాని ఏమైనా తప్పులు వుంటే విష్ణు గారు సరిదిద్దగలరు....."
    అసలు ఆమె ఏం చెప్పబోతున్నదో , ఏం చెప్పాలనుకుంటున్నదో ఎవరికీ అర్ధం కావడం లేదు.
    విష్ణు పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి.....అతని ముఖంలో చెక్కు చెదరని ప్రశాంతత.
    'భౌతిక, అది భౌతిక భుమికలలో వున్న ఈ సృష్టి అంతా వివిధ శక్తుల యొక్క, లీల అని వేద విధులు భావిస్తారు. అవి అన్నీ ఒకే మహా శక్తి యొక్క వివిధ రూపాలు, సర్వ నాస్తి, సర్వ శక్తి మతం అయిన బ్రహ్మ పదార్ధం నుంచి ఆ మహాశక్తి అభివ్యక్తం అవుతున్నది. ఆవిరితో నిండి అంతటా వ్యాపించి వున్న వాతావరణం నుంచి పొగమంచు, మబ్బులు , మెరుపులు, ఉరుములు, వర్షం , వడగళ్ళు, మంచు ఏర్పడడంతో ఈ పక్రియ పోల్చవచ్చు.
    "మహాశక్తి యొక్క అభివ్యక్తి జరిగిన వెంటనే అందుకు అనుగుణమైన సంలీనం జరిగి ఒక చక్రం పూర్తవుతుంది. అనంతమైన మహా శక్తి సృష్టి వ్యాపార సమయంలో గతి శీల దశలో కనిపిస్తుంది. ఒక పదార్ధాన్ని తయారుచేసిన తరువాత ఆ పదార్ధంలోని ఒక మూల కేంద్రంలో స్థిరమైన శేషరూపంలో అనంతమయిన తన అవ్యక్తతత్వంలో తనను తాను మరుగుపరుచుకుంటుంది. ఈ శేష రూపంలో దానినే కుండలినీ శక్తి అని పిలుస్తారు.
    "మనలో చాలామందికి ఈ కుదలినీ శక్తి అంటే ఏమిటో తెలియదు. అది మనలో ఎలా జగ్రదావస్తలో వుంటుందో కూడా తెలియదు.........ఎన్నాళ్ళనుంచొ విష్ణు గారిని ఈ శక్తిని గురించి వివరించమని అడగాలనుకుంటున్నానే తప్ప ఆ అవకాశం లభించలేదు. ఈ సభాముఖంగా వివరణ ఇవ్వగలరని అభ్యర్ధిస్తున్నాను......అలానే ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తీ జీవితం పై దాని ప్రభావం ఎలా వుంటుందో కూడా వివరించగలరు.....' అని చెప్పి కుర్చీలో అసీనులైంది కలెక్టర్ ధీరజ.
    సభికులు రెప్ప వేయడం కూడా మరచిపోయి ఆమె అద్భుత ప్రసంగాన్ని విన్నారు.
    ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ ఒక్కసారిగా ధీరజ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్టు అనుభూతి కలిగింది.
    భారతి, రీటాలు ఆమె ఆద్యాత్మిక అవగాహనకు అచ్చెరువొందారు.
    ఎలాంటి భావాన్ని వ్యక్తీకరించకుండా గంబీరంగా వున్నది ఒక్క విష్ణు మాత్రమే.
    అప్పటికే విష్ణు ప్రతిపాదనపై అసంఖ్యాకంగా స్పందించిన భక్త జనులు తమ తమ సందేహాలతో నింపిన పేపర్లను వేదిక పైకి పంపారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS