"ఆ మనిషెవరో నీకు తెలుసా?"
"తెలియదు."
'మరి అతడు నిన్నెలా గుర్తు పడతాడు?"
"డాక్టర్ గ్రే మనిషి కోసం నేనిక్కడికి గ్రేకలర్ పుల్ సూట్ లో వచ్చాను....' అన్నాడు విశ్వనాద్.
వెయిటర్ రాగానే మరో బీరు ఆర్డరిచ్చాడు వేదాంతం.
రెండోసారి బీరు తాగకుండా ఓ వ్యక్తీ వారిని సమీపించాడు. విశ్వనాద్ నిచూసి "ఆర్ యూ డాక్టర్ విశ్వనాద్....?" అని అడిగాడు.
విశ్వనాద్ తలాడించాడు.
'అయాం ప్రం ప్రొఫెసర్ ఆర్నాల్డ్" అన్నాడతడు.
"ప్లీజ్ బీ సీటేడ్!" అన్నాడు విశ్వనాద్."
అతడు కూర్చోలేదు. ఒక చిన్న లెదర్ బాగ్ అతడి కందించి "ఇక్కడింకో అరగంట ఉండి అప్పుడు బయల్దేరండి. మీ అపార్టుమెంటు కు వెళ్ళేవరకూ బ్యాగు తీసి చూడవద్దు?" అని చెప్పి వెళ్ళిపోయాడు.
"ఇంకో అరగంటంటే ఏమార్దారివ్వాలి?"
"హోం బర్గర్స్!" అన్నాడు విశ్వనాద్."
"అంతా డిటెక్టివ్ కధలా వుంది. వాటం చూస్తుంటే ఎవరో మనిషి మననిక్కడే ఉండి గమనిస్తుండ వచ్చునని కూడా అనిపిస్తుంది.' అని వేదాంతం ఉలిక్కి పడ్డాడు.
కాస్త దూరంగా కూర్చీలో వున్న ఒక వ్యక్తీ వారిద్దరి వంకా ఆసక్తిగా చూస్తున్నాడు.
"అతడు నీకు తెలుసా?" అంటూ వేదాంతం విశ్వనాద్ కతడ్నీ చూపించాడు. విశ్వనాద్ అటు చూసి తెలియదన్నట్లుగా తలాడించాడు.
'ఉత్త వెధలాగున్నాడు. బోడి మొహం వాడూను. ఇంకేమీ పనిలేదన్నట్లు మన వంకనే చూస్తున్నాడు. బ్రెడ్ నములుతుంటే గాడిద గడ్డి తింటున్నట్లుంది ..." అన్నాడు వేదాంతం కసిగా.
"మనకు తెలియని వాడి గురించి ఎందుకూ అలా తిట్టడం ?"
"ఎందుకంటె ....?' అని స్వరం బాగా తగ్గించాడు వేదాంతం. "వాడి ముఖంలో నా తిట్లకు అనుగుణంగా మార్పులు వస్తున్నాయి. తననే తిడుతున్నట్లు వాడికి తెలుస్తొందనుకుంటాను . అదిగో .....లేస్తున్నాడు.....చూడు.....వెళ్ళి పోతున్నాడు...."
వేదాంతం మాటలు కాశ్చర్య పడుతూ....."వాడికి మన మాటలు వినిపడ్డాయంటావా ?" అన్నాడు విశ్వనాద్.
"వినపడ్డం గురించి కాదు నా ఆశ్చర్యం అర్ధమవడం గురించి....
"అంటే...."
"వాడు చూడ్డానికి అమెరికన్లా వున్నాడు కాని తెలుగొచ్చు ....'
"అంతా నీ అనుమానం ?"
"లేదు....వాణ్ణి చాలా సేపట్నీంచి గమనిస్తున్నాను. మన మాటలకనుగుణంగా మారుతున్నాయి వాడి ముఖ భావాలు. ప్రొఫెసర్ ఆర్నాల్డ్ మనిషి వచ్చి వెళ్ళేదాకా నేను వాణ్ణి సీరియస్ గా తీసుకోలేదు....
"ఏమో ...లేనిపోనీ అనుమానాలు మనసు పాడుచేస్తాయి ...." అన్నాడు వేదాంతం.
"నా మాట విను మిగతా విశేషాలు మనం గదికి వెళ్ళాక మాట్లాడుకుందాం. నీతో పాటు నేనూనీ అపార్టుమెంటుకి వస్తాను....." అన్నాడు వేదాంతం.
ఆర్నాల్డ్ మనిషి చెప్పిన ప్రకారం అపార్టు మెంటు చేరుకునేసరికి ఇద్దరికీ నలభై నిముషాలు పట్టింది.
ఇద్దరూ కారు డిగారు.
అప్పుడే లోపల్నుంచీ కాబోలు వస్తూ వారిద్దరికీ ఎదురయింది లాండ్ లేడీ మిసెస్ మార్గరెట్.
ఆమె విశ్వనాద్ వైపు పలకరింపుగా చూసి నవ్వి..... వేదాంతం వైపు తిరిగి "వాడుయుడూ" అంది.
"ఫైన్, వాడు యుడూ ..." అన్నాడు వేదాంతం.
ఆమెకు వేదాంతం తెలుసు... విశ్వనాద్ ను అపార్ట్ మెంటు లో కలుసుకుందుకు వచ్చే ఏకైక మిత్రుడు వేదాంతం. అతడి పేరుకు అర్ధం కూడా తెలుసు.' "యూ ఆర్ మిస్టర్ ఫిలాసఫీ ...వాటే సేక్యురియర్ నేమ్ " అందామె మొదటిసారి అతడి పేరు విన్నప్పుడు.
వేదాంత, భక్తీ, గీత, స్వామి, యోగి, జ్ఞాన వంటి పదాలిప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుసు.
మిసెస్ మార్గెరెట్ నవ్వుతూనే వెళ్ళిపోయింది.
ఆనవ్వుకు డిటాచబుల్ స్మైల్ అని పేరు పెట్టాడు వేదాంతం. ఆధునికతలోని ప్రత్యేకత ఆ నవ్వు. పలకరింపు కోసం ఆ నవ్వును ముఖం మీద కిట్టె తీసుకుని రావచ్చు. మనిషిలా కనుమరుగు కాగానే నువ్వు కూడా ఇట్టే మాయమవుతుంది.
మనిషి తన సంతిశాన్ని ప్రకటించుకునెందుకు నవ్వు పుట్టింది. నవ్వు మనిషికి మాత్రమే సాధ్యపడుతుంది. మనసుకుల్లాసం కలిగినప్పుడు దానంతటదే ముఖం మీద ప్రత్యేక్ష మవుతుంది. అది తొలగిపోవడానికి కొంతసేపు పడుతుంది.
అలాంటి నవ్వును ఆధునికత కృత్రిమం చేసిందని వేదాంతం బాధపడుతుంటాడు .
ఇద్దరూ మాట్లాడుకోకుండా అపార్ట్ మెంట్లోకి నడిచారు.
పన్నెండడుగుల పొడవు, అంతే వెడల్పు ఆ గది! తక్కువ స్థలంలో ఉన్న ఎక్కువ సదుపాయాలేర్పరచుకోవచ్చో ఆ గది ఉదాహరణ.
నేలమీద కార్పెట్ పరచి వుంది. గదిలో మొత్తం మూడు అలమారాలున్నాయి. వాటిలో ఒకటి బట్టలకు, రెండవది పుస్తకాలు, వగైరాలకు, మూడవది అల్మారా కమ్ కిచెన్ తలుపులు తెరిస్తే ఒక అరలో స్టవ్ లుంటాయి. మిగతా అరల్లో వంట సామాగ్రి , వంట దినుసులు ఉంటాయి. అందులోనే చిన్న వాష్ బెషిన్లు రెండున్నాయి. ఒకదాంట్లో వేన్నీళ్ళు కుళాయుంది.చన్నీళ్ళ కుళాయి లోంచి వచ్చేనీరు ఐసు వాటరు.
గది మధ్య నాలుగు కుర్చీలు . వాటి మధ్యలో ఒక టీపాయి. టీ పాయి ఫోల్దింగ్ విప్పితే డైనింగ్ టేబిలంత పెద్దదవుతుంది.
పుస్తకాల బీరువాను నేలమీద వాల్చితే కుషన్ పరుపులా మంచంగా మారుతుంది. ఆ బీరువాకు పక్కనే రిఫిజరేటరుంది.
గదిలో వేరే బెడ్ లైటు లేదు. ఫ్యాన్స్ కుండే లాగున అక్కదీ దీపాలకూ రెగ్యులేటరుంది. దీపం కాంతిని మన అవసరం మేరకు హెచ్చించు కోవచ్చు తగ్గించుకోవచ్చు....
మిత్రులిద్దరూ చెరో కుర్చీలోనూ కూర్చున్నారు.
"నాకు వంకాయ కూర చేసి పెట్టు....' అన్నాడు వేదాంతం.
"కోడి కూరవద్డా?"
"కోడి కూరకేం? నా గదిలోనే చేసుకోవచ్చు" అన్నాడు వేదాంతం.
'అవుననుకో ....నాకు మసాలాలు దట్టించడానికి లేదు గదా....' అన్నాడు విశ్వనాద్ నవ్వుతూ.
'అదృష్టవంతుడివి బ్రదర్....మంచి లాండ్ లేడీ దొరికింది నీకు.."
'అదృష్టం నాది కాదు అమెరికన్సుది. మిసెస్ మార్గరెట్ తో పరిచయం లేకపోతే నువ్వు అమెరికన్ లాండ్ లేడీస్ మీద దుష్పచారం చేసేవాడివి. ప్రతిదానికీ స్వనుభావమే కదా ఆధారం నీకు....' అన్నాడు విశ్వనాద్.
వేదాంతం లాండ్ లేడీ పేరు మిసెస్ కాధరీనా!
ఆమెకు నల్లవారంటే ద్వేషం. భారతీయులంటే చిన్న చూపు. అయితే ఆ విషయం ఒప్పుకోదు. హిపోక్రసీ లో అమెరికా ప్రభుత్వానికి తీసిపోదామే. తన ఇంటిని భారతీయులకు మాత్రమే అద్దెకిస్తుంది. తారాపూర్ రియాక్టరుకు అమెరికన్సు కండిషన్స్ పెట్టినట్లు ఇంట్లో అద్దె కుండే ఇండియన్స్ కామె ఎన్నో షరతులు పెడుతుంది.
వేదాంతం గది విశ్వనాద్ గది కంటే పెద్దది. వంట గది వేరే ఉంది. అయినా సరే వేదాంతం అక్కడ కోడిగుడ్లు, మాంసం, మినహా ఇంకేమీ ఉడకబెట్టకూడదు. పచ్చి కూరల వంటకం అక్కడ నిషిద్దం. ఎందుకంటె భారతీయుల కొక్కసారి చనువిస్తే మసాలాతో వంటలు ప్రారంభిస్తారు ..' అ వాసనలే ఆమెకు పడవు.
కాధరీనా వేదాంతంతో ఎంతో అభిమానంగా మాట్లాడుతుంది. అతణ్ణి మెచ్చుకుంటూ భారతీయుల అచార వ్యవహారాలను తిడుతుంది. భారత దేశపు దారిద్ర్యాన్ని నిరసిస్తుంది.
"నీవంటి వాళ్ళేక్కువమంది అమెరికాలో కొన్నాళ్ళుండి వెడితే దేశం మీద తప్పక తిరగబడతారు ..." అంటుండేదామె.
కేవలం తన మనసుకు బాధ కలిగించాలను కున్నప్పుడే ఆమె తననాధరించి గౌరవిస్తుందని వేదాంతానికి తెలుసు . ఆమెపట్ల అతడికి ద్వేషమేర్పడి అది అమెరికన్స్ మీదకు మళ్ళుతుండేది.
"అన్ని దేశాలలోనూ అన్ని రకాల మనుషులూ ఉంటారు. అమెరికన్సు గురించిన నీ అభిప్రాయాలూ మార్చడం కోసమే నీకు మార్గరెట్ పరిచయం కూడా అయింది.." అని వేదాంతంతో అనేవాడు విశ్వనాద్.
