Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 2

 

    "ఇదిగో చిటికెలో వస్తానక్కా " అంటూ తులసి లోపలికి వెళ్ళింది. ఆ గదిలో పిల్లలందరూ కింద పరుపులమీద ముసుగుతన్ని పడుకున్నారు. అందరూ గాడనిద్రలో ఉన్నారు. దాదాపు పదిమంది వరకు వున్నారు. తులసి గ్లాసులో నీళ్ళు పట్టుకుని మెల్లగా వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. ఒక్కొక్కరి దుప్పటి తొలగిస్తూ ముఖం పైన నీళ్ళు చల్లుతూ లేపుతోంది.

                                               2

    అమ్మా దాక్షాయణి ఆ బక్కెట్ తో నీళ్ళు తీసుకురా....."అంది కస్తూరి.

    "ఇదిగో వస్తున్ననక్కయ్యా..." అంటూ బక్కెట్ తీసుకుని బావి దగ్గరకు వెళ్ళింది దాక్షాయణి.

    "అమ్మా! ఆకలేస్తుందే. ఇంకా వంట పూర్తీకాలేదా?!" అంది జయంతి.

    "అయిపోయిందమ్మా. ఇంకెంత పదినిమిషాలు...ఈలోపు మీరు లోగిలి అంతా శుభ్రంగా ఉడ్చి చాపలు పరచండి" అంది కూతురితో కస్తూరి.

    "ఆ పనేప్పుడో చేశాం...మీదే ఆలస్యం" అంది జయంతి.

    ""ఏంటి కోడలుపిల్లా నీ గొడవ? పదినిమిషాలాగు వడ్డించేస్తాం. మీ బావ వచ్చాడా, ఇంకా స్నేహితుల్తోకలిసి ఊరంతా తిరుగుతున్నాడా?" అంది భ్రమరాంబ జయంతిని మురిపంగా చూసుకుంటూ.

    "ఏమో....ఎక్కడ తిరుగుతున్నాడో నాకేం తెలుసు?" అంది జయంతి.

    ఇప్పట్నుంచే అదుపులో పెట్టుకోవాలే పిచ్చి మొద్దూ....రేపు పెళ్ళయ్యాక నీ మాటే వింటాడు వాడు?"అంది దాక్షాయణి
    "ఇదిగో పిన్ని.....ఇంక్కోక్కసారి అలా మాట్లాడితే ఊరుకోను. నాకు ఆ చింపిరి జుత్తోడ్ని చేసుకునే ఖర్మేం పట్టలేదు." అంది జయంతి.

    "ఓయబ్బో మరింకేవర్ని చేసుకుంటావే....చూశావా అక్కా నీ కూతురేమంటుందో?" అంది దాక్షాయణి.

    "దాని మాటలకేంలేవే.....సురేంద్రకేం తక్కువే నీ కాబోయే మొగుడు వాడేగా" అంది కస్తూరి.

    "అమ్మా! నువ్వు కూడా అంటున్నావా? ఏం కాదు" అంటూ గారంగా ఏడుస్తూ చిందులు తొక్కింది.

    "ఏంటే మరదలుపిల్లా.....అలా చిందులు తోక్కుతున్నావ్? మీ అమ్మ అన్నం పెట్టనందా?" అన్నాడు సురేంద్ర అప్పుడే అక్కడకు వస్తూ.

    "చూడరా...నిన్ను చేసుకోమంటే అది కాదూ కుడదు అని ఎలా చిందులు తొక్కుతుందో" అంది భ్రమరాంబ కొడుకుతో.

    "ఈ పిల్లరాక్షసిని ఎవరు చేసుకుంటారే....నాకేం ఖర్మ? నేను చచ్చినా దాన్ని చేసుకోను" అన్నాడు సురేంద్ర.

    "బావుందిరా మీ వరస.....సరేలే...పదండి లోపలికి, భోజనాలు వడ్డిస్తాం." అంది దాక్షాయణి వాళ్ళను చూసి నవ్వుకుంటూ.

    "అక్కా! బావగారు నిన్ను పిలుస్తున్నారు" అంది శివపార్వతి అప్పుడే లోపలినుంచి వచ్చి.

    "అలాగా? ఆయనెప్పుడోచ్చారు? ఎంతమందిని తెచ్చారేమిటి స్నేహితుల్ని భోజనాలకు?" అంది కస్తూరి నవ్వుతూ.

    "కరణంగారూ....రామనాధంగారూ ఇద్దరే వచ్చారు" అంది శివ పార్వతి.

    "ఎందుకనో ఈసారికి ఇద్దరితోనే సరిపెట్టారు?" అంది కస్తూరి.

    "ఎందుకంటే....తొందరలోనే తులసి పెద్దబంతి భోజనాలు పెట్టించబోతుందిగా అందుకే మా తమ్ముడు ఎవర్ని పిలిచి వుండడు" అంది భ్రమరాంబ.
    "అది నిజమేలే....ఈసారి కూడా ఊరంతటిని పిలుస్తారేమో బావగారు! జయంతికి కూడా అలానే చేశారుగా" అంది దాక్షాయణి.

    "అమ్మా దాక్షాయణి ఈ పులుసు వుడికాక దాన్లో ఈ సొరకాయ ముక్కలు వేయి....నేను లోపలికి వెళ్ళొస్తా, మీ బావగారు పిలుస్తున్నారట కదా...." అంది కస్తూరి.

    "అలాగే అక్కయ్యా! మీరెళ్ళీరండి. నేను చూసుకుంటాలే" అంది దాక్షాయణి.

    "ఏం కూరలు చేశావ్?" అంది భ్రమరాంబ.

    "పప్పు గోంగూర....దోసకాయ పులుసు....పప్పుచారు, కాకరకాయ వేపుడు....వంకాయ ఇగురూ...పులిహోరా....సాంబారు..." అంది దాక్షాయణి.

    "పాపం బానే కష్టపడ్డారే. చాలా కూరలు చేశారు. నేను మీకు సాయపడదామానుకుంటే నన్ను ఏ పని చేయనియారాయే" అంది భ్రమరాంబ.

    "మీకేందుకండి వదినగారు! శ్రమ మేము లేమా...?" అంది శివ పార్వతి.

    "దాక్షాయణి! దాక్షాయణి! నా లుంగీ ఎక్కడుందో చూసిపెట్టు" అని కేకేశాడు మాధవరావు.

    "అబ్బబ్బ! ఈయన కంటికి ఏమి కనపడవు. అన్నీ చూసిపెట్టాలి" అనుకుంటూ లోపలికి వెళ్ళింది దాక్షాయణి.

    "పార్వతీ ! సొరకాయ ముక్కలు పులుసులో వేశారా?" అనుకుంటూ వచ్చింది కస్తూరి
    "వేశానక్కా! ఇంకో అయిదు నిమిషాల్లో దించెయ్యొచ్చు. అంది శివపార్వతి.

    "మా మరిది ఏం చేస్తున్నాడు?" అంది కస్తూరి.

    "వచ్చారక్కా! పిల్లల్తో ఆడుకుంటున్నారు..." అంది శివ పార్వతి నవ్వుతూ.

    "సోమసుందరంకు ఇంకా చిన్నపిల్లల బుద్దులు పొలెదూ..." అంది నవుతూ కస్తూరి.

    "అబ్బో! చిన్న మరిదంటే ఎంత ప్రేమో....మా మరదలికి" అంది భ్రమరాంబ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS