సెకండ్ షో వదిలిన తరువాత మగవాళ్ళు లేకుండా యెలా నడిచిపోగలం? వచ్చేటప్పుడు అయితే సినిమా మోజుతో వచ్చేశాంగానీ అంత రాత్రిపూట ఊరికి వెళ్ళడం మహా ఇబ్బంది.
అదేం మా దురదృష్టమొగానీ మా ఊరివాళ్ళు ఒక్కరూ కనిపించలేదు.
సినిమా అయిపోయింది.
మేం నలుగురం బయట నిలబడి, గుంపులో యెవరయినా మాఊరివాళ్ళు వున్నారేమో చూస్తున్నాం.
"అడిగో దినకర్" అరిచింది సరస్వతి ఆనందంతో.
ఆ మాటకి నేను ఉలిక్కిపడ్డాను.
నాకళ్ళు హాలు లోపలి నుండి వస్తున్న జనాన్ని జల్లెడ పట్టాయి.
దినకర్ మమ్మల్ని చూసి దగ్గరికొచ్చాడు.
"ఎవరూ తోడు కనపడలేదని ఒకటే కంగారుపడిపోతున్నాం. మన ఊరివాళ్ళు ఇంకెవరయినా వచ్చారా?" సరస్వతి పిన్ని రాజేశ్వరి అడిగింది.
"లేనట్లున్నారు ఎవరూ కనిపించలేదు. నేనూ ఎవరయినా వున్నారేమోనని వెతుకుతుంటే మీరు కనపడ్డారు" అన్నాడు దినకర్. నన్నక్కడ చూడడంతోనే అతనిలో ఏదో మార్పొచ్చిందని నేను గ్రహించాను.
"మరిక వెళదాం. నువ్వు మాకు తోడు, మేము నీకు తోడు" అని అందరం కదిలాము. సరాసరి టౌనులోకి వచ్చాం.
"రా వదినా! కాఫీ తాగుదాం" రాజేశ్వరితో అన్నాడు.
"అంతమందిలోనా? నేనెప్పుడూ తాగలేదయ్యా నువ్వెళ్ళి తాగిరా" అని, "మీలో ఎవరయినా తాగుతారా?" అంటూ మావేపు చూసింది.
మేం తాగుతామన్నట్లు తల వూపాం.
అంగడి దగగ్రికి వెళ్ళాం.
కాఫీలు తాగాక తిరిగి బయల్దేరాం.
మావూరికి వెళ్ళే మెయిన్ రోడ్డెక్కాం.
అంతలో యెవరో మంత్రం వేసినట్లు వాతావరణమంతా మారిపోయింది. ఆకాశం లోకంమీది నిరసనతో నల్లబ్యాడ్జీ ధరించినట్లు మబ్బులు అలుముకున్నాయి. గాలి చల్లగా తగుల్తోంది.
ఈ పరిణామానికి బెదిరి అడవిలోని జంతువులు గుండెలు బాదుకుంటున్నట్లు ఉరుములు ఉరిమాయి. దేవకన్య కట్టుకున్న సిల్కుచీర చిరిగిపోతున్నట్లు మెరుపులు మెరుస్తున్నాయి.
"ఇదేందిరో భగవంతుడా యిప్పుడు వర్షం వస్తే మన గతి ఏంగాను? అందుకే ఈ సరస్వతికి చెప్పాను సినిమా వద్దూ అని. కానీ ఇది వినిందా? మొగుడుండగా తాళి తెంపేసే రకం ఇది. బయల్దేరేవరకు ఒంటికలి మీద నిలబడింది" రాజేశ్వరి సరస్వతిని శాపనార్ధాలు పెట్టడం ప్రారంభించింది.
మేమంతా కూడా ఆందోళనలోపడి త్వరగా ఇంటికి చేరాలని అడుగులు గబగబా వేస్తున్నాం.
"ఎండాకాలం సినిమాకు బయల్దేరడం, విధవపిల్ల రంకు చేయడం ఒకటే. ఎండాకాలం వాన ఎప్పుడొస్తుందో, ఆ పిల్లకి కడుపు ఎప్పుడొస్తుందో తెలియదు. రెండూ అపాయకరమే" రాజేశ్వరి దినకర్ వున్నాడన్న స్పృహ కూడా కోల్పోయింది.
సన్నటి చినుకులు గుండుసూదులు ఆకాశంలోంచి రాలుతున్నట్లు మొదలయ్యాయి.
రాజేసవ్రి మరింత యాగీ చేయడంతో అందరం పరుగు పెడుతున్నట్లు నడుస్తున్నాం.
అంత స్పీడుగా నడవడం యెప్పుడూ అలవాటు లేకపోవడంవల్ల నేను వెనకపడ్డాను.
చినుకులు మరింత ఎక్కువయ్యాయి.
ముందు వాళ్ళంతా మరింత వేగం అందుకున్నారు. నేన్ ఉ మరింత వెనకపడ్డాను.
"రేయ్ దినకరా! మహిత మరీ వెనకపడినట్లుంది. నువ్వుండి పిలుచుకురా మేం రాయుడి మిషన్ దగ్గరికెళ్ళి నిలుచుంటాం. వాన తగ్గాక వెళ్ళచ్చు"
రాజేశ్వరి చెప్పడం లీలగా విన్పించింది.
చినుకులు ముఖాన్ని ఈడ్చికొడుతుండడంతో పైట తీసి కప్పుకున్నాను. చీకటి నల్లటి తాచుపాము చర్మంలా భయపెడుతోంది.
రోడ్డుపక్కనున్న చింతచెట్లు మోకాళ్ళ మీద కూర్చున్న దెయ్యాల్లా వున్నాయి. వర్షం మరింత ఎక్కువయింది. ఏదో ఆకారం నా ముందుకు వచ్చి నిలబడ్డట్టు దినకర్ కనిపించాడు.
"బాగా వెనకబడిపోయావే వాళ్ళు చాలా ముందున్నారు స్పీడుగా అడుగులేయాలి" అన్నాడు.
అప్పటికే నా పని అయిపోయింది. ఆయాసం గుండెల్ని పైకి ఎగదీస్తున్నట్లు ఊపిరి పీల్చడం కూడా కష్టమైపోతోంది.
తల అడ్డంగా ఊపాను. కాలు కదపడానికికూడా శక్తి చాలటంలేదు.
జాతరలో దప్పుల శబ్దంలా చినుకుల చప్పుడు.
"బాగా తడిసిపోయావే"
"ఆఁ"
వాన మరింత బలమైంది. దారి కూడా కనపడడం లేదు. గాలి కొరడా దెబ్బల్లా తగుల్తోంది. ఓ చింత చెట్టుకింద నిలబడిపోయాం.
"ఈ చెట్టు కింద లాభం లేదు. మరింత తడిసిపోతాం. ఎన్టీఆర్ గోడౌన్స్ ఇక్కడికి దగ్గరే. అక్కడికెళ్ళి నిలబడదాం. మనవాళ్ళు కూడా అక్కడే వుంటారు" అన్నాడు దినకర్.
నేను ముందుకి కదిలాను. ఈ వర్షంలో కాలుతీసి వేయడం కూడా కష్టంగా వుంది.
ఎట్లానో తంటాలు పడి గోడౌన్ ముందుండే ఆఫీసు వరండాలోకి వెళ్ళి నిలబడ్డాము. ఆ గోడౌన్ల పేరు ఏదో వుంది. అందరూ ఎన్టీఆర్ గోడౌన్లు అనే అంటారు. పగలు పావురాళ్ళ గూడులా వుండే ఆ గోడౌన్ ఆ రాత్రి ముగుగేసుకుని పడుకున్న రాక్షసుడిలా వుంది.
'మనవాళ్ళు లేరే' చీకట్లో కళ్ళను చీల్చుకుని చూసి అన్నాను.
'వెళ్ళిపోయినట్లున్నారు. రాయుడి షెడ్ లో వుంటామన్నారు'
రాయుడి షెడ్ ఇంకా రెండు ఫర్లాంగులుంటుంది.
'ఆఫీసు ఇంత బోసిగా వుందే ఎవరూ వుండరా?"
'పగలుంటారుగానీ ఇప్పుడుండరు. నైట్ వాచ్ మెన్ ఈ వానకు ఏకాక్దో ముడుస్కుని వుంటాడు.'
అటూ ఇటూ చూస్తున్న నాకు ఓమూల ఏదో కదిలినట్లనిపించి అనాలోచితంగా అతని ముందుకు జరిగాను.
ఆ ఆకారం నామీదకే వస్తోంది. భయం గుండెను చీల్చినట్లు ఝల్లుమన్నాను. అతనికి మరింత దగ్గరకు జరిగాను.
కళ్ళు చిట్లించి చూస్తే అది కుక్క అలికిడికి లేచినట్లుంది. గుండె సర్దుకుంది. అతని నుంచి దూరంగా జరగబోయాను.
ఇది ఊహించినట్లు అతను చేయి పట్టుకున్నాడు. గీజర్ లో రక్తాన్ని వేడెక్కించి, తిరిగి ఒంట్లోకి ఎక్కించుకుంటున్నట్లు వెచ్చగా అయిపోయాను. ఇది నేను ఊహించని పరిణామం.
అలా ఏమీ మాట్లాడకుండా, ఠక్కున ముందుకు వంగి పెదవులు అందుకున్నాడు. కొత్తరుచి గొంతులోకి దిగుతోంది. ఏదో పిచ్చిపట్టిన వాడిలాగా గట్టిగా పొదివిపట్టుకుని అదుముకున్నాడు. ఎముకలు విరిగిపోతాయేమోనని పించేంత గట్టిగా వాటేసుకున్నాడు. నాలుకతో ముఖాన్నంతా తడుముతున్నాడు. వాన చినుకులో లేక ఎంగిలో తెలియహ్డు చెమ్మ చెమ్మగా తగుల్తోంది. ఎద పొంగిందో లేక అతని ఒత్తిడో తెలియదు. జాకెట్ మొదటి హుక్ తెగింది. అతని పట్టువల్లో లేక చలికి కుంచించుపోయిందో తెలియదు నడుము మరింత సన్నబడినట్లనిపించింది. అతని కళ్ళు పెనవేశాడో లేక కోరిక బరువో తెలియదు. నా కింది భాగమంతా మరింత బరువెక్కింది.
