Previous Page Next Page 
పాప నవ్వింది పేజి 11

 

    అంతా విన్నాక రాజేశ్వరి తెల్లగా పాలిపోయి ' ఆ మాటన్నావా కమలా' అంటూ తలపట్టుక్కుర్చుంది.
    'ఇదేమిటి? నిజం న్యాయం గుర్తించగలదనుకున్న రాజేశ్వరి కూడా ఇంట్లా అంటున్నది? ఔను నిజమే. ఎంతైనా శ్రీపతి కన్న కొడుకు, తాను పరాయమ్మ కన్నబిడ్డ, ఇక్కడ డబ్బుకి పనుచేసే పాపకి పెద్ద ఆయా అంతే' అని కుముతున్నది కమల ధారగా కన్నీరు కారుస్తూ.
    రాజేశ్వరి కమల భుజాల చుట్టూ చేతులేసి దగ్గరకు తీసుకుని కన్నీళ్లు తుడుస్తూ మెల్లగా 'నాదే పొరపాటమ్మా కమలా, నేను నీ దగ్గర దాచకుండా జరిగిందంతా చెప్పాల్సింది. చెప్తే ఈ పోరాపాటు జరిగేది కాదు. ఇదంతా నానించే' అంటూ' నువ్వు ఏడుపు మాను. అంతా చెప్తానని కమల గడ్డం పట్టుకుని బతిమాలుతూ తన కళ్ళవెంట కారుతున్న నీళ్ళు తుడుచుకుంది.
    ఇంతమటుకు రాజేశ్వరి ఏ సమయంలోనూ కళ్ళ నీళ్ళు పెట్టుకోటం కమల చూడలేదు. ఇప్పుడావిడ దుఖం చూసి ఏం చెయ్యాలో తోచక ఆశ్చర్యపోతూ కళ్ళు తుడుచుకుని వినడానికి సిద్దంగా కూర్చుంది.
    'ఆరేళ్ళ నాటి మాటమ్మా ఇది అప్పుడే శ్రీపతి (ఐ.ఎ.యెస౦ ఐనాడు. అందరం సంతోషంగా ముందుముందు జరిగే శుభాలని తల్చుకుని మురుస్తూ వాటికోసం ఎదురు చూస్తున్నాం. అప్పటి ఒక సంఘటనతో మా బతుకులు ముఖ్యంగా శ్రీపతి జీవితం పెద్ద దెబ్బతిన్నై. శ్రీపతి ఐ.ఏ.ఎస్ చదివే రోజుల్లో ఆశ అనే అమ్మాయితో పరిచయమైంది. పిల్ల చూట్టానికి తెలివిగా చక్కాగానే వుండేది. ఉత్తరాది పిల్ల. మానమాటా మంతీ లేదు. వాడితో పాటే ఐ.ఏ.యస్ కి కూర్చుంది. కాని తప్పింది. ఒకనాడు స్థితిమంతులే. కానీ, వ్యాపారంలో వాళ్ళ తండ్రి దెబ్బ తిన్నాడు. చివరికేమీ మిగలేదు.    
    వీళ్ళ వ్యాపారంలో సమభాగస్తులు వాళ్ళ అత్తయ్య కుటుంబం. అత్తకో కొడుకున్నాడు. కిషోర్ లాల్ అని. ఆశకి ఈడైన వాడు. చిన్నప్పట్నించి వీళ్ళకి పెళ్ళి చెయ్యాలని పెద్దవాళ్ళు అనుకున్నారు. వీళ్ళూ సరేనన్నారు. ఇద్దరూ భాగస్వాములు కావటాన ఈ దెబ్బతో ఇద్దరూ ఒకేసారి బికారైనారు.
    దాంతో ఆశకి వేరే ఆలోచనలోచ్చినై. బావంటే ఇష్టం వున్నప్పటికీ డబ్బులేనప్పుడు చేసుకోటానికి నిరాకరించిందిట. ఎవరూ చెప్పిన వినకుండా.    
    ఆశకి పేరుకు తగ్గట్టు విపరీతమైన ఆశ డబ్బంటే కాంక్ష. ఐ.ఏ.ఎస్ చదివేటప్పుడు మన శ్రీపతి ఐశ్వర్యవంతుడని తెలుసుకుంది. వీడికి వలపన్ని వుచ్చులో ఇరికించింది. ఇంటికొస్తూ పోతూ నయయగారిలాగా చివరి కెట్లాగైతేనేం అదిలించి బెదిరించి పెళ్ళి చేసుకుంది.
    పెళ్ళి చేసుకున్న ఒక్క సంవత్సరమో ఏమో కొంచెం వోద్దికతో బాగానే ఉంది. రెండో సంవత్సరం నిండపోయే ముందు పాప పుట్టింది. అప్పటికే ఆసంతృప్తి మొదలైంది ఆశకి ఒక ఏడాదిగా. శ్రేపతితో  దేనికోదానికి పోట్లట్లం , సందు దొరికినప్పుడల్లా , వీలైనంత డబ్బు దస్కం వెనకేసుకోటం మొదలెట్టింది. ఎడ మొహం పెడ మొహంగా వుంటున్నారు.
    ఇంతలో వాళ్ళ బావకి రేసుల్లో లక్షా యాభైవేలు డబ్బోచ్చిందిట. దాంతో మునపటి వర్తకాన్ని కొని, అదృష్త్యం తిరిగి లక్షలు సంపాదించటం మొదలుపెట్టాడు.
    ఉన్నట్టుండి ఆశ అందినన్ని నగలు రొక్కం చేత పట్టుకుని కన్న బిడ్డ మీద మమకారం తెంచుకుని పాపని వొదిలేసి చెప్పా చెయ్యకుండా ఇంట్లోంచి పారిపోయింది.
    శ్రీపతి ఆశని మళ్ళీ తీసుకు రావటానికి ప్రయత్నం చేశాడు. కాని ఆశ రానంటమే కాక శ్రీపతి నిర్దయుడని, తనని హింస పెట్టేవాడని కోర్టు కెక్కి విడాకులు కోరింది. అదృష్టవశాత్తు , పాపా దానికి జంఝాటం అనుకుని తన కక్కర్లేదని కాయితం రాసిచ్చింది. పాప నా దగ్గరే వుండిపోయింది దేవుడి దయవల్ల.
    అప్పటి వరకు సాధువుగా వుండే శ్రీపతి అందర్నీ నవ్విస్తూ నవ్వుతూ సంతోషపెట్టే శ్రీపతి , చ=వెన్నలాంటి మనసు గల శ్రీపతి , పాషాణంగా మారిపొయినాడు. అప్పటి నించి నిజంగానే నిర్దయుడు, మనుషుల మీద ముఖ్యంగా ఆడవాళ్ళంటే విపరీతమైన కసి అసహ్యం కలిగినై. పురుగుల్ని చూసినట్లు చూసేవాడు. నీరజే వాడి ఎదుటకి పోవటానికి భయపడేది.
    అంతవరకూ ' అమ్మాయ్ నీరజా' అంటూ మట్టుకు తిరిగే శ్రీపతి వీలైనంత వరకూ మమ్మల్ని కూడా తప్పించుకు తిరిగేవాడు, ఇంట్లో పనివాళ్ళు భయపడే వాళ్ళు  వాడి కంట పడటానికి.
    అప్పట్లో శ్రీనివాసరావు బాబాయ్ కాస్త ధైర్యం చేసి ఏదైనా చెప్పేవాడు. వినకపోయినా శ్రీపతి ఆయన్ని ఏమీ అనేవాడు కాదు. ఇక్కడుంటే ఇంక లాభం లేదని తెలుసుకుని బాబాయ్ వ్యాపార మిష మీద విదేశాలకి పంపించాడు.
    పాప పసితనంలో ఆ వెళ్ళిన వెళ్ళటం ఇన్నాళ్ళ కి వచ్చాడు. కాని ఆ చాయలు సాంతం మాసిపోలేదు. మనిషి పూర్తిగా మారలేదు. మునపటి శ్రీపతి కాలేదు.
    మిగతావాళ్ళని చూసి సరి పెత్తుకున్నాడు కాని నువ్వు పాపతో ఆడుతూ పాడుతూ వుంటే వాడికి పాతస్మృతులు తిరుగుతయ్యో, లేక ఇట్లా వుండేది కదా నా సంసారం అనుకుంటాడో, లేకపోతె పాప నీకంత దగ్గరై తనకి దూరంగా వుంటానో ఏమో నిన్ను చూస్తె సెగలు కక్కుతాడు. విరుచుకు పడతాడు. ఇవ్వాళ నీవన్నమాటతో మరోసారి పాప తల్లి చచ్చిపోలేదు , వొదిలేసి వెళ్ళింది చేతైతే తెమ్మన్న అర్ధం తోచడంతో వాడికి వొళ్ళు తెలిసి వుండదు. వాడి గాయాన్ని లోతుగా కేలికావమ్మా కమలా.
    నిన్ను నేను తప్పు పట్టటం లేదు. వాణ్ణి సమర్ధించడం లేదు. వాడే తప్పు. నీకీ కధంతా చెప్పి వుంటే ఈ విధంగా జరిగేది కాదు. నన్ను నేనే తప్పు పట్టుకుంటున్నాను.
    ఈ పరిస్థితుల్లో నిన్నోక్కటే కోరతాను. వాడి మాటలు ఈసారికి పట్టించుకోకమ్మా. వెళ్ళిపోయే ప్రయత్నం విరమించు. పాప అల్లాడిపోతుంది. నీకోసం. నీలో పాప తన తల్లిని చూసుకున్తున్నది. అందుకనే నీకంత దగ్గరైంది. నాకోసం కాకపోయినా, మధురి కోసమైనా మాట విను కమలా' అంటూ చేతులు పట్టుకుంది.
    ఈ కధ విని రాజేశ్వరి కన్నీళ్లు చూసిన కమల గూడా కళ్ళు తుడుచుకుంది.
    'నాకు తెలిస్తే అని వుండనమ్మా అంత మాట మీ సాక్షిగా. ఏమిటో కోపంలో తొందరపడ్డాను. కానివ్వండి. మీరు చెప్పినట్లే వింటాను. మీమాట ఎప్పుడు కాదన్నా' అనటంతో రాజేశ్వరి ఒక నిట్టుర్పు విడిచింది. మనసు కొంచెం తెలికపడ్డది.
    'కాని నాకొక్కటి సందేహంగా వుంది. ఈకేసు ఎట్లా నిలబడ్డదా  అని' అడిగింది కమల.
    రాజేశ్వరి ముఖం వివర్ణమై పోయింది. ఆ వేదన పొడచూపింది. బాధగా ముఖం రుద్దుకుంది.
    'ఒక పెద్ద కధ వుందమ్మా. శ్రీపతి తండ్రి వైపు వాళ్ళు పెద్ద జమీందార్లు. బహుకాలంగా రాజాదరణతో వుండి అంగ బలం , అర్ధ బలంతో విర్రవీగిన వంశం వాళ్ళది. శ్రీపతి తాతగారి కాలం నాటికే ఈ రెండు కొంత తగ్గినై అనే చెప్పాలి. శ్రీపతి తాతగారు ఏకైక పుత్రుడు. ఒక్కడే బిడ్డ కావటాన ధనవంతులు కావటాన ఆడిందాట, పాడిందిపాటగా పెంచారు. అహం, గర్వం నిర్దయ వాళ్ళల్లో కరుడు కట్టింది. వాళ్ళ దృష్టి లో ప్రాణానికి విలువలేదు. తృణప్రాయం. అవతలి మనిషి చచ్చినా బతికినా వీళ్ళకి లెక్కలేదు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని నానా హింసా పెడ్తూ గొడ్డుని చూసినట్లు చూట్టమే కాక గొడ్డుని బాదినట్లే బాదేవాళ్ళుట, బాధించే వాళ్ళుట.
    ఇంతకన్న ఘోరమైనది ఇంకొకటి. వాళ్ళకి ఆడదంటే అలుసు. స్త్రీ కివ్వవలసిన గౌరవ మర్యాద లివ్వకపోగా అది ఒక ప్రాణేనా అని జంతువుకన్నా హీనంగా పాత చీపురు కట్టతో సమానంగా చూసేవాళ్ళుట. బైటివాళ్ళని ఇంట్లో వాళ్ళని తేడా లేకుండా దొరికిన స్త్రీ ల మీద అత్యాచారం కూడా పరిపాటై పోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS