.
" పయరకూర వేచి పోగిపికొను గోఁగుఁబచ్చడిచవికి నింక నోరు చివికితిరు."
ఈ యోగసాధకులకు పుష్టికరమ్తెన యాహారము అవసరము. ట్రిట్మెంటు చేయువారికి ఈ సౌకర్యము మిక్కిలి యవసరము. కాని మదరాసులోనున్న ఆరోజులలో శ్రీ శాస్త్రిగారికి ఏంబదిరూకల వేతనము, పెద్ద కుటుంబము. ఆ ప్తెన వచ్చిపోయేడివారు. సగము ప్తెగా యింటి అద్దెకె ఖర్చు,ఇక బియ్యము, పప్పు, కూరలు, పాలు, నేయి, కట్టెలు, బట్టలు, ఆహొ! నిజముగా నివి యన్నియు శాస్త్రిగారి కుండేడివా? ట్రేట్మెంటుకు వచ్చినవారివద్ద చిల్లిగవ్వ పుచ్చుకోనరు. ఎవర్తెన నాలుగుపండ్లు తేచ్చిరో వారి కనుమానము! ప్రతి ఫలము పుచ్చుకొని ట్రేట్మెంటు చేయు మనుచున్నారని. తెల్ల వారుసరికి, సాయంకాలమగుసరికి ట్రేట్మెంటు వేళకు దహదహ మని యాకలి! యోగసాధనకన్న నాకు చూడగా వారి సంసారసాధనయే కష్ట మనిపించినది. ఆ పేదరికముగూడ వారిని బాగావడభీముఖులనే గావించేడిది. ఇన్ని చిక్కులలోను వారు చలింపక "భారములన్నియు నీప్తెన వ్తెచి నిర్భాయుడన్తె యున్నానులే" అనియో, "తరము గాని ఎండవేళ కల్పతరు నీడ దొరకిన ట్లాయే ఈ వేళ!" అనియో గొంతెత్తి పిల్లవానివలె పాడుచుండఁగా మనము వేరొక ప్రపంచములో నున్నట్లు తోచెడిది. ఆపూటకు బియ్యము లేక, భగవంతుడేమి చేయునో చూతమని జరపిన కథలుకూడ కలవు. ఆపూట కెవరో ఇంతకన్న భాగ్యశాలి నెల్లూరినుండి షేరున్నర బియ్యము మూట గట్టుకుని పదిగంటలు ప్రోద్దేక్కునప్పటికీ తెచ్చి యిచ్చెను. ఇతఁడాదినము రావలసిణవాఁడుగాదు. వీరి యవసరము తెలిసినవాఁడునుగాదు. మరియెక నాఁడు భోజనమునకు పూర్వమేయని జ్ఞాపకము-ఏదో మాటాడుచు ఇపుడు అనాసపండు తినిన బాగుండును అనిరి శాస్త్రిగారు, ఇంతలో తలుపు తెరచుకొని రాజమండ్రినుండి ఒకమిత్రుడు అనాసపండ్ల బుట్టను తెచ్చెను. లేమిడిచే నలిగులి యగుచున్నను దాని నుండియే ఒక వింత తృప్తీని కల్పించుకొనేడివారుశ్రీశాస్త్రిగారు, ఒక రాత్రి భోజనానంతరము విశ్రాంతిగా నిద్రపోబోవుచు నిట్లనిరి. "ఏమయ్యా! నాకు గలపరితృప్తి జార్జి సార్వభౌమునక్తెన నుండదు. ఈ పూట ఇచటకు బాధ పడుచు వచ్చినవా రెందరో నవ్వుచు బోయిరి నావలన ఈశ్వరుడిట్టి పుణ్యకార్యములను చేయించుచున్నాడు గదా యను తృప్తితో నేను హాయిగా నిద్రింపఁగలను. మరియు మన కేపూటకు వలయువాని నాపూటకు చుక్కలు చుక్కలుగా అమృతము స్యందించినట్లు బాగావంతుఁ డనుగ్రహించు చున్నాఁడు. అప్పటికప్పడది యాస్యాద్యమ్తె హాయిని గొల్పు చున్నది. నిలువఁజేయువలె ననేపరితాపము గాని, నిలువచేసి దానిని సంరక్షించుకొనుటకు పడుణవస్ధాలుగాని నాకు లేవు గదా!" ఈ మాట విన్నవారికి ఎట్టి ఇక్కట్టులను, నాటంకములను, కష్టములను స్తెతము యోగి తనకు మేలు కలిగించు సాధనములుగ మార్చుకొనగలం డనుమహనియ సత్యము స్పురించి తీరును!
