Next Page 
ఇనుప కచ్చడాలు పేజి 1

                                                       ఇనుప కచ్చడాలు

                                                           తాపీ ధర్మారావు

ఇనుప కచ్చడాలు-ఇంత కాలానికి విశాలాంధ్ర ప్రచురణాలయం వారు తీసుకొచ్చారు. తాపీ ధర్మారావు గారు జీవించి ఉన్న కాలంలోనే వీరు దీన్ని ప్రచురించాలని చాలా ప్రయత్నం చేశారు. సఫలీకృతులు కాలేకపోయారు.
    కాగడా వారపత్రికలో జనవరి 1940 నుండీ జూలై 1940 వరకూ ఈ వ్యాసాలు ఆనాడు ప్రకటితమౌతూంటే పాఠకులు విశేషమయిన ఆసక్తిని కనబర్చారు. ఈ నూతన భావాల ప్రచారంతో క్రమంగా పత్రిక సర్క్యులేషన్ ఊహకందని విధంగా పెరిగింది. ఆ వ్యాసాల రుచి చూసిన వాళ్ళంతా అవన్నీ ఎప్పుడెప్పుడు పుస్తకరూపంగా వస్తాయా! అని ఇన్నేళ్ళూ ఎదురు చూశారు. ఇప్పటికొచ్చింది.
    తాపీ ధర్మారావు గారు ఈ వ్యాసాలను ఆనాడు ప్రచురించటంలో ఓ ఉద్దేశం వుంది. అంతవరకూ తాతాజీ; అటు భాషాపరంగానూ-భావాల పరంగానూ ఒక అంచుకుంటూండేవారు. పాండిత్యమన్నది ఒక వర్ణానికే చెందిందనుకుంటున్న సనాతనభావం ఆయన్ను కలతపెట్టింది. దాంతో, ఆ వర్ణాన్ని ఎదుర్కోటానికి ఆ పద్ధతిలోనే పాండిత్యం సముపార్జించుకున్నారు. వారిలాగే భాషాచర్చా-ప్రబంధాల అధ్యయనం-పాఠనిర్ణయాలపై వాదోపవాదాలూ చేయటం మొదలెట్టారు, భాషకూడా ఆ వర్ణాలకే ప్రాతినిధ్యం వహిస్తూందన్న భావంతో అలాంటి వీర గ్రాంధికవాదిగా ఉంటేనే ఆ వర్ణంకన్నా గొప్పవాళ్ళం కాగలమనుకున్నారు.
    ఇలా ఉండగా- కొంతకాలానికి ఇతరదేశాల సాహిత్యం తనకు అందుబాటులో కొచ్చింది. జమీందార్ల కొడుకులకు ట్యూషన్ చెపుతూన్న సమయంలో జమీందార్లతో సంబంధాలేర్పడ్డాయి. ఇవి వీరికి అనేకదేశాల గ్రంధాలు తను అధ్యయనం చేయటానికి అవకాశం కల్పించాయి.
    ఇరవైశతాబ్దం రెండవదేశంలో సామాజిక శాస్త్రం విశేషప్రాచుర్యం పొందింది. క్రైస్తవ ఫాదరీలు మతప్రచార పర్యటనల సందర్భంగా అనేకదేశాలకు వెళ్తూండేవారు. ఆ దేశాలలోని ఆటవిక ప్రజల ఆచార వ్యవహారాలను- భాషను - సంప్రదాయాలను నమోదుచేయటం మొదలెట్టారు. అంతకు ముందునుండీ వచ్చిన అలాంటి సమాచారాన్ని క్రోడీకరించిన ఉద్గృంధం ఫ్రేజిర్ రాసిన గోల్డెన్ బౌ. ఈ పుస్తకం సరికొత్త మానవ పరిణామశాస్త్రాన్ని ఆవిష్కరించింది. పశ్చిమదేశాలలో ఇలాంటి పుస్తకాలు చర్చి పునాదులను సైతం కదల్చాయంటే అతిశయోక్తి కాదు. గతంలో డార్విన్ సిద్ధాంతం జీవపరిణామాన్ని శాస్త్రబద్ధంగా నిరూపించి క్రైస్తవమతాన్ని కుదిపితే: మానవ నాగరికత క్రమపరిణామ పర్యవసానమే కానీ, మతగ్రంధాలు చెప్తున్నట్టు సర్వోత్తమ మానవుడు ఆదిలోనే సృజింపబడ్డాడన్న వాదాన్ని ఈ సరికొత్త గ్రంధాలూ, ఇవి వెల్లడించిన అంశాలూ తునాతునకలు చేశాయి.
    ఈ గ్రంధాల అధ్యయనం తాతాజీలో పెద్దమార్పును తెచ్చింది. ఈ పుస్తకాలు నేటి నాగరిక సమాజంలోనే అనేక గుడ్డినమ్మకాల మూఢాచారల ముడులు విప్పాయి. అనేక పదబంధాల, పలుకుబళ్ళ, సామెతలలో వెనక తరతరాల సంచితమయిన మానవ సాంస్కృతిక జీవనం ఇమిడి ఉందనీ బోధపడ్డాయి. దాంతో, ఆ విశ్వాసాలూ, అజ్ఞానం అన్నవి- అది అగ్రవర్ణం కానీ, అధమవర్ణం కానీ- పరిశీలిస్తే అందరిలోనూ సమంగా ఉండటం తాతాజీకి గోచరించింది. అంతే! అంతవరకూ ఏ బ్రాహ్మణవర్ణం అన్నా- అన్ని విషయాల్లో వారి ఆధిపత్యం అన్నా, వారు ప్రయోగించే భాషన్నా వీరికున్న సనాతన వైరభావం మటుమాయమయింది. దృష్టి విశాలమయింది. ఈ నూతనభావాలను ప్రజలకు తెలియపర్చటం విధి అనుకున్నారు. అందుకనువుగా భాషనూ మార్చుకున్నారు.
    అప్పటికే పత్రికారంగంలో సమదర్శిని సంపాదకులుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. 'దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు?' అన్న వ్యాసాలను గూడవల్లి రామబ్రహ్మంగారి సంపాదకత్వాన వెలువడుతున్న ప్రజామిత్రలో ప్రచురించటం ద్వారా తనకో స్థానాన్ని ఏర్పర్చుకొన్నారు. ఆ సామాజికశాస్త్రాల ఆధారంగానే పెండ్లితంతును, 'పెండ్లి, దాని పుట్టు పూర్వోత్తరాల' వ్యాసాల్లో (కాగడా వారపత్రికలో జూలై 1940 నుండి డిశంబరు 1940 వరకూ ప్రచురితమయ్యాయి) వ్యాఖ్యానించారు. ఆ పరంపరలో ఈ ఇనుపకచ్చడాలు రెండోది.ఇనుప కచ్చడాలు-ఇంత కాలానికి విశాలాంధ్ర ప్రచురణాలయం వారు తీసుకొచ్చారు. తాపీ ధర్మారావు గారు జీవించి ఉన్న కాలంలోనే వీరు దీన్ని ప్రచురించాలని చాలా ప్రయత్నం చేశారు. సఫలీకృతులు కాలేకపోయారు.
    కాగడా వారపత్రికలో జనవరి 1940 నుండీ జూలై 1940 వరకూ ఈ వ్యాసాలు ఆనాడు ప్రకటితమౌతూంటే పాఠకులు విశేషమయిన ఆసక్తిని కనబర్చారు. ఈ నూతన భావాల ప్రచారంతో క్రమంగా పత్రిక సర్క్యులేషన్ ఊహకందని విధంగా పెరిగింది. ఆ వ్యాసాల రుచి చూసిన వాళ్ళంతా అవన్నీ ఎప్పుడెప్పుడు పుస్తకరూపంగా వస్తాయా! అని ఇన్నేళ్ళూ ఎదురు చూశారు. ఇప్పటికొచ్చింది.
    తాపీ ధర్మారావు గారు ఈ వ్యాసాలను ఆనాడు ప్రచురించటంలో ఓ ఉద్దేశం వుంది. అంతవరకూ తాతాజీ; అటు భాషాపరంగానూ-భావాల పరంగానూ ఒక అంచుకుంటూండేవారు. పాండిత్యమన్నది ఒక వర్ణానికే చెందిందనుకుంటున్న సనాతనభావం ఆయన్ను కలతపెట్టింది. దాంతో, ఆ వర్ణాన్ని ఎదుర్కోటానికి ఆ పద్ధతిలోనే పాండిత్యం సముపార్జించుకున్నారు. వారిలాగే భాషాచర్చా-ప్రబంధాల అధ్యయనం-పాఠనిర్ణయాలపై వాదోపవాదాలూ చేయటం మొదలెట్టారు, భాషకూడా ఆ వర్ణాలకే ప్రాతినిధ్యం వహిస్తూందన్న భావంతో అలాంటి వీర గ్రాంధికవాదిగా ఉంటేనే ఆ వర్ణంకన్నా గొప్పవాళ్ళం కాగలమనుకున్నారు.
    ఇలా ఉండగా- కొంతకాలానికి ఇతరదేశాల సాహిత్యం తనకు అందుబాటులో కొచ్చింది. జమీందార్ల కొడుకులకు ట్యూషన్ చెపుతూన్న సమయంలో జమీందార్లతో సంబంధాలేర్పడ్డాయి. ఇవి వీరికి అనేకదేశాల గ్రంధాలు తను అధ్యయనం చేయటానికి అవకాశం కల్పించాయి.
    ఇరవైశతాబ్దం రెండవదేశంలో సామాజిక శాస్త్రం విశేషప్రాచుర్యం పొందింది. క్రైస్తవ ఫాదరీలు మతప్రచార పర్యటనల సందర్భంగా అనేకదేశాలకు వెళ్తూండేవారు. ఆ దేశాలలోని ఆటవిక ప్రజల ఆచార వ్యవహారాలను- భాషను - సంప్రదాయాలను నమోదుచేయటం మొదలెట్టారు. అంతకు ముందునుండీ వచ్చిన అలాంటి సమాచారాన్ని క్రోడీకరించిన ఉద్గృంధం ఫ్రేజిర్ రాసిన గోల్డెన్ బౌ. ఈ పుస్తకం సరికొత్త మానవ పరిణామశాస్త్రాన్ని ఆవిష్కరించింది. పశ్చిమదేశాలలో ఇలాంటి పుస్తకాలు చర్చి పునాదులను సైతం కదల్చాయంటే అతిశయోక్తి కాదు. గతంలో డార్విన్ సిద్ధాంతం జీవపరిణామాన్ని శాస్త్రబద్ధంగా నిరూపించి క్రైస్తవమతాన్ని కుదిపితే: మానవ నాగరికత క్రమపరిణామ పర్యవసానమే కానీ, మతగ్రంధాలు చెప్తున్నట్టు సర్వోత్తమ మానవుడు ఆదిలోనే సృజింపబడ్డాడన్న వాదాన్ని ఈ సరికొత్త గ్రంధాలూ, ఇవి వెల్లడించిన అంశాలూ తునాతునకలు చేశాయి.
    ఈ గ్రంధాల అధ్యయనం తాతాజీలో పెద్దమార్పును తెచ్చింది. ఈ పుస్తకాలు నేటి నాగరిక సమాజంలోనే అనేక గుడ్డినమ్మకాల మూఢాచారల ముడులు విప్పాయి. అనేక పదబంధాల, పలుకుబళ్ళ, సామెతలలో వెనక తరతరాల సంచితమయిన మానవ సాంస్కృతిక జీవనం ఇమిడి ఉందనీ బోధపడ్డాయి. దాంతో, ఆ విశ్వాసాలూ, అజ్ఞానం అన్నవి- అది అగ్రవర్ణం కానీ, అధమవర్ణం కానీ- పరిశీలిస్తే అందరిలోనూ సమంగా ఉండటం తాతాజీకి గోచరించింది. అంతే! అంతవరకూ ఏ బ్రాహ్మణవర్ణం అన్నా- అన్ని విషయాల్లో వారి ఆధిపత్యం అన్నా, వారు ప్రయోగించే భాషన్నా వీరికున్న సనాతన వైరభావం మటుమాయమయింది. దృష్టి విశాలమయింది. ఈ నూతనభావాలను ప్రజలకు తెలియపర్చటం విధి అనుకున్నారు. అందుకనువుగా భాషనూ మార్చుకున్నారు.
    అప్పటికే పత్రికారంగంలో సమదర్శిని సంపాదకులుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. 'దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు?' అన్న వ్యాసాలను గూడవల్లి రామబ్రహ్మంగారి సంపాదకత్వాన వెలువడుతున్న ప్రజామిత్రలో ప్రచురించటం ద్వారా తనకో స్థానాన్ని ఏర్పర్చుకొన్నారు. ఆ సామాజికశాస్త్రాల ఆధారంగానే పెండ్లితంతును, 'పెండ్లి, దాని పుట్టు పూర్వోత్తరాల' వ్యాసాల్లో (కాగడా వారపత్రికలో జూలై 1940 నుండి డిశంబరు 1940 వరకూ ప్రచురితమయ్యాయి) వ్యాఖ్యానించారు. ఆ పరంపరలో ఈ ఇనుపకచ్చడాలు రెండోది.

Next Page 

WRITERS
PUBLICATIONS