3. శుక శారికాది - పక్షుల పాటలు
చెంగున ఎగిరే - మృగముల ఆటలు |
ఉద్యానములు - చిత్రశాలలు
రతీ గృహములు - లతా గృహములు |
ఉత్తమజాతికి - చెందిన స్త్రీలు
వేలకు వేలు - ప్రియ భామినులు |
లంకేశ్వరుని - దివ్యభవనమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది ||శ్రీ||
4. అత్తరు పన్నీట - జలకములు
కాలాగరు సు | గంధ ధూపములు |
స్వర్ణ ఛత్రములు - వింజామరలు
| కస్తూరి పునుగు జ | వ్వాది గంధములు
నిత్య పూజలు - శివార్చనలు
మాస పర్వముల | హోమములు |
లంకేశ్వరుని - దివ్య భవనమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది ...
5. మంత్రి ప్రహస్త | మహాపార్శ్వుల
విరూపాక్ష వి | భీషణాదుల |
ఇంద్రజిత్తు సు | మాలి జంబుల
శోణితాక్ష మక | రాక్ష కారాళుల |
కుంభ నికుంభ - కుంభకర్ణుల
వజ్రదంష్ట్ర శుక - సారణాదుల |
ఎల్ల రాక్షసుల - గృహములు వెదకి
సీతను గానక - వగచె మారుతి | .... ||శ్రీ||
__ : 6 వ. స. సంపూర్ణము :__
7 వ. సర్గ
పుష్పక విమాన వర్ణన :-
1. యమ కుబేర వరు | ణ దేవేంద్రాదుల
సర్వ సంపదల - మించినది
విశ్వకర్మ తొలు | త బ్రహ్మ కిచ్చినది
బ్రహ్మ వరమున కు | బేరుడందినది |
రావణుండు కు | బేరుని రణమందు
| ఓడించి లంకకు - గొనితెచ్చినది |
పుష్పకమను మ | హా విమానమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది | .... ||శ్రీ||
2. కాంచన చారు మ | నోహర తేజము
జలధర సామ్య మ | హోన్నత రూపము |
ఫల పుష్పవన సం | కీర్ణ శిఖరము
మహోజ్వల బహు - రత్న శోభితము |
విశ్వకర్మ వి | చిత్ర నిర్మితము
రావణు గణగణ | బలాను రూపము |
పుష్పకమను మ | హా విమానమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది .... ||శ్రీ||
__: 7వ. స. సంపూర్ణము :__
8 వ. సర్గ
1. నేలను తాకక - నిలచి యుండునది
రావణ భవన మ | ధ్యంబున నున్నది |
వాయు పధమున ప్ర | తిష్టితమైనది
మనమున దలచిన - రీతి పోగలది |
దివి నుండి భువికి - దిగిన స్వర్గమది
సూర్య చంద్రులను - ధిక్కరించునది |
పుష్పకమను మ | హా విమానమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది ... ||శ్రీ||
2. అర్ధ యోజన వి | స్తీర్ణము గలది
ఏక యోజన - ఆయతము గలది |
మూడు నాల్గు దం | తాలు గల్గిన
మదకుంజర యూ | ధంబులు గలది |
చతురంగ బల సు | రక్షితమైనది
మహోదధివలె - ఘోషించునది |
పుష్పకమను మ | హా విమానమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది ... ||శ్రీ||
__: 8 వ. స. సంపూర్ణము :__
9 వ. సర్గ
పుష్పకమందు రావణ మందిరము :-
1. అద్భుతమైన సు | వర్ణ మందిరము
ఇంద్ర నీలమణి - వేదికా యుతము
రక్తచందన సు | గంధ పూరితము
అరుణకిరణ బా | లార్క భాసితము |
నానా కూట - నిబిడీకృతము
వరాకార - శిఖరావృతము |
పుష్పకమందు రా | వణ మందిరంమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది .... ||శ్రీ||
2. లంకాధీశుని - ప్రేమ మందిరము
రత్నఖచితమౌ - హేమ మందిరము
చందనాది సు | గంధ బంధురము
పానభాక్ష్య ప | దార్ధ సమృద్ధము |
ఆయా పరిమళ - రూపానిలము
అనిలాత్మజుచే - ఆఘ్రాణితము |
పుష్పకమందు రా | వణ మందిరంమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది .... ||శ్రీ||
