Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 5

    "డియర్ ప్రెండ్స్.
    కమాన్ ఎంజాయ్... మీ ఇష్టం వచ్చినట్టు తాగండి, తినండి... మజాచేసుకొండి. ఒళ్ళు మరచి ఆడుకోండి. ఖుషి ఎలా చేసుకుంటారో మీ ఇష్టం..." కరంజయా అనౌన్స్ చేశాడు.
    అంతే!
    పెద్ద పెట్టున ఆనందోత్సాహాలు.
    ఈ ఆనందంలో పాలు పంచుకోనిది కరంజియా మాత్రం టెంట్ లోపలకి నడిచాడు.
    అతడ్ని అనుసరించాడు లల్లూరమ్.
    లోపల పరుపుమీద పాకిస్తాన్ ఏజెంట్ ఖాన్, ఓ సైంసిస్ట్ పక్కనే బ్రీఫ్ కేస్ ఉంది.
    "చెప్పడి ఖాన్ సాబ్ ఏమిటి విశేషాలు?" అన్నాడు కరంజయా.
    ఇప్పుడు విశేషాలు మీదగ్గరే వున్నాయి." చెప్పాడు సైంసిస్ట్. అతని పేరు అగర్వాల్.]
    "అచ్చా" నవ్వాడు బాబువైపు చూస్తూ కరంజయా.
    "అవును కరంజయా సాబ్.. ఈ పిల్లాడిలో సూపర్ పవర్స్ ఉన్నాయి.వీడి కంతికున్న శక్తి మామూలిది కాదు.దీనికి కారాణాలు అన్వేషించడం కన్నా, మనం ఉపయోగించుకుంటే ఎంతో ఉపయోగం.
    వీడని మనం మన కంట్రోల్ లో ఉంచుకోవాలి, మన పెదవుల కదలిక మీద ఆధారపడి ఉండాలి.
    వీడికి వయసు పెరిగే కొద్దీ శక్తి పెరుగుతుంది.వీడి కంట్లో మహా విద్యుత్ ఉంది. దాని శక్తి సామాన్యమైనది కాదు. కన్ను తెరిస్తే భస్మమైపోవడమే. కనీసం సాక్షానికి శారీరం కూడా మిగలదు.
    వీడో అద్బుతం. సైన్స్ పరిబాషలో చెప్పాలంటే వీడో మిరాకిల్."
    అన్నట్టు వీడికి పేరేమి పెట్టారు?"అడిగాడు అగర్వాల్.
    "భ...స్మ..." చెప్పాడు కరంజయా.
    భస్మనేత్రం తెరుచుకుంటోంది.
                                                                             ***
    టెంట్ లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. సీటి  అవుట్  స్కాట్స్ లో  గుబురైన చెట్లమధ్య ఆ టెంట్ వుంది. టెంట్ మధ్య భాగంలో ఓ రౌండ్ టేబుల్ వుంది. దాని చుట్టూ నాలుగు కుర్చీలున్నాయి.టేబుల్ మీద క్యాండిల్ వెలుతురే ఆ టెంట్ కు వెలుగునిస్తూంది.
    ఓ పక్కన ఉన్న క్రేడిల్ బాబు నిద్రపోతున్నాడు. లల్లూరామ్, కరంజయా, ఖాన్, సైంసిస్ట్ అగర్వాల్ సీరియస్ గా ఆలోచనలో పడిపోయారు.
    లల్లూరమ్ కరంజయా కుడి భజం. డబ్బు కోసం కన్నతల్లిని చంపడాని క్కూడా వెనకాడని క్రూరుడతను. కరంజయాకు నమ్మినబంటులా పని చేసే లల్లూరామ్ బ్రహ్మచారి. ఎప్పుడో ప్రమాదంలో తాను చనిపోతాడో తెలియక పెళ్ళి చేసుకోలేదు.
    అగర్వాల్ సైంసిస్ట్... అతని ప్రయోగాలు కేవలం డబ్బుకోసమే... డబ్బు వెదజల్లి, పరపతి ని ఫణంగా పెట్టి తన తెలివితేటలను ప్రమోట్ చేసుకునే మనస్తత్వం.
    ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్. భారతదేశాన్ని అల్లకల్లోలం చేయాలని, మేధావులకు తమకు అనుకూలంగా మార్చుకోవాలనే తలంపుతో, పాకిస్తాన్ కుయుక్తితో అతడ్ని ఇండియా పంపించింది.
    పాకిస్తాన్ నుంచి ఇండియా రాగానే కరంజయాను కాంటాక్ట్ చేశాడు. ఖాన్ ఇద్దరి మధ్య ఓ ఒప్పందం కుదిరింది.ఆ ఒప్పందం ప్రకారం దేశం లోని ప్రముఖ సైంసిస్ట్ లను ట్రాప్ చేయడం, అమ్మాయిలను ఎరచూపి వాళ్ళని లోబరుచుకుని, వాళ్ళు పడగ్గదిలో చేసే శృంగరాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయటం... తద్వారా వాళ్ళను తమవైపు తిప్పుకోవడం కరంజయా చేయాల్సిన పని.
    ప్రముఖ సైంసిస్ట్ ల  లిస్టు తాయారుచేసి వాళ్ళతో బేరసారాలు సాగించాడు కరంజయా కొందరు డబ్బులుకు లోంగారు . మరికొందరు భయంతో అతని దారికొచ్చారు. ఇంకొందరు అమ్మాయిలను ఏరా చూసి, అమ్మాయిల మత్తులో పడేలా చేసి, వాటిని వీడియోలో కి ఎక్కించి బ్లాక్ మెయిల్ చేసి తన వైపుకు తిప్పుకున్నాడు.
    వెతికి లొంగని ఓకే ఒక వ్యక్తి భరద్వాజ అందుకే అతడ్ని ప్రభత్వం గుర్తుంచలేదేమో...
    తన థీసిస్ ని,ఫార్ములా లను ఎప్పుడూ ఇతరులను అమ్ముకోవాలని చూడలేదు. తను నమ్మినదాన్ని, దేశం కోసమే ఉపయోగించాలనే అతని మనస్తత్వానికి కొందరు సహా మేధావులు అడ్డు తగిలారు.
    క్రీడాకారులు ఆటల్లో అలసిపోకుండా స్టెరాయిడ్స్ వాడినట్టు, యుద్దంలో సైనికులు అలసిపోకుండా ఒక రకమైన కెమికల్ ఫార్ములా కనిపెట్టాడు భరద్వాజ.
    ఆ విషయం తెలిసిన పాకిస్తాన్ ఖాన్ ని వెంటనే భరద్వాజని ట్రాప్ చేయమని పంపించింది. కరంజయా సాయం కోరాడు ఖాన్.
    కరంజయా డబ్బు ఆశ చూపించాడు.
    అమ్మాయిల వల విసిరాడు. కానీ భరద్వాజ చలించలేదు. చివరి అశ్రంగా లల్లూరామ్ ప్రయోగించాడు. లల్లూరామ్ ఇలాంటి విషయాల్లో స్పెషలిస్ట్. దాదాగిరి చేయటం, విద్వంసం స్పష్టించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య.
    అతనికి సెంటమెంట్స్ లేవు. నిర్దాక్షిణ్యంగా స్కూల్ వ్యాన్ బాంబు పెట్టి పేల్చినా క్రిమినల్ హిస్టరీ అతనికుంది.
    లల్లూరామ్ భరద్వాజ యింటిమీద ఎటాక్ చేశాడు. అదే సమయంలో ఆ విషయాన్ని పసిగట్టిన భరద్వాజ నిండు గర్బిణీ గా ఉన్న తన భార్యతో సహా పారిపోయాడు.
    తర్వాత సిటీ హాస్పిటల్ లో ఉన్నట్టు తెలిసింది. తీరా అక్కడకి వెళ్ళాక, భరద్వాజ భార్య ఓ బిడ్డని ప్రసవించిందని, ఆ బిడ్డకు మూడో కన్నువుందని, డానికి అపారమైన శక్తి ఉందని భరద్వాజ మాటల్లోనే తెలిసింది.
    దేశశ్రేయస్సు కోసం తన బిడ్డను కూడా చంపుతానికి సిద్ద పడి భరద్వాజ బిడ్డని పాతి పెట్టాడు. కోన ప్రాణాలతో వున్న బిడ్డని కరంజయా గొయ్యిలో నుంచి తీసి తీసుకు వచ్చి ప్రాధమిక చికిత్స చేశాడు.
                                                                          ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS