Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 37


    శ్రీపతి రోడ్డు దాటాడు.
    _సర్దుబాటైనట్లుంది. ఆ మగకుక్క దేనికి ఆగినట్లు_ రోడ్డుకి అటుగా ఆ పోయే ఆడ గజ్జికుక్క_మగకుక్క దానికేసి_దానిచూపు అదోలాగా ఏదో పాత పరిచయం జ్ఞాపకం రావటంలాగా __ఆడకుక్క రవ్వంత తలతిప్పి మగకుక్కని చూసి అలిగినట్లుగా అటు తిరిగి_మగకుక్క దానికేసి_దానిచూపు అదోలాగా ఏదో పాత పరిచయం జ్ఞాపకం రావటంలాగా __ఆడకుక్క రవ్వంత తలతిప్పి మగకుక్కని చూసి అలిగినట్లుగా అటు తిరిగి_మగకుక్క ముందుకు మళ్ళింది. మిగతా కుక్కలన్నీ ఏమైనట్లు_యిది వాట్లన్నిటినీ జయించిందా_ఏదో ట్రిక్కు చేసిందా_యింత అవస్థ దేనికి ఆ కుక్క కోసం_యే కుక్క అయితే యేం. ఆడకుక్క ఐతే చాలదూ_ కుక్కలకి కూడా మనసవటం వుంటుందా_యే ఆడదైనా ఒకటే వనిపించే మనుషులకంటే యీ కుక్క....అసలీ వేళకాని వేళలో_దేశానికి లాగే అర్ధరాత్రో అపరాత్రో కుక్కలక్కూడా వుత్తకార్తెలో ఎమర్జన్సీ వచ్చి.....
    నాలుగు గంటల ఎండ వేళ. ఎండ మండుతోంది, సన్నగా తీక్షణంగా. శ్రీపతి సెయిన్ట్ జార్జెస్ స్కూలు దగ్గిరి చెట్టుకింద నిలుచున్నాడు_
    మగకుక్క ఆడకుక్కని సమీపించింది. ఆడకుక్క చటుక్కున అవతలికి నడిచింది. మగకుక్క నిలుచునిపోయింది. ఆడకుక్క పక్కచూపుతో మగకుక్కని చాటుగా గమనిస్తూ నుంచుంది. చటుక్కున ముందుకి అడుగులు వేసి ఆడకుక్కని మెడ దగ్గిర కరిచింది. ఆడకుక్క దగ్గిరిగా జరిగింది. పక్క పక్కన రాసుకుంటూ నడుస్తున్నాయి.
    కింగ్ కోఠీ రోడ్ అబిడ్స్ లో కలిసే దగ్గిరి ఐలాండ్ మీదకి చేరుకున్నాయి కుక్కలు రెండూ.
    వాటి వెనకగా నడుస్తున్న శ్రీపతి ముందుకు నడిచి తాజ్ లోకి వెళ్ళాడు. వెజిటబుల్ కట్ లెట్ తిని కాఫీ తాగి బయటికి వచ్చాడు. గేట్లోంచి ఎడమ పక్కకి తిరగబోతుంటే ఐలాండ్ మీద కుక్కలు రెండూ కనిపించాయి.
    అవతలి ఫుట్ పాత్ మీద, ఎర్రసిల్కు డ్రస్సులో నాలుగేళ్ళ పిల్లాడు నుంచుని వాటిని చూడటం గమనించి ఆగిపోయాడు శ్రీపతి.
    అంతలో మగకుక్క ఆడకుక్క మీదకి లఘించి
    ఆడకుక్క తృప్తిగా వెనక్కు జరుగుతోంది.
    ముందుకి అడుగులు వేసి పోబోతున్న శ్రీపతికి__ అవతలి పుట్ పాత్ మీద దూరంగా ఓ ముసలాయన, వాటివంక తదేకంగా చూస్తూండటం కనిపించి ఆగిపోయాడు.
    ఆ ముసలాయన ఐదేళ్ళ క్రితం ప్రభుత్వాధికారిగా రిటైరయ్యాడు. ఒక డొక్కు కారు వుంది సాధారణంగా దాన్లో బయల్దేరతాడు. పదహారు పదిహేడేళ్ళ ఆడపిల్లలకి లిఫ్ట్ ఇస్తుంటాడు అడిగి. అలా పరిచయం చేసుకుని యింటికి పిలుస్తాడు. ఆ వయసు ఆడపిల్ల__ఒకే పిల్లకాదు__కొత్త కొత్త ఆడపిల్లల్తో__ కావిలించుకు పడుకుంటాడు. అంతే, అంతకంటే యింకేం సాధ్యమూ కాదు, ప్రయత్నమూ చెయ్యడు. ఐదారు నెలలకోపిల్ల అతని వలలో పడుతూంటుంది.    
    __వీటికి ఆ పిల్లాడికీ ఆ ముసలాయనకీ ఏమిటి సంబంధం__ ఆమాటకొస్తే నాకు? కళ్ళలో ముఖంలో తీవ్రత దాహం__ ఈయనకి శునకరతి నేత్రానందంగానూ తిమ్మిరిగానూ మహదానందంగానూ వున్నట్లుంది__ వాటి కదలికల్ని మహనిశితంగా తాదాత్మ్యంగా గమనిస్తున్నాడు. ఆ పసివాడు ఆ కుక్కలన్నీ ఐలాండ్ పక్క రాతి దిమ్మనీ సమదృష్టితో అనిర్వచనీయంగా చూస్తున్నాడు. మరి ఆ ముసలాయన __
    అంతలో సెంట్ జార్జెస్ లోంచి మగపిల్లల జుట్టు పది పన్నెండేళ్ళ ఏడెనిమిది మంది వచ్చి ఆ కుక్కల్ని చూసి నానా రకాల కూతలతో అరుపులతో ఇకిలిస్తూ__ వొంగి రాతి ముక్కలు తీసి విసిరారు. రెండు రాళ్ళు మగ కుక్కకీ ఒక రాయి ఆడ కుక్కకీ బలంగా తగిలాయి. ఆడకుక్క ముందుకీ మగకుక్క వెనక్కీ జారిపడినట్లుగా వొరిగి విడివడినాయి. ఆ పసివాడు ఫక్కున నవ్వాడు. ఆ ముసలాయన అసహనంగా చూశాడు.
    యిదంతా గమనిస్తున్న శ్రీపతి చిన్నగా నవ్వుకున్నాడు.
    అటునుంచి అప్పుడే ఐలాండ్ దగ్గిరికి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆడకుక్కని బూటు కాలితో అదిలించాడు. అది కుయ్ కుయ్ మని అరుచుకుంటూ యెడమవైపుకి నడిచింది. మగకుక్క కూడా అంటే నడిచింది.
    కుక్కలు తోతారాం పాపాలాల్ నగలషాపు ముందు వొకదానిచుట్టూ వొకటి తిరుగుతున్నాయి. శ్రీపతి నాలుగు అడుగులు ముందుకు నడిచి కాధ్యవాడ్ స్టోర్స్ లోకి వెళ్ళాడు.
    పది నిమిషాలకి శ్రీపతి బయటికి వచ్చేసరికి, కాలిబాటమీద కుక్కలు మాంఛి వరసలోకి వచ్చి కనిపించాయి.
    __పాపం, కొంటె కోణంగుల భగ్నపరచకపోతే యీపాటికి పని ముగించుకునేసేవి.... రెడీమేడ్ బట్టల షాపులోంచి బయటికొచ్చి కారులో కూచుంటున్న ఆ వృద్ధపడుచు వాటివంక ఆ చూపు_మధురస్మృతి లాంటి చూపు __ యే వంటరి మహాజిల ఘడియలోనో పెంపుడు కుక్క__ డ్రైవరు కారుని ముందుకు కదల్చటంతో ఆమె చూపు విరిగిపోయింది. ఆ కర్కశపు కారు హారన్మోత ఆ కుక్కలకీ వినిపించలేదు. అవి యీ లోకంలో లేవు._వాటిచుట్టూ యే లోకమూ లేదు. వాటి లోకంలో అవి వున్నాయి. మరి వాటికి ఆ భూమిని_ ఆ కాలేజీ అమ్మాయి వాటివంక ఇదిగా దొంగచూపులు చూస్తూ పోతూ _ జస్ట్ మిస్డ్, కొంచమైతే ఆ యెదురుగా వచ్చే రాంఢోలుకి కొట్టుకునేది__ ఆ ఢోలు వీటిమీద గానీ పడితే యీపాటికి పిసరెళ్ళేవి, ఆ కుర్రజంట__ వాటివంక చూసి అతనేదో కొంటెమాట విసిరినట్లున్నాడు, ఆమె మహ సిగ్గుపడిపోతోంది తృప్తిగా_ అక్కడ నుంచుని ఆ నడివయసు జంటిల్మన్ శ్రద్ధగా బుద్ధిగా వాటినే చూస్తూ వాటి కదలికలు లయతో చూపు కదులుతూ __ ఏమిటి నా వంక కారంగా చూస్తున్నాడు__ నేను వాడిని గమనించటం గమనించి వుండాలి__ బతుకే దొంగచాటు బతుకు. యేదీ బాజాప్తా చేసేడవలేరు. ఆ పాత దంపతుల జంట యెవరూ, బొర్రా పంతులింట్లో అద్దెకుంటారు. ఆహా ఏం నవ్వులు పరస్పరం వీధిలో __ యింట్లో పరస్పరం అసహ్యించుకుంటూ ద్వేషించుకుంటూ వాళ్ళింకా నయం పరస్పరం యింట్లో కూడా నవ్వులు నటిస్తూండటం కంటే.... తల్లి చెయ్యి పట్టుకుని నడుస్తున్న ఆ పసివాడు మగకుక్క మీద చెయ్యి వేసేసరికి ఆ తల్లి, నిప్పుమీద చెయ్యి పడినట్లు గిలగిల్లాడి పోయి పిల్లాణ్ని అమాంతం పైకెత్తుకుని .... కాలితే పిల్లాడే చెయ్యి అమాంతం లాగేసుకొనును__ ఆ పదేళ్ళ బూట్ పాలిష్ పిల్లాడు వాటివంక లోకువగా చూస్తున్నాడు.... తంతాడా ఏమిటి పాపం_ తన్ననే తన్నాడు. ఆమాత్రం తాపుకి అవి విడివడటానికి అవేం ఆషామాషీ. యిదిలో లేవు_ ఆ తాకిడికి రవ్వంత పక్కకి కదిలాయి జమిలిగా.... ఆ ముసిలావిడ_ అదేమిటా చెయ్యి. ఓహో ఆ ఘోరం కనపడకుండా కాబోలు కళ్ళ పక్కగా అరిచెయ్యి అడ్డుపెట్టుకుని ముందుకి నడుస్తోంది. అటునుంచి వస్తున్న ఓ కానిస్టేబుల్ తో యేదో అని ఆటే వెళ్ళిపోయింది_ "యెంతటి రసికుడవో నీ వెంతటి రసికుడవో _ గుత్తపు రవికా _ ఓయమ్మా - గుత్తపు రవికా _ చమట చిత్తడిలో తడిసివుండగా.... యెంతసేపు" అంటూ పాడుకుంటూ కర్ర టిక్కు టిక్కు లాడిస్తూ వస్తున్న బిచ్చగాడు_ "చల్లనిరాజా ఓ చందమామ" అనో "నీవుండే దాకొండపై"_అనో మరొకటో బిచ్చగాళ్ళ ఫేవరేట్ పాట కాకుండా యిలా పాడుకొస్తున్నాడు - కాలం మారిపోయింది. కాలంతో పాటు బిచ్చగాళ్ళ పాటలూ మారుతున్నాయి_ యింతకీ వాడు నిజం బిచ్చగాడా_ కాలం మారింది _ వాడు నిజం గుడ్డి బిచ్చగాడు కాదు_ యెంతటి రసికులో వీళ్ళెంతటి రసికులో_ కుక్కల ఒత్తిడిలో తడిసి_ వీళ్ళెంతటి రసికులో యెంతటి దొంగచాటు రసికులో _ యెంతసేపు .... యెంతసేపు _ యీ దొంగచాటు వంకర టింకర కలవరపాటు వేషాలెంతసేపు.... యెంతసేపు.... బిచ్చగాడు గ్రాంఫోను ప్లేటు తిరగేశాడు_ ముత్యమంతా పసుపు _ యెంతసేపు ముత్యమంతా పసుపు యెంతసేపు రావ్గోరా వచ్చేదాకా పాలరావొచ్చేదాకా .... పోలీస్రా వచ్చేదాకా .... కుక్కలు అలిసినట్లున్నాయి తీవ్రత తగ్గింది .... అటునుంచి వచ్చిన ఆ కానిస్టేబు.... ఓరి వెధవ, తన్ననే తన్నాడు .... మూడు నాలుగు తాపులకి విడివడ్డాయి కానీ లంకెపడి .... వొకటి యిటు వొకటి అటు గింజుకుంటున్నాయి_ అప్పటికే పని ముగిసినందున అవీ విడివడాలనే చూస్తున్నాయి. కానీ కాక తగ్గనిదే ఆ కొస మెలికి వూడదు. మరో తాపుతన్నాడు.... కుయ్ కుయ్ మంటూ రోడ్డుమీదకి జరిగిపోయాయి. కార్లూ స్కూటర్లూ సైకిళ్ళూ జనం - మధ్య లాక్కుంటూ పీక్కుంటూ గింజుకులాడుతున్నాయి. వాటిని తప్పించుకోవటానికి ట్రాఫిక్ అష్టవంకర్లు తిరగాల్సి వస్తుంది. యిదేదో పెళ్ళి లంకెలా వుంది. ప్రతి పెళ్ళీ ఓ కుక్క లంకె. తిమ్మిరిలో లంకెపడి బతుకంతా లాక్కుంటూ పీక్కుంటూ పీక్కుంటూ లాక్కుంటూ....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS