Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 17

     కానీ, అతనికా అవకాశం ఇవ్వకుండా... భస్మే అతడ్ని కలిశాడు.
    రోడ్డుకు అడ్డంగా నిలబడి వున్నా ఓ ఆకారాన్ని చూసి బైక్ సదన్ బ్రేక్ తో ఆపాడు.
    ఎదురుగా... భస్మ...
    "ఎవరు... కౌన్... కౌన్ హై?" తన దరికి అడ్డుగా వున్న శాల్తీని చూసి అడిగాడు నితీష్ రాయ్.
    చీకటిలో ఎదురుగా వున్న వ్యక్తి సరిగా కనిపించటంలేదు. బైక్ హెడ్ లైట్ ని స్ట్రయిట్ చేశాడు.
    ఆ హెడ్ లైట్ వేలితురులో భస్మ కనిపించాడు.
    "ఏయ్ న్యూస్... నువ్వు... నువ్వారోజు బ్యాంకు రాబరీ జరిగినప్పుడు..." నితీష్ రాయ్ కు ఏదో అనుమానం.
    భస్మ అతని దగ్గరకి వచ్చాడు.
    "ఏం చేస్తావు? నీ గురించి ఫోలీసులకు చెబుతాను" నితీష్ రాయ్ అన్నాడు.
    భస్మ అతనికి దగ్గరగా  వచ్చేశాడు.
    నితీష్ రాయ్ గిలగిల్లాడిపోతున్నాడు.
    "ప్లీజ్.. నన్ను చంపొద్దు... ముఝే చోడ్ దో..." రిక్వస్ట్ చేస్తున్నాడు నితీష్ రాయ్.
    ఎ రియాక్షన్ లేకుండా, తన రెండు చేతులను నితీష్ రాయ్ గొంతు చుట్టు బిగించుసాగాడు.
    అంత భయంలోనూ, నితీష్ రాయ్ లో ఆశ్చర్యం. ఎంత కర్కశ హృదయుడైన ఒక్క క్షణకాలమైన రియాక్ట్ అవుతాడు. కానీ... భస్మ విషయంలో...
    నితీష్ రాయ్ ఆశ్చర్యంలో ఉండగానే అతని చివరి శ్వాస గాలిలస్స్ో కలిసింది.
    అతని శరీరం నెమ్మదిగా నేలమీదకు వాలిపోసాగింది. అయినా భస్మలో రియాక్షనూ లేదు.
    "భ..స్మ.." గాలిని చీల్చుకుంటూ మాటలు వినిపిస్తొన్నా ఫీలింగ్.
    "బైక్ లోని పెట్రోల్  టాంక్ ఓపన్ చేసి... తగలబెట్టేసేయ్" అతని మెదడు పొరల్లోకి ఆ మాటలు వచ్చేసాయి.
    పెట్రోల్ టాంక్ ఓపెన్ చేసేడు భస్మ. జర్కిస్ లోనుంచి అగ్గిపెట్టె తీసి, అగ్గిపుల్ల వెలిగించి, పెట్రోల్ టాంక్ లోకి విసిరేశాడు.
    ఒక్కసారి భగ్గుమంది.
    పెద్ద విస్పోటం... బైక్ తోపాటు నితీష్ రాయ్ శరీరం కూడా కాలిబూ..డి..దయింది.
    ఓ నిజాన్ని ప్రపంచానికి తెలిపే ప్రయత్నంలో... కాలి బూడిడిగా మారిపోయాడు నితీష్ రాయ్.
    ఆ దారుణం చూడలేనట్టు... అగ్ని కీలలు పైకిగిసి బావురుమన్నాయి. భస్మ మాత్రం కనీసం అటువైపయినా చూడకుండా వెనక్కి నడుచుకుంటూ వెళ్తున్నాడు.
                                              ***
    అడ్డం ముందు నిలబడి ఆరోసారి తనను తాను చూసుకుంది మౌన.
    పింక్ కలర్ మైసూర్ సిల్క్ శారీ, అదే కలర్ అమ్చున్నాబ్లౌజ్.. మేడలో సన్నటి గోల్డ్ చేయిన్. చాలా సిపుల్ గానే వున్నా అద్భుతమైన అందం ఆమె అణువణువూ తోణికిసలాడుతోంది.
    అది ఆత్మవిశ్వాసం వాళ్ళ కావచ్చు.
     ఆమెలో  అణువణువునా వున్న అణుకువ, అందమైన నడకవల్ల, నడతవల్ల కావొచ్చు.
    అవన్నీ కలగలిస్తేనే మౌన.
    'ఓహే...మౌనా... యూ ఆర్ ఎస్ యాంజల్...' తనకు తనే కాంప్లెమెంట్ ఇచ్చుకుంది.
    మరోసారి అద్దంలో చూసుకుని, బయటకు వచ్చి డోర్ వేసి, లాక్ చేసి బయటకు నడిచింది.
    తనకున్న మూడ్రోజుల టైం లో ఒక రోజంతా కష్టపడి, భస్మ ఆడ్రస్ పేరు తెలుసుకుంది. అతనేం చేస్తాడో, అంతో డిటైల్డ్ గా కనుక్కో లేకుండా పోయింది.
    ఆ రోజు తను భ్స్మను కలుసుకోవాలి. ఆమె ఆలోచన అదే.
                                                           ***
    కాలింగ్ బెల్ నొక్కింది.
    భస్మ ప్లాట్ ముందు వుంది మౌన.
    అటువైపు నుంచి నో రెస్పాన్స్.
    మళ్ళీ బెల్ నొక్కింది.
    అతినా నో రెస్పాన్స్.
    మళ్ళీ గట్టిగా నొక్కింది కాలింగ్ బెల్ మౌన.
    లోపల భస్మ వాష్ బేసిన్ ముండునిలబడి షేవింగ్ చేసుకుంటున్నాడు.
    అప్పుడే షేవింగ్ స్టార్ట్ చేశాడు.
    కాలింగ్ బెల్ శబ్దం అతని చెవులకు వచ్చి తాకింది.
    తాపీగా వెళ్ళి తలుపు తీశాడు.
    ఎదురుగా వున్న మౌనను చూశాడు.
    "హలో.. అయాం మౌన..." అది షేక్ హ్యండివ్వడానికికుడి చేతిని ముందుకు చాచి.
    భస్మ మాట్లాడకుండా వాష్ బేసిన్ దగ్గరకి వెళ్ళి అద్దంలో చూసుకుంటూ షేవింగ్ చేసుకోసాగాడు.
    "హలో మెన్..." అంది భస్మ మాట్లాడకపోవడంతో షేవ్ చేసుకుంటూనే వున్నాడు.
    "వాహ్... వాటే  హ్యండ్ సమ్... ఏదో ఇంగ్లీష్ సినిమాలో హీరోలానే... రఫ్ గా వుంది..." ఇంకా ఏదో చెప్పాబోతూంటే సదన్ గా మౌన ణి పక్కకునేట్టాడు.
    పక్కకు తూలిపడబోయి, తమాయించుకుని కోపంగా భస్మ వైపు చూసింది.
    భస్మ మాత్రం అదేమీ పట్టించుకోకుండా దండెం మీద వున్న టర్కీ టవల్ తీస్కోని బాత్రూంలోకి నడిచాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS