Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 8


    "నిధి అంటే ఒక సంఖ్య. మన పూర్వికులు ఒకట్లూ, పదులు వందలు, వేలు, లక్షలు, కోట్లూ, పదికోట్లూ.....అలా లెక్కించిన తర్వాత శంఖం, మహా శంఖం, పద్మం, మహాపద్మం, భూరి, మహాభూరి అలా లేక్కపెట్టేవాళ్ళు. ఈ వరసక్రమం ఏమిటో నాకు సరిగ్గా గుర్తులేదుగానీ నిధి అనే సంఖ్య వాటిలో ముప్పయి రెండోది అనుకుంటాను. నిజంగా అలాంటి నిధి అనేదే గనుక దొరికితే ఈ హైదరాబాద్ నగరాన్ని సగం వరకూ ముంచేయ్యచ్చు డబ్బుతో. అంత పెద్ద సంఖ్య నిధి అంటే!"
    ఎడిటరు అతనివైపు అభిమానంగా చూశాడు. "ఉదయార్కర్ మీ ఇంటరెస్టునీ మీ నాలెడ్జిని కలిపి ఒక సెన్సేషనల్ సీరియల్ రాయడానికి ఇది ఒక ఎక్సలెంట్ అవకాశం అని అనిపించడంలేదూ మీకు!"
    "ఉండండి పాయింటుకి వస్తున్నాను" అన్నాడు ఉదయార్కర్. "అక్కడక్కడ నిధులు దొరుకుతున్నాయి. ఆ మాట నిజమే. ఆ విషయం ఆనోటా ఆనోటా ప్రచారం అయిన కొద్ది వాటికోసం వెదికే వాళ్ళు వేలమంది బయలుదేరారు. ఈ ఆంధ్రదేశంలో చాలా పట్టణాల్లో ఆరు నుంచి అరవై దాకా పార్టీలు ట్రెజర్ హంట్ సైడ్ బిజినెస్ గా పెట్టుకున్నారని విన్నాను. కొంతమందికయితే ఇదే ఫుల్ టైం జాబ్ ట."
    "ఒక్కొక్క ఊళ్ళో అన్నేసి పార్టీలు ఉన్నాయా?" అన్నాడు ఎడిటరు ఆశ్చర్యంగా.
    "అనే విన్నాను. మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి జేలసీలు. పాలిటిక్స్, కట్ త్రోట్ కాంపిటీషను. కొట్లాటలు అప్పుడప్పుడు హత్యలు, రక్తపాతం.
    నిదిలకోసం వెదికే ఈ జనమంతా ఎవరు? చరిత్ర చదువు కున్న హిస్టోరియన్స్ కారు. ప్రాచీన సంస్కృతిని భూమిలో నుంచి బయటకు తీసే అర్కియాలజిస్టులు కాదు.
    డబ్బాశ.......కేవలం తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరి బెణుక ఒకరు గోతులు తీస్తుంటే మాములు మనుషులు వీళ్ళలో చాలా మంది.
    ఇప్పుడు మనకి తెలిసిన ఈ 'నిధి రహస్యం' వెనుక కూడా నిశ్చయంగా అలాంటి పార్టీలు చాలా ఉండి ఉంటాయి. ఉంటాయి కాదు. గ్యారెంటీగా ఉన్నాయి. వీళ్ళు ఆ నిధి కోసం ప్రయత్నాలు చేస్తూ మిమ్మల్ని ఆప్రోచ్ కాగానే అప్పుడే ఎవరో రైవల్ పార్టీ వాళ్ళు నాకు హెచ్చరిక పంపారు? దీనివల్ల తెలిసిపోవడం లేదూ? ఇంతాచేసి అక్కడ నిధి ఉన్నదన్నది చారిత్రిక సత్యమో, లేక ఉత్త భ్రమో తెలియదు."
    "అయితే ఈ ట్రెజర్ హాంట్స్ అనేవి అన్నీ ఉత్త ఫ్రాడ్ అంటారా?" అన్నాడు ఎడిటర్.
    "కొన్ని కేసుల్లో భ్రమ. కొన్ని కేసుల్లో ఫ్రాడ్. మోసం మొత్తానికి నూటికి తొంబై తొమ్మిది కేసులు ఇలాంటివే తెలతాయి."
    "అంటే......ఒకవంతు నిజమై ఉండొచ్చు అవునా?"
    ఉదయార్కర్ కాస్త సందేహించి "నూటికి ఒక్కవంతు మేబీ.........నిజం కావచ్చు" అన్నాడు.
    వెంటనే అందుకున్నాడు ఎడిటర్ "మీరన్నట్లు ఇది నూటికి తొంబైతొమ్మిది ఉండే మోసపు కేసుల్లో ఒకటి అయితే దాన్ని మనం స్వయంగా వెళ్ళి, చూసి, తెలుసుకుని, ఆ మోసమేమిటో, ఎలా జరుగుతున్నదో ప్రజలకు చెబుదాం. మిస్టర్ ఉదయార్కర్ నేనొక బాధ్యత గల ఎడిటర్ ని. మీరు ఒక రేస్పాన్సిబుల్ రైటరు. చాటుమాటుగా జరుగుతున్న ఇలాంటి విషయాలని ప్రజల దృష్టికి తెచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యడం మన బాధ్యత కాదంటారా?"
    ఉదయార్కర్ కొద్దిక్షనాలు అలోచించి తల ఊపాడు. "అవుననుకుంటాను."
    "ఇదిగనుక ఫ్రాడ్ అయి ఉంటె ఫ్రాడ్ అని తేలుద్దాం మనం. మీరు చెప్పునదాన్ని బట్టి చూసినా ఇప్పటికే కొన్నివేలమంది ఈ భ్రమలో పడి కొట్టుకుపోతున్నారు. మోసపోతున్నారు. మనం ఇందులో నిజానిజాలు తెలిస్తే వాళ్ళ కళ్ళు తెరిపించినట్లు అవుతుంది. అంతేకాదు ముందు ముందు ఇంకెవ్వరూ ఈ పిచ్చి లో పడి ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకోకుండా ఆపిన వాళ్ళమవుతాము.
    ఒకవేళ .......ఒకవేళ నిజంగానే ఈ ట్రెజర్ ట్రోప్ కనుకున్నామానుకోండి, అప్పుడు ............" ఎడిటర్ గొంతు ఎగ్జయిటేడ్ గా మారింది. చేతివేళ్ళు మడిచి లెక్కపెడుతూ. "ఒకటి .......నిఖిప్తమై పోయి ఉన్న చరిత్ర తాలూకు మరికొన్ని విశేషాలను మనం వెలుగులోకి తీసుకొచ్చినట్లవుతుంది. రెండు ......మాటల్లో చెప్పలేనంత మానసిక తృప్తి మనకు మిగులుతుంది. మూడు......మనకు సూపర్ సెన్సేషనల్ సీరియల్ ఒకటి దొరుకుతుంది. తెలుగు సాహిత్యంలో ఆ మాట కొస్తే ప్రపంచ సాహిత్యం మొత్తంలో కూడా ఇలాంటి ప్రయోగం మొట్టమొదటిసారిగా మనమే చెసినట్లవుతుంది."
    "వాట్ డు యు సే!"
    "యూ విన్!" అన్నాడు ఉదయార్కర్ భుజాలు ఎగరేసి నవ్వుతూ. నెమ్మదిగా అతని మోహంలో కూడా ఉత్సాహం చోటు చేసుకుంది.
    ఎడిటర్ వైపు హీరో వర్షిప్ తో చూశాడు అతను.
    ఎడిటరులో ఉండవలసిన క్వాలిటీస్ లో ముఖ్యమైనది, లీడర్ షిప్ క్వాలిటీ. తను ఒక సరైన నిర్ణయానికి రాగలగాలి. ఆ నిర్ణయాన్ని ఎదుటివాళ్ళు ఆమోదించేట్లు చెయ్యగలగాలి. ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టె త్రోవ చూపించగలగాలి. ఆ త్రోవలో సాగిపోవడానికి కావలసిన ఆత్మవిశ్వాసం, ఉత్సాహం కలిగించాలి.
    ఈ లీడర్ షిప్ క్వాలిటీ పుష్కలంగా ఉంది ఎడిటర్లో. శవాన్ని కూడా తట్టిలేపి ముందుకు ఉరికీంచగలడు అతను. రాతిముక్కను తీసుకొచ్చి నీలో చాలా ప్రతిభ వుంది అని దానికి నూరిపోసి సానబట్టి వజ్రంగా మార్చగలడు.
    "అయితే మీరు ఒప్పుకున్నట్లే" అన్నాడు ఎడిటరు.
    "నో! నేను ఒప్పుకోలేదు." అన్నాడు ఉదయార్కర్.
    ఎడిటరు విస్మయంగా చూశాడు.
    "నేను ఒప్పుకోలేదు. మీరు వప్పించగాలిగారు." అన్నాడు ఉదయర్కర్ నవ్వుతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS