Previous Page
ప్రేమతో ....వడ్డెర చండీదాస్ పేజి 35

                                                                                     
                                                                                                                     తిరుపతి
                                                                                                                  16-11-04
    రఘుగారికి నమస్తే,
    DD 1 చిత్రహార్ లో పాటకంటే యాంకర్ వాగటం యెక్కువ. నేనేప్పడూ పెట్టాను.
    (DD1 కి ప్రకటనలు యెక్కువ  - private channels లో లాగా!)
    టివిలో లా  కాక, రేడియో స్పోర్ట్స్ కామెంటరి - మహా గలభా చేస్తారు - పక్క స్టేషన్లకి  కూడా పాకుతుంది.
    వర్షాల నేంబుకి  కొయ్య తలుపులు బిగుతావుతాయి. నాకు కొయ్య తలుపులు అన్ని అంతే, సహజం. కాని అలమారా కొయ్య తలుపు యెండకాలం బిగుతవుతుంది. వర్షలప్పడు వోదులవుతుంది. మామూలు టిక్ కొయ్య తలుపే. అడిగితే యెవరూ చెప్పలేకపోతున్నారు!
    సితార్,  ఆలాపనకి యెక్కువ బావుంటుంది.
    Fashion TV లో,  London  Fashion  week  బాగోదు. Nes  york  Fashion  week బాగోదు.
    మరొకరితో  పోల్చటానికి లేని  అద్బుత  సితార్  విద్వాంసుడు, రవిశకంర్  - నాకు చాలా యిష్టం.
    ముఘల్ - యె -ఆజంలో దిలీప్ కుమార్ బాగోదు.
    Americans are very nationalistic.
    అన్ని రకాలగానూ ప్రపంచమంతటిలో సరిపోల్చటానికి   లేని అనితరసాధ్యుడు, శ్రీ కృష్ణుడు.
    ప్రజాస్వామ్యం  పరిణతి చెందిన దేశాలలో, మనదేశంలోలా యెన్నికల  సమయంలో  హింసాకాండ  వుండదు.
     వొ రోజు రాత్రి DD chennai లో నర్తకి చిత్రా విశ్వేశ్వరన్  వొచ్చింది.  ఆమె అని పోల్చుకున్నాను. కాస్త లావయ్యింది. నడివయసు రాబోతోంది. ముఖం చాలా బావుంది యింకా. వెనకటి కంటే కూడా బాగా చేసింది. చాలా కాలానికి మంచి నాట్యం చూశాను. యెంతో సంతోషంగా అనిపించింది.
    హ్తేబ్రిడ్ వి తినటానికంటే చూడటానికి యెక్కువ బావుంటాయి.
    నాకో రకం చెవుడు వుంది.  దగ్గిర్నుంచి  యెంత చిన్న సవ్వడి ఐనా  స్పష్టంగా వినిపిస్తుంది. ముగ్గురు నలుగురు గలభాగా మాట్లాడితే మోతగా తప్ప విభాజనగా  తెలియదు.
    రాష్ట్రపతి అబ్దుల్ కలాం; ప్రత్యేక సందర్భాలలో  తానుగా మాట్లాడేదేది వూకదంపుడుగా వుండదు.
    వుత్తమాంశలలో  త్యాగధనులంటే నాకు యిష్టం.  గౌరవం.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                         -వడ్డెర చండీదాస్.


                                                                                                              తిరుపతి
                                                                                                           11-1-05
    రఘుగారికి నమస్తే,
    రితి గౌళరాగం; బాలమురళికృష్ణ,  శేమ్మంగుడి శ్రీ నివాస  అయ్యర్ చాలా బాగా పాడారు. ప్రఖ్యాత వ్తెణికుడు మ్తెసూర్  దొర్తేస్వామి  అయ్యంగారి సుపుత్రుడు ముప్పయ్యేళ్ళ నుంచి వీణ వాయిస్తున్నాడట. అక్షరాల పండిత పుత్రుడు.
    గాయత్రిగారు అనితరసాధ్య  వీణా ప్రవిణ (ఆమె T.series  కాసేట్ repitionకి wornout  అవుతుందని నాలుగు కొన్నాను).
    మిస్సమ్మ సినిమాలో సావిత్రి,  ఆకర్షణ, అందం, అధ్బుతం.
    మిత్రులు పోలిస్  ఆఫీసర్ కె. సదాశివరావుగారు కొన్నన్ని చదివినన్ని పుస్తకాలు నాకు తెలిసినంతలో మరెవరూ లేరు. వ్తెవిధ్య ప్రజ్ఞాశాలి.
    పడమటి ఆడవాళ్ళ నడకలో సౌకుమార్యం వుండదు.
    బాలమురళికృష్ణ కీర్తనలు;డి.వి.మోహనకృష్ణ బాగా పాడాడు. లోపం కీర్తనలలో కాక, బాలమురళికృష్ణ యిప్పుడు పాడటంలో వునట్లుంది. అతని గొంతు బాలమురళికృష్ణ గొంతును  గుర్తుకు తేస్తుంటుంది.
    చావాలి కృష్ణమూర్తి గాత్రం చెంబెయ ని గుర్తుకు తెస్తుంది.
    Air hostess ల చేత చిర కట్టించంటం  ప్రభుత్వ విజ్ఞత.
    ప్రభుత్వం ప్రారంభించగానే,  cable మానేసి DTH తీసుకున్నాను. నాలుగువేలు  మొత్తం ఖర్చు.
    మొన్నొక రోజున రేడియోలో ఘంటసాల భగవద్గీత వొస్తోంది. వెంటనే ఆఫ్ చేశాను. అది తెలుగులో లేదు.  గ్రాంధికంలో వుంది. గ్రందికం వినలేను, చదవలేను.
    వుదయం అని స్టార్ వుత్సావ్ లో గంట సెపు హార్మోనియం  మోతలేని హిందూస్తాని.
    నా 55  దో యేట మిత్రులు సదాశివరావుగారు IG నా ఫోటో లు కొన్ని తీశారు. వక ఫోటో  elarge  చేసి laminate చేయించి పంపించారు. ఫోటో బావుంది. ఐతే ముఖాన  విభూతి పూసుకున్నట్లుగా ల్తేటింగు  గీత పడింది!
    బుచ్చిబాబువి  అన్ని చదవలేదు. చలంవి అన్ని చదవలేదు. కొడవటిగంటిని చదవలేదు. రాచకొండ అల్పజీవి వొక్కటే చదివాను. వున్నావ మాలవల్లి  చదివాను. విశ్వనాథను చదవలేదసలు. గ్రాంథికం చదవలేదసలు.  గోపిచంద్ అసమర్ధుని  జీవయాత్ర చదివాను. నేను తెలుగు రచయితల్లో  చదివినవి చాలా  తక్కువ. యింగ్లిషు రచయితలు మరి తక్కువ.  నేను చదివింది రాసింది తక్కువ.
    సునామి విపత్కర విషాదం యెప్పటికి  తిరుతుందో! DDBharati లో రోజూ  వుదయం 6-30 Raga &Rhythm అని వొస్తుంది.
    వ్యధ. యేదో వొక వ్యధ చెందుతూనే రాశాను అన్ని రచనలూ. desire and liberation పని పూర్తిచేసేసి వూపిరి పిల్చుకున్నారనుకుంటున్నాను.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                    -వడ్డెర చండీదాస్.      

 

                                                          అయిపోయింది


 Previous Page

WRITERS
PUBLICATIONS