ఉన్నట్టుండి వాళ్ళ నవ్వులు ఆగిపోవడమే కాదు. కెవ్వుమని కేక ప్రతిధ్వనించిందక్కడ.
రేష్మా చేతిని పట్టుకున్నవాడు ఆమెను వదిలేసి పొట్టను అరచేతులతో అదుముకుంటున్నాడు.
ఆ దృశ్యం చూడడంతో మిగిలిన వాళ్ళు రెచ్చిపోయారు. రేష్మాను అమాంతం క్రిందపడేసి మదించిన అంబోతుల్లా ఒక్కసారిగా సునిల్ ను కమ్ముకున్నారు.
దగ్గరకు వచ్చిన ఒకడి మోకాలిపై సునీల్ బలంగా తన్నడంతో అతను కెవ్వుమంటూ బొక్కబోర్లా పడిపోయాడు. అదే వూపుతో అకాలుని మరికాస్త పైకెత్తి మరొకడి తొడల సందున ఈడ్చి పెట్టి తన్నడంతో అతను బొంగరంలా తిరుగుతూ లబలబలాడి పోయాడు.
మిగిలిన ఇద్దరూ సునీల్ ను చెరొక వైపు నుండి దాడి చేశారు.
వీధి పోరాటాల్లో ఆరితేరిన గుండాలు కావడం వలన ఎలాంటి తడబాటు లేకుండా సునీల్ గుండెల్లో తన్నాడు ఒకడు, మరొకడు పిడికిలి పోట్లతో సునీల్ వెనుక వైపు నుంచి అటాక్ చేశాడు.
వాళ్ళ ఫోర్స్ కు సునీల్ తల దిమ్మెక్కిపోయింది.
దెబ్బ మీద దెబ్బలా రెండవ రౌండు తీసుకోవడానికి వుద్యుక్తు లవుతున్న ఆ ఇద్దరి వైపు కనుకోసల నుంచి గమనించాడు సునిల్.
ఛాతిలో నెప్పి సుడులు తిరుగుతున్నా తమాయించుకుంటూ పళ్ళు బిగువున విసురుగా పైకి లేచాడు. బిగుసుకున్న అతడి పిడికిళ్ళు మెరుపు వేగంతో కదిలి ఆ ఇద్దరి ముఖాలను పచ్చడి చేశాయి.
"అబ్బా!"
బాధతో విలవిలలాడిపోయారిద్దరూ.
మరిక వాళ్ళకు ఎలాంటి చాన్స్ ఇవ్వదలచుకోలేదు సునిల్.
"ఫట్....ఫట్...." మంటూ నలుగురికీ నాలుగు ఫంచ్ లను ఇచ్చాడు.
సునిల్ సత్తా ఏమిటో వాళ్ళకు ఇట్టే అర్ధమై పోయింది.
జరిగే పోరాటాన్ని విప్పరిత కళ్ళతో చుస్తున్నాది రేష్మా.
ఆమెకు అదంతా ఇంద్రజాలంలా వున్నాది.
కండలు తిరిగిన అతని శరీరం నిజంగానే ఉక్కు విగ్రహమని స్వానుభవం కావడంతో ప్రాణాల మీద తీపితో ఆ నలుగురూ కళ్ళతోనే మాట్లాడుకుని ఒక్కసారిగా అంబాసిడర్ కారు ఎక్కేశారు.
మరుక్షణం ఆ ప్రాంతం నుంచి దూసుకుపోయింది అంబాసిడర్.
"వెధవ నాయళ్ళూ ----ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు కళ్ళు కామంతో కైపెక్కి పోతాయి?" అంటూ రేష్మా వైపు తిరిగాడు సునిల్.
ఉన్నట్టుండి సుడిగాలిలా వచ్చిన రేష్మా అతన్ని చుట్టేసి ముద్దులతో ముంచెత్తింది.
"థాంక్యు -- హేండ్ సమ్ .....థాంక్యు ఈరోజు నా మానప్రాణాలు రెండింటిని కాపాడావు ----నీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను."
సునిల్ ఖంగారుగా ఆమెను దూరంగా జరిపాడు.
ఆమె చర్య అతనికి అదోలా అనిపించింది.
"ఓహ్ సారీ ఫ్రెండ్ ---- అనందాశయంతో నేనేం చేశానో నాకే తెలియలేదు. ఎనీహౌ ---నీలాంటి మంచి మిత్రుడు నాకు దొరికినందుకు రియల్లీ ఐ యామ్ వెరీ హాపీ .........అది సరే గుర్తు ఉందిగా .....రేపు డిన్నర్ కు మరచిపోకుండా రావాలి. ఎలాంటి కుంటి సాకులు చెప్పకూడదు .......
"డ్యూటీ అంటూ ఆలస్యం చేయకండి ......మధ్యాహ్నం రెండు గంటల కల్లా వచ్చేయడానికి ప్రయత్నం చేయాలి ----మీరు వచ్చే వరకూ భోజనం చేయకుండా మీ కోసం ఎదురు చూస్తుంటాను" చిరునవ్వుతో అంటూ విజిటింగ్ కార్డ్ ఇచ్చింది రేష్మా.
"ఓకే.....ష్యూర్ " అంటూ అటుగా వెళ్ళుతున్న ఆటోను పిలిచాడు సునీల్.
రేష్మా అటో ఎక్కింది.
అతనికి ఆ రాత్రి రకరకాల ఆలోచనలతో .......కొత్త కొత్త వూహలతో భావి జీవితం పట్ల పెరుగుతున్న ఆశలతో .......అస్థిమితంగానే గడిచిపోయింది.
మరుసటి రోజు.......
రేష్మాకు మాట ఇచ్చినట్టుగానే మధ్యాహ్నం ఆటోలో ఆమె ఇంటికి బయలుదేరాడు.
అతని కోసమే ఎదురు చూస్తూ కూర్చుంది రేష్మా.
"వెల్ కం హాండ్ సమ్"
"అబ్బ రేష్మా .......చెప్పానుగా నా పేరు సునీల్ అని"
"నేనూ చెప్పానుగా ..........నిన్ను అలానే పిలుస్తానని...."
ఏమని చెప్పినా ఆమె వినదని అర్ధం కావడంతో మౌనం వహించాడు సునీల్.
గులాబీ రంగు చీరలో ......లావెండర్ పెర్ ఫ్యుమ్ గుభాళింపులతో తలలో మల్లెలు......చేతికి నిండుగా గాజులు , ఆ కట్టు బొట్టు చూస్తే కొన్ని గంటల క్రితం ఒళ్ళు మరచిపోయి చిందులు వేసిన రేష్మాఈమె అంటే తెలియని వాళ్ళు ఆశ్చర్యపోక తప్పదు.
ఆమె అందాన్ని చూస్తూ రెప్పవేయకుండా వుండలేకపోయాడు సునీల్.
"రండి ......వెళదాం"
చొరవగా అతని చేయి పట్టుకుని డైనింగ్ గదిలోకి తీసుకు వెళ్ళిందామె.
అప్పటికి తేరుకున్నాడు అతను.
"ఏరీ ........మీవాళ్ళు ఎవరూ కనిపించరేం"
"ఇప్పటివరకు చూసి చూసి బోర్ కొట్టి ఇంతకుముందే పిక్చర్ కు వెళ్ళారు.... ఈసారి వచ్చినప్పుడు పరిచయం చేస్తానులే.......' అంటూ వడ్డించడం ప్రారంభించింది రేష్మా.
మంచి స్నేహితురాలు దొరికినందుకు సునీల్ మనస్సు సంతోషంతో నిండిపోయింది.
రేష్మా తన పట్ల ఆప్యాయతను కురిపించడం చూస్తున్న సునీల్ కు ధీరజ గుర్తుకు వచ్చింది.
ఇప్పుడు ఏం చేస్తుందో.
తను ఈ ఉద్యోగం చేస్తున్నానని తెలిస్తే చస్తే ఒప్పుకోదు.....అందుకే ఆమెతో చెప్పలేదు.
"హాండ్ సమ్ ....ఏమిటి కలల్లోకి వెళ్ళిపోయినట్టున్నావు."
అంటున్న రేష్మా మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు.
ఎదురుగా రెండు గ్లాసులలో డ్రింక్.
"రేష్మా ....ఏమిటది."
"హాట్ డ్రింక్."
"అది తెలుస్తూనే వుంది ....అందుకే అడుగుతున్నాను"
"నాకు మాత్రం అలవాటు వుందనుకున్నావా...జస్ట్ నీ కోసం......నీ లాంటి ఆత్మీయుడు దొరికిన ఈ సందర్భంలో ఎందుకో నా మనస్సు సంతోషంతో పొంగిపోయింది. అందుకే నాకోసం కాదనకు.....ప్లీజ్ .... ఎంజాయ్" అంటూ తనే చొరవగా అతని నోటికి గ్లాసును అందించింది.
మనస్సులో ఏమూలనో వున్న ప్రేమ అతనిని లొంగదీసుకుంది.
ఆ గ్లాసు అందుకుని రెండు గుటకలు వేశాడు.
"థాంక్యు హాండ్ సమ్ ..." అంటూ తనూ తీసుకోసాగింది.
స్కాచ్ విస్కీ గొంతులోకి సాప్ట్ గా దిగుతుంది.
ముందు ఒక గ్లాసు మాత్రమే తీసుకుందామనుకున్నాడు.
కానీ రుచి చూశాక గ్లాసు వెంట గ్లాసు ఖాళీ అవుతూనే వుంది.
ఇద్దరూ కబుర్లలో పడి ఎన్ని పెగ్గులు బిగించారో వాళ్ళకే తెలియకుండా పోయింది.
సునీల్ కళ్ళు వాలిపోతున్నాయి.... తూలిపోతున్నాడు.
తడబడే అడుగులు వేస్తున్న అతనికి తన భుజాన్ని ఆసరాగా ఇచ్చి బెడ్ రూమ్ వైపు నడిపించింది రేష్మా.
* * *
ఎవరో తట్టినట్టు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సునీల్.
ఒక్క క్షణం తను ఎక్కడ ఉన్నదీ అర్ధం కాలేదు.
డబుల్ కాట్ బెడ్ పై ..... డాన్సర్ రేష్మా తో తను.....
నమ్మశక్యం కాక కళ్ళు నులుముకుని మరీ చూశాడు.
ఇద్దరూ నగ్నంగా ,.....తన కౌగిటిలో ఒదిగిపోయి ఉన్న రేష్మా .....
ఏం జరిగి వుంటుందో ఊహించగలిగాడు ........రాత్రి దృశ్యం లేలగా అతని కళ్ళముందు మెదిలింది. ఆ తాగిన మైకంలో ఒళ్ళు తెలియకుండా రేష్మా తో రాత్రి అంతా.....తరువాత ఆలోచించలేకపోయాడు సునీల్.
సూర్య కిరణాలు ముఖం మీద పడుతుండగా ఆమెకు మెలకువ వచ్చింది.
తనను తను చూసుకున్నది . తనపై దుప్పటి కప్పి వుంది. తను వున్న స్థితి గుర్తుకు రావడంతో ఆమె బుగ్గలు సిగ్గుతో కెంపులు అయ్యాయి.
దూరంగా జరిగి వున్న సునీల్ వైపు తిరిగి అతనిని లతలా పెనవేసుకుని దుప్పటిలోకి లాగింది.
