Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 33

   
                       నీవు
   

"ఇన్ని నే బ్రతికిన దినాల పన్నిన వ్యూహాన
నిన్నెక్కడ కలిసికొనినానొ స్మృతికి రాదు గాని నీవు లే
వను నట్టి కాలమే నాకు లేదు; నా దారి నుండి నిన్ను
విడదీయు వేరు మార్గమే లేదు; నీవు కలసి
త్రాగని నేను త్రాగు మధుపాత్ర యన్నదియు లేదు;
చలికి తాళక వచ్చు నీ కొరకు స్థానమీయని ఆస్థాన మొకటి
నాకు లేదు; నా నిదురించు శయ్యాగృహమ్ము నీవు లేక
నాకు పచ్చి శూన్యమ్ము"---

"నా తలపు మొగలి పువ్వున గుచ్చి నిలిచినముల్లు నీవు;
నా బ్రతుకు దైనందినపు భోజనాల నీవు రుచివి;
నా .యదృష్టపు తాళ్ళకొనల వైచుకున్న ముడివి నీవు;
నిన్ను ప్రేమించినాను, నిందించినాను, ద్వేషించినాను
నీ కొరకు చేతులు చాచినాను, పొమ్మని తల్పులు మూసినాను
కాని యిది యేమి?
నీవు లేనిచోటున నాకు చోటులేదు, సుఖములేదు,
లేదు ఉనికి."
(ఎవరెస్ట్ లెనిన్ అనే కవయిత్రి పద్యానికి అనువాదం.)

           *    *     *       
                ---1957
ఒక శ్రుతి
ఒక శ్రుతి
ఒక గతి
వినబడును దూర దూరముల
దూర దూరముల
రేఖగా
పొలిమేరగా
కరిగి నిల్చిన నాలోన
ఒక శ్రుతి
ఒక గతి


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS