Previous Page Next Page 
శశిరేఖ పేజి 3

                                                              2
సూర్యాస్తమయ సమయము కాలువవద్ద నిశ్శబ్దముగ నుండెను.చుట్టుపక్కల నెవ్వరును లేరు. తురాయి వృక్షము క్రింద మన స్నేహితులిద్ధరును ఆనంద సల్లాపముల నుండిరి. ఎండలేదుగాని వింతయగు తెల్లని రంగు ఆకసము నుండి భూమి పైప్రవహించుచుండెను. శశిరేఖ ఎత్తయిన రాయి పై కూర్చుని యున్నది. కృష్ణుడు మోచేతి పై ననుకొని ఆమె పాదములవద్ద  పచ్చిక పై బరుండి, ఆమె నేత్రములనుండి వచ్చు ప్రేమా దృష్టులను ఆస్వాదించుచున్నాడు. ప్రేమతో నిండియుండు హృదయమునకు ఏ కొలది వరమ్తెనను మహానందము నోనరింపగలదు. ఇంతకన్న వేరు స్వర్గమును నిరువురును కాంక్షించుటలేదు. శరీరమును,హృదయమును, సర్వశక్తులను సిద్ధమ్తె ప్రేమ చుంబనముకొరకు వేచియుండు సమయము వంటి ఉత్సాహసమయము జీవనమున ఏ మనుజుడును పొందడు.ఆ కాలమే స్వర్గము. స్వర్గమున్నను అంతకన్న ఆనందము నిచ్చుట దురూహ్యము. ఒండొరుల చేతుల కలిసి, ఒకరి ముఖారవిందము నొకరు అతి తృష్ణతో అవలోకించుకోనుచు, పలుకులే అమృతముగ   తాగుచున్నారా యనునట్లు రహస్యభాషనముల వారా అమూల్యమగు నిమిషముల గడిపిరి. మేఘములనుండి మెల్లమెల్లగా కాంతి తగ్గిపోవుచున్నది. సూర్యుని వేడి కౌగిలిని  వదలిన భూమి అలసి మూర్ఛ నోందుచున్నట్లున్నది. సరుకు చెట్టుపైరెండు చిలుకలు మాట్లాడుచున్నవి. నేలపై గోరువంక యొకటి కడపటిసారి నోరు నించుకోనుచుండెను. చెట్టు వెనుకనుండి యుడుత యొకటి తోంగిచూచెను. గాలివలన కాలువలో నీళ్ళు చప్పుడు చేయు చుండెను.రెండు బాతులు తెలియాడుచు స్వేచ్చా ప్రేమ వివాహమును గావించుచుండెను. ఆహ పక్షులలో ప్రేమ యెంతసరళము, యెంత సులభము! మానవునకేనా ఇన్ని యాటంకములు? ఆ  సమయమున ఆ ప్రియా ప్రియుల సంతోషాదిక్యాత నెవ్వరు తెలిసికోనగలరు,  అనుభవించినవారు గాక! ఒక్కగంట అట్టి సంతోషము కొరకు, రాజ్యములను,ధనరాసులను, కీర్తిని, మోక్షమును యావజ్జివన సౌఖ్యమును  నర్పింపవచ్చును. అర్పింప సందేహించువారిది దౌర్భాగ్యము. నిమిష నిమిషమును ఒండొరుల సౌందర్యము వింత యుద్రేకమును  గోల్పుచుండ, ఒండొరుల పల్కులుముఖముల నూతన కళలచే నింపుచుండ, ఒండొరుల దేహస్పర్శ ప్రతినరమును ప్రతి రక్తబిందువును తమ్మిరియందు లాగుచుండ, బాధయు సౌఖ్యమును తెలియని ఆ స్ధితి నెవరు వర్ణింపగలరు! పడమట శుక్రుడు కాంతిని కార్చుచున్నాడు. కాంతివలె చీకటి భూమిని కౌగిలించుకోనుచున్నది. నక్షత్రములు రాలి ఆకులలో చిక్కుకున్నట్లు మిణుగురు పురుగులు చెట్లలో మెరయుచుండెను.
కృష్ణు- ఎంత అందంగా వున్నావు!
శశి -  నీ కంటేనా?
కృష్ణు - ఆ.  చిత్రకారుణ్ణ యితే  నీ బొమ్మ రాసేవాణ్ణే, కాని, ఆ వంటి వంపులన్ని ఎట్లా కనపర్చేవాడిని! పోనీ కవినయితే,ఎన్ని పాటలు చేసేవాడిని  నీమీద. కాని ఎన్ని మాటలైనా  ఎన్ని రాగాలైన ఆ ముఖము   అందమన్నా తెలియజేయగలవూ?  కాని ఏమి కానుగా?
శశి - ఆ పనులేమీ  చెయ్యనక్కరలేదు, నా దగ్గిరిట్లా కూర్చుంటే అంతే చాలు.
కృష్ణు - ప్రేమ అనే దానికి తృప్తిలేదు. ఎంత తాగినా ఇంకా కావాలనిపించేది అది ఒక్కటిలాగే వున్నది. నువ్వు  రాత్రింబగళ్ళు నా దగ్గిరున్నా నాకు తృప్తి ఉండదే, ఇట్లా రోజుకి నాలుగు నిముషాలు దయచేసై ఎట్లా ఉంటుంది నాకు?
శశి - ఈ సాయంకాలము  రాత్రి కాకుండా  సాయంకాలంగానే ఉండరాదూ? మనమెంత  కోరుకున్నా అట్లా వుండదు  కదా?
కృష్ణు- సూర్యుడిమీద  నెపంవెయ్యకపోతే  రాత్రయితేనేం నాతో వుండిపోకూడదూ?
శశి - అమ్మా!
కృష్ణు - ఉంటే యేం?
శశి - ఆశే!
కృష్ణు - నీకిక్కడుండడం  భయమా?
శశి - భయమెంటి?
గాలి కృష్ణుని ముఖము  పై శిరోజములను కదిలించింది.ఆమె వానిని సరితిసెను. కృష్ణుడామె తోడవద్ద పరుండి ఆమె ముఖము వైపు చూచుండెను.
శశి - రాత్రి అవుతోంది. నిన్ననే అమ్మ అనుమానపడ్డది. నేను వెళ్ళోద్దూ?
కృష్ణుడు లేచి కూర్చుని
"సరే కాని వాళ్ళతో మాట్లాడినావూ?"
శశి - ఆ. కాని ఏమంటారో మనకి ముందరే తెలుసుగా?
కృష్ణు- ఏమన్నారో చెప్పవూ?
శశి - చెప్పేదేముంది?
కృష్ణు - అట్లా కాదు. వాళ్ళ మాటలు చెప్ప.
శశి - అత్త వారింటికి వెళ్ళక  తప్పదన్నారు.
కృష్ణుడు నవ్వెను.
కృష్ణు- నువ్వేమన్నావు?
శశి - వెళ్లనన్నాను. సరేనా?
కృష్ణు- అన్నావుగాని; ఏం చేస్తావు?
శశి - అదే తోచటంలేదు! నామాటల తరువాత అంత ద్తేర్యం  చేయ్యరనుకుంటా.
కృష్ణు - శశి, నాకు భయంగా వుంది. వాళ్ళు నిజంగా వస్తే నీ వొక్కత్తేవేం చేస్తావు? నేనేం చేస్తాను?నా దాన్ని, నా ప్రాణాన్ని, నా చిన్న శశినీ ఎవడో వచ్చి తీసుకుంటూ వుంటే చూస్తో వూరుకోనా? ఏం  చెయ్య తలచుకున్నావు చెప్పు?
శశి - నాకేం తెలిదు. నేను వద్దంటే వాళ్ళేం  చేస్తారు? అసలు రారు. కానిద్దూ, చూద్దాం.
కృష్ణు - చూసేదేమిటి?


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS