నేనూ - వచన కవిత్వం
ఈ వేళ ఆఫీసంతా ఒకటేగోల. ఎవరి నోటవిన్నా ఒకటే మాట.
"వెంకట్రావు చచ్చిపోయాడు."
"అబ్బో!... ఎలాంటి రచయిత!"
"దేశానికి తీరనిలోటు అతను చనిపోవడం."
వెంకట్రావు చనిపోయినందుకు ఇంతమంది బాధపడ్తుంటే నాకనిపించింది, అతను నిజంగా ధన్యజీవి.
ఆ ఆలోచన నాకు ఆ రాత్రంతా నిద్రలేకుండా చేసింది.
అవును... నేను చస్తే అసలు బాధపడేవాళ్ళు ఎవరైనా ఉంటారా? బాధపడడం మాట ఎలా ఉన్నా మా యింటి యజమాని సంతోషిస్తాడు, మరో పదో పాతికో అద్దెపెంచి మరొకరికి నా గది అద్దెకివ్వొచ్చని.
ఆఫిసులో నాతో పని చేసేవాళ్ళు "అయ్యో! పాపం బుచ్చిబాబు పోయాడట!" అని కాస్సేపు విచారిస్తారు.
నా స్నేహితుడు చంచల్రావు మాత్రం కాస్త ఎక్కువగా బాధపడ వచ్చునేమో!!...
.jpg)
అదే పేరున్న ఏ రచయితో, సంగీత కళా కారుడో కవో, డాన్సరో.నటుడో, ఎవరయినా పోతే దేశం యావత్తూ బాధ పడతారు. అదీ జన్మంటే.
తినడం, ఆఫీసుకు వెళ్ళడం, మళ్ళీ ఇంటికి వచ్చి తినడం నిద్రపోవడం ఏమైనా అర్థం వుందా ఈ జీవితానికి?
నాలాంటివాడు బ్రతికినా ఎవరికీ లెక్కలేదు, చచ్చినా ఎవరికీ లెక్కలేదు. ఏం బ్రతుకు ఇది "థూ..."
"ఏయ్ మిస్టర్"
ఎవరో గట్టిగా అరిస్తే ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాను. నేను కూర్చుని వున్న కిటికీ దగ్గర ముఖం జేబురుమాలుతో తుడుచుకుంటూ కిటికీలోంచి ఎర్రగా చూస్తున్నాడు అతను.
నేను రెప్పలు పైకి ఎగరేశాను ఏమిటన్నట్లు.
"దారినపోయే జనాన్ని చూసుకోకుండా అలా ఉమ్మూస్తే ఎలా?" గట్టిగా అరిచాడు అతను.
అతని అరుపుకి నాగదిలో తగిలించిన నా డిగ్రీపటం టప్పున క్రిందపడింది.
నా పొరపాటు అర్థమయింది.
"సారీ... వెరివెరీ సారీ" అని కిటికీ తలుపులు మూసేశాను. మళ్ళీ అతను అరిస్తే ఇంకా ఏం పడిపోతాయోనన్న భయంతో.
మళ్ళీ రచయిత వెంకట్రా
వు గుర్తుకొచ్చాడు.
"ఎందుకొచ్చిన బ్రతుకు... థూ"
"గదినిండా ఇలా ఉమ్ములూస్తే ఊశావ్ గానీ కాస్త రెండ్రోజులకోసారి పనిమనిషితో కడిగించు."
నా గది గుమ్మంముందు నిలబడి కోపంగా చూస్తూ అంటున్నాడు ఇంటి యజమాని.
***
మర్నాడు ఆదివారం కావడంతో కాస్త ఆలస్యంగా లేచి కాఫీ పెట్టుకుని త్రాగి స్నానంచేసి చంచల్రావు దగ్గరికి బయలుదేరాను.
"ఏమిటోయ్ కళ్ళంతా ఎర్రగా ఉబ్బి ఉన్నాయ్?" అని అడిగాడు నన్ను చూస్తూనే చంచల్రావ్.
"రాత్రంతా నిద్రలేదు"
"ఏం? మళ్ళీ ఎవరినైనా ప్రేమించావా లేకపోతే ఇంటాయనతో ఏదయినా ట్రబులా?"
"అదేంకాదు" అంటూ దీర్ఘంగా నిట్టూర్చాను. ఆ గాలికి గోడకున క్యాలెండరు రెపరెప కొట్టుకుంది.చంచల్రావు క్రాపురేగింది.
"చూస్తూంటే పెద్దగొడవలానే ఉంది" అన్నాడు క్రాపు సర్దుకుంటూ.
"అవును... పెద్దసమస్యే. రాత్రంతా ఆలోచించాను గానీ పరిష్కారమే కనబడలేదు. నువ్వే మార్గం చూపించాలి. వాడిని పట్టుకుని గట్టిగా కుదుపుతూ అన్నాను.
సర్లె సర్లె... వదులు"
నేను వాడిని వదిలేసి దూరంగా జరిగాను. వాడివైపు చూసిన నాకు ఆశ్చర్యంగా వేసింది.
"ఓరి చెంచిగా! మ్యాజిక్కు లెప్పుడు నేర్చుకున్నావ్ రా?"
"ఏం?" చంచల్రావు నాకంటే ఎక్కువగా ఆశ్చర్యంగా చూశాడు.
"ఇందాక నేనొచ్చినప్పుడు నీ చొక్కా బాగుంది.ఇప్పుడు ఒంటిమీద ఉన్నది ఉన్నట్టుగానే మొత్తం చిరిగిపోయి ఉంటుంది. అసలే పట్టుతప్పిన పాతచొక్కా కదా?"
వాడి చొక్కా చిరిగినందుకు నాకు చాలా బాధ కలిగింది. నా ముక్కు పొంగింది.

"నన్ను క్షమించరా" గభాలున వాడిని గట్టిగా కౌగిలించుకున్నాను.
"ఫర్ ర్ ర్..."
"ముందు నన్నొదల్రా" గట్టిగా అరిచాడు చంచల్రావు.
ఆ అరుపుకి గుండెలవిసిపోయి వాడిని వదిలేశాను.
