CARNATIC VOCAL
యీ దిగువ రాగాలు, బాలమురళికృష్ణ గాని, యం.యస్. సుబ్బలక్ష్మి గాని యం.యల్. వసంతకుమారిగాని; వోక్కోక్కరుగా గాని, విడివిడిగా అందరూ గాని గానించినవి.
cassetteలో యీ రాగాలలో యే వొక్కటివున్నా చాలు.
1. మోహనం - నను పాలింప
2. హిందోళం - సామజవరగమన
3. కళ్యాణి -సుందరి ని దివ్య రూపము
4., శ్రీ -యెందరో మహానుభావులు
5 . అభేరి - నగుమోము
6. హంసధ్వని - వాతాపి గణపతిం
7. రితి గౌళ - జనని నిన్ను వినా
8. బిలహరి - దొరకునా యిటువంటి సేవ
9.శుద్దధన్యాసి -నినుగని
10. మధ్యమావతి - పాలించు
11. సామ - మానవ సంచరరే
12.తోడి - యెందుకు దయరాదురా
Dr.A.Raghuramaraju
phone :
e- mail
తిరుపతి
27-11-03
రఘుగారికి నమస్తే,
గుర్తొచ్చిన మరికొన్ని-
13.కురుంజి -క్షీరాబ్ధి కన్యకకు
14. నాటకురంజి -శివదిక్షా పరురాలనురా
15. జయంత శ్రీ - నీరజ సామనియ కృష్ణ
16. కాంభోజి - క్తెలాసనదేవ
17. ఆరభి - పాలింప.
18. ధర్మావతి -నమః శివాయ రుద్రానమో
డాబా మిద గింజలు ఆరబోస్తారు. కాకులోస్తాయి. వాటి రూపం చూపు గొంతు బుద్ది ఘోరం. వుత్త చుప్పనాతి బుద్ది. చూస్తుంటే మండుకొస్తుంది. తరువాత పావురాళ్ళోస్తాయి. యెంతో లలితంగా ముద్దుగా వుంటాయి. వాటి కదలిక బావుంటుంది. గింజలేరుకోవటం బావుంటుంది. మేడలు వోంచటం బావుంటుంది. చిన్నారి తల్లులు. బంగారు తల్లులు.
మీనాకుమారి ప్యూర్ వుర్దులో మాట్లాడుతుంది. మాట్లాడటం, చాలా హుందాగా వుంటుంది. గొంతు, చాలా ప్రత్యేకంగా ఆకర్షణియంగా వుంటుంది.
మాజీ రాష్ట్ర పతి కె.ఆర్. నారాయణన్ కు చాలా మంచి సంగీతాభిరుచి వుంది.
యం.యస్. గోపాలకృష్ణన్ వయొలిన్ (super Tapes and Discs, chennai ) కొని వినండి.
కూల్చిన దొంతర కట్టడాల గురివిందల అంతులేని మతమౌడ్య రాజకీయాలు.
ద్వారం వెంకట స్వామినాయుడు వయొలిన్ లో వేణువు సవ్వడి కూడా ద్యోతకమవుతుంది. యిది ప్లస్ పాయింట్ అనుకోను.
సినీనటులు శతృఘ్నసిన్హా, రజనీకాంత్ లు మొరటుగా వుంటారు.
ప్రఖ్యాత హిందుస్తాని గాయకుడు భిమ్ సేన్ జోషి నాకు యిష్టం లేదు. పాడుతూ మధ్యలో కేకలు పెడుతుంటాడు.
నేను యునివర్సిటి నుంచి పొందింది, ల్తెబ్రరి .నాకు పుస్తకాలు కొనే ఆర్ధిక సామర్ధ్యం లెదని; అప్పడప్పడూ కొనటం మానేశాను. యునివర్సిటి (వుస్మానియా కూడా) ల్తెబ్రరి నుంచి తెచ్చుకుని యెన్నో పుస్తకాలు చదివాను.
రోజుకి పది పన్నెండు గంటలు రేడియో పెడతాను -పాటలు, శాస్త్రీయ సంగీతం.
యివ్వాళెందుకో నిద్ర లేవగానే మెలోడిక్విన్ గుర్తొచ్చింది. రేడియో స్టేషన్లవాళ్ళు ఆమెవి రోజుకి రెండు మూడు డజన్ల పాటలు వినిపిస్తుంటారు.
తమిళులు వొత్తులు యెంత పలకరో అంత అతి యెక్కువగా పలుకుతుంది. యం.యస్. సుబ్బలక్ష్మి.
నాకు, యం.యల్. వసంతకుమారి గొంతు ప్రత్యేకంగా యిష్టం. ఆమెకు రావాల్సినంత పేరు రాలేదు.
స్త్రీ వల్ల పతనం అనే ఆర్యోక్తిని అతి వృద్దాప్యంలో NTR నిరూపించాడు.
హిందూస్తాని గాత్రంలో పక్కవాధ్యంగా హార్మోనియం; వెధవమోత. కర్నాటక మోహనం లాంటిదనుకుంటాను.)
అమీర్ ఖాన్ గొంతులోని నిర్వాణ విషాదం; స్వరామృతధారా, హిందూస్తాని గాత్రంలో అందరికంటే అతని గొంతు యెక్కువ యిష్టం, నాకు.
కిషోరి అమోన్ కర్ బాలమురళీకృష్ణలా, మూడి.
రాగేశ్రీ రాగం. కిషారి అమోన్ కర్ కంటే బడే గులాం ఆలీఖాన్ యెక్కువ బాగా పాడాడు.
మీ నలుగురికి శుభాకాంక్షలు
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
13-12-03
రఘుగారికి నమస్తే,
మీ వుత్తరం.
అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకునే వరకూ జాగ్రత్తగా వుండండి. పనులు తగ్గించుకోండి.
VCR recording సమస్యగాని ఐతే BPL service వాళ్ళ technician ని పిలిపించి చూపెట్టమనండి.
music cassettes -పూర్తిగా కోలుకున్నాక, తీరిగ్గా చూడండి, తొందరేముంది! Repetition, confusion లేకండా కొన్న cassettes వొక కాగితం మిద నోట్ చేసుకుంటూండండి. పంపటానికి తొందరలేదు. యెక్కువ కొన్నట్లయితే కొరియర్ లో పంపండి. కొరియర్ వాళ్ళకి అడ్రసు లో మబ్బురామి రెడ్డి విది అని రాయండి. DTDC లో.
రాత్రి అకారణంగా నిద్ర మెలుకువొచ్చి - అకారణంగా హిందీ సినిమా ఆమ్రపాలి గుర్తొచ్చింది. వ్తెజయంతిమాల బావుంది. అది గుర్తొచ్చి, శోభానాయుడుగారి చండాలిక నృత్యరూపకం గుర్తొచ్చింది. యిద్దరూ యిష్టం.
సాధారణంగా - హిందూస్తానిలో అరగంటకోక రాగం, కర్నాటకలో పావుగంట కోక రాగం. కార్నటక జావళిల్లాంటి వనుకుంటాను. వాటికంటే జావళీలు యెక్కువ బావుంటాయి.
Apply చెయ్యకుండా interview లేకండా యెవ్వరిని ప్తె పోస్టుకి యెంపిక చెయ్యని రూలుండగా; యే యెపాయింటుమెంటు లేని సమయంలో యునివర్సిటి వాళ్ళు నన్నోక్కణ్ని రీడర్ గా యెపాయింట్ చేశారు - యెందుకో, యేమో. కాని నాకేమి సంబంధం లేదు. నేను అంగీకరించలేదు.
వోకేవొక స్త్రీ లొలుణ్ని. వోకేవోకరి విణాలోలుణ్ని. శ్రీ కృష్ణుడు, దక్షిణాది వేణువుకాక, తను నివసించిన ప్రాంతపు బాసురి వాడి వుంటాడు!
లాల్ గుడి జయరామన్ వయొలిన్ యిష్టం లేదు. రాగం తానం పల్లవి అని వుంటే ఆశపడి ఆ cassette కొని నిరుత్సాహపడ్డాను.
బిస్ మిల్లాఖాన్ అసాధారణ అనితరసాధ్య ప్రతిభావంతుడు.
మీ నలుగురికి శుభాకాంక్షలు
-వడ్డెర చండీదాస్.
