తిరుపతి
6-9-03
రఘుగారికి నమస్తే,
గమనించుకోకండా వుత్తరం మొదలెట్టాను.
వివిధ భారతి అనురంజనిలో మహానుభావుడు బడే గులాం ఆలీఖాన్. బాలమురళికృష్ణ, యం.యస్. సుబ్బలక్ష్మి లంత యిష్టం.
కొనసాగాకండా అలాగే రెండు రోజులు గడిచాయి.మీ వుత్తరం వొచ్చింది. కష్టమ్తెనా యిష్టమే కదా! పట్టినంత సమయం పట్టనిండి. సంతృప్తిగా అనిపించినప్పుడు వాళ్ళ సూచనల మేరకి revise చెయ్యండి.
సబేరే సబేరే.... స్కూల్ చలే స్కూల్ చలే హమ్ - అని చచ్చుట్యూన్ తో పరమ బోరింగ్ గా, స్కూలంతే అంత బోరింగ్ గా అనిపించే సుదీర్ఘ ప్రకటన. Ineffective గాని వుండొచ్చు. వివిధ భారతిలో మాటిమాటికి విసిగిస్తున్నారు. యిది యెవరూ వినరు. విన్నా, విని బడికి వెళ్ళారు. మధ్యాన్నం భోజనం కారణంగా వెడతారు.
టివిలో , Johnson & Johnson వారి పసిపాపల ప్రకటనలు యిష్టం.
వివిధ భారతిలో మధ్యానం మంచి పాటలు రావటం లేదిప్పుడు. అడిగేవాళ్ళు మారిపోయారు. కొత్తపాటలు అడుగుతున్నారు. టివిలో కూడా యేవి బావుంటం లేదు. సమయమంతా టేప్ రికార్దరే యింక.
ఎవర్తేనా, గాయత్రిగారి విణానాదం, వాయించటం తరవాతే. I simply adore her.
మీ నలుగురికి శుభాకాంక్షలు
-వడ్డెర చండీదాస్.
సాలిళ్ళ తిరుపతి
15-9-03
రఘుగారికి నమస్తే,
alternate chapters అందాయి. అదే ద్యాసలో వుంటాను.
Negative Reports కి అందకండా దిగువన మిగిలిపోయిన typhoid కి హొమియోపతి వ్తెధ్యం చేయిస్తున్నాను.
నిన్న పొద్దుట స్టార్ గోల్డ్ పెడితే దేవదాస్ వొస్తోంది. బిమల్ రాయ్ ది. బాగా తీశాడు. సినిమా చినర్లో వుంది. సీసాలో మందు ఐపోయి విడిలో జోగుతూ కూలబడివున్న దిలీప్ కుమార్ ని వెతుక్కుంటూ వొచ్చిన వ్తెజయంతిమాల చూసి తిసుకెడుతుంది. వాళ్ళిద్దరూ నాకు యిష్టం. వ్తేజయంతిమాల బాగా చేసింది. దిలీప్ కుమార్ కూడా బాగా చేశాడు. వీడ్కోలు. యెడ్లబండిలో పార్వతి వూరికి ప్రయాణం. సమాప్తం. (యిలాగే ముక్కలు ముక్కలుగా తరచూ చూస్తుంటాను) BW 1956.
గాయత్రిగారివి చాలా cassettes వొక్కో రకంగా వుంటుంది.child prodigy అట. వకప్పటి సిని సంగిత దర్శకుడు అశ్వద్దామ కుమార్తె అట. వేనకేప్పడో; సుశీల అద్బుతంగా పాడిన "చందన చర్చిత" పాటను అంత అధ్బుతంగానూ, వీణ మిద పలికించారు. అప్పటికి E. గాయత్రిగారు కాదు. Bady Gayaathri.
నా చిన్నప్పుడు యం.యస్. సుబ్బాలక్ష్మి రికార్డు పాడటం అవగానే my name is subba lakshmi అని చెప్పేది!
మీ పదో తేది వుత్తరం అందింది. నవంబరు 6న పెళ్ళికి వస్తున్నట్లు చదివి సంతోషించాను.
నా ఆరోగ్యం అంత యిబ్బంది యేమి లేదు. 99 జ్వరం చూసుకుంటే తప్ప తెలియదు. నోరు చేదుగా వుంటుంది. unpleasent. 11PM to 11 AM normal గా వుంటుంది. నోరు చేదు వుండదు. నయమవటానికి సమయం పడుతుందని హొమియోపతి డాక్టరు అన్నాడు.Nothing to worry అట. మీరు చెప్పాక- Overhead Tank నీళ్ళు brush చేసుకోటానికి కూడా వాటడం లేదు. డాక్టరుని అడిగాను-బోర్ వెల్ నుంచి డ్తెరక్టుగా పట్టుకుంటే కాచ అక్కరలేదన్నాడు. అవసరం ఐతే నీళ్ళు Test చేయించుదాం అన్నాడు.
మీ నలుగురికి శుభాకాంక్షలు
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
18-9-03
రఘుగారికి నమస్తే,
World ReceiverRadio గురించి యెవరో తెలిసి తెలియకుండా చెబితే; యీ వూళ్ళో Radio Dealers ని అడిగాను. విఫలయత్నం!
If it is worth having, నాక్కూడా కావాలి. western Music వినను. In- dian Radio stations Indian Music classical and Film- even repetetive.
price doesn't matter. Ifyou think I should have it - కొని మీరు వోచ్చేటప్పుడు తీసుకురండి. ధర తెలియజేస్తే పంపిస్తాను. లేదూ యిక్కడికి వొచ్చినప్పుడు చెక్కు యిస్తాను. But is should not big size must be portable.
శేఖర్రెడ్డి చాలా చురుకైనవాడు. అప్పట్లో CPI అభిమానిగా వుండేవాడు.
యీ వుత్తరం World Receivre Radio గురించి రాస్తున్నాను.
మీ నలుగురికి శుభాకాంక్షలు
-వడ్డెర చండీదాస్.
సాలిళ్ళ తిరుపతి
1-10-03
రఘుగారికి నమస్తే,
సాలిళ్ళు గదుల ప్తెభాగాల్లో బూజు గూళ్ళు పెడతాయి. యీ వూళ్ళో, గడులంతటా ప్తె భాగాల్లోనూ నేలబారునా ప్తె నుంచి కిందిదాకా అన్ని పక్కలా అంతటా బూజు ధారాళంగా అల్లుతాయి.
పాదాలు కదలటం యిండియన్ మ్యూజిక్ కి చిహ్నంకాదు. యిండియన్ మ్యూజిక్ కి శిరసులూగుతాయి.
యీమని శంకరశాస్త్రి యిష్టం. చాలా యిష్టం. చాలా చాలా యిష్టం.
బాలమురళికృష్ణ గత వ్తెభావంతో చేల్లిపోతున్నాడు! యిప్పుడు పాడుతున్న దేమి బావుండటం లేదు.
ప్రతిదానికి పర్యావరణం అనటం ఫ్యాషన్తెపోయింది. అనవసర జంతుప్రేమ. క్రూర జంతువులు లాంటివి అనవసరం. కుక్కల లాంటివి అవసరం. దోమలు యిఇగాలు చీమలు యెలుకలు వంటి వాటివల్ల చాలా యిబ్బంది.
ప్రభుత్వం కొన్ని మంచి పనులుకూడా చేస్తూంటుంది.ప్రభుత్వమే అనుకుంటాను -యీ వూళ్ళో కోతుల బెడద లేకండా చేసింది.
జియాన్ బాల సుబ్రమనియం యేమంత మంచి గాయకుడు కాదు. ఐతే,సామగానలోలె వంటి కొన్ని మంచి కృతులు కూర్చాడు.
యివాళ యం.యల్. వసంతకుమారి, మోహన -రాగం తానం పల్లవి మరో మరో మరోసారిగా విన్నాను. చాలా బాగా పాడుతుంది. గొంతు కూడా చాలా బావుంటుంది. నాకు చాలా యిష్టం.
యస్.వి.కృష్ణారెడ్డి ట్యూన్ చేసిన 'నిలివెన్నెల జాబిలీ' పాట వినండి.
యాభయ్యేళ్ళ తెలుగు సినిమాపాటల్లో, మూడు నాలుగువందలు నచ్చాయి.
గత మూడేళ్ళ పాటలు వినలేకపోతున్నాను, non- melodious, non-mel- lifluous. యేడెనిమిది పాటలు బాగున్నట్లు గమనించాను. భారతీయ శ్రవ్యసంగితాభిరుచి లేదు, యీ శతాబ్దపు తరానికి.
వార్తలకోసం స్టార్ వాళ్ళ NDTV యింగ్లిషు చూస్తున్నాను.
యే రెండు చేతుల రేఖలు, వెలిముద్రలు వకటి కాదు. అది మనకి తెలియదు. నిపుణులు గ్రహించి నిర్ధరించగలరు.
చాలా మందికి ఘటు వాసనలు తప్ప సునిశిత పరిమళాలు తెలియవు. వొకరి వొంటి వాసనా యింకొకరి వొంటి వాసనా వొకటి కాదు. అది అమనకి తెలియదు. కుక్కలకి తెలుస్తుంది. అది ప్రత్యేకం శునకశక్తి. నా వందల పాత్రల్లో వక్క గితాదేవికి అలాంటి పరిమళం వుంది. కాని అది కొందరు గ్రహించలేరు. శివరాం గ్రహించలేదు. కృష్ణచ్తేతన్య గ్రహించాడు. విజయసారధి గ్రహించాడు.
తెలుగు సినిమా పాటల్లో వసంతకాలం ప్రసక్తి, హిందీ సినిమా పాటల్లో వానాకాలం ప్రసక్తి యెక్కువ. మానసిక వ్తెవిధ్యం.
పియానో యిష్టం వుండదు. పియానో పాటలు యిష్టం వుండవు. సంతూర్, సరోద్ యిష్టం వుండవు.
సినిమా దియేటర్ కి వెళ్ళి పాతికేళ్ళవుతూంది. ANR దేవదాస్ TV లో వొచ్చినప్పుడు తప్ప, తెలుగు సినిమా చూసి పాతికేళ్ళవుతుంది. TVలో పాతికేళ్ళలో వొ పది హిందీ సినిమాలు చూసివుంటాను. చూడతగినవి చూడతగానవి చాలా సినిమాలు చాలా భాషల్లో 1980 కి ముందు చూశాను.
శోభానాయుడుగారి నాట్యం యిష్టం. చాలా చాలా యిష్టం. నాట్యకిగా వక వ్యక్తిగా కూడా యిష్టం. నాట్యానికి పూర్తిగా అంకితమ్తెన స్వచ్చమ్తెన కూచిపూడి నర్తకి.
డబ్త్బేయ్యేళ్ళ వయసులో కూడా కిశోరి అమోన్ కర్ పాడటమూ గొంతూ కూడా అధ్బుతం!
మలయాళంలో పదాలు మృదువు; పలకటం యింకా మృదువు. తమిళంలో పదాలు కటువు; పలకటం యింకా కటువు.
గాయకి-నటి సురయ్యకి రావాల్సినంత పేరు రాలేదు.
నవంబరు 6న వస్తూ World Reveiver Radio తేస్తున్నారనుకుంటున్నాను. వెంటనే కొని యీ నెల రోజులు వాడండి. (అసలోద్డంటారా!)
మీ నలుగురికి శుభాకాంక్షలు
-వడ్డెర చండీదాస్.
