Previous Page Next Page 
ప్రేమతో ...వడ్డెర చండీదాస్ పేజి 2

    కాని ఒకసారి పెద్ద సమస్య ఎదురయ్యింది.కొంతమందిలాగా నేను కూడ కొత్తగా ఏదైనా రాయొచ్చుకదా అని సూచించితె,మాట దాటేశారు.ముఖం తిప్పేశారు.అయోమయస్థితిలో ఏదీ తోచక కొంతసేపు తర్వాత అదే విషయాన్ని మళ్ళీ ప్రస్తావించా,గబుక్కున లేచి,టీ తాగుదామా అన్నారు.అప్పుడు తన ముఖాన్ని చూసి నాకు భయమేసింది.టీ తాగి,తప్పు గమనించి,మెల్లగా సెలవు తీసుకొని వచ్చేశాను.ఈసారి ఆగమనలేదు.ఆ తర్వాత మరెప్పుడడు అలాంటి తప్పు చెయ్యలేదు.కొన్ని సందర్భాలలో క్రోత్తవాటి కోసం పాకులాడడంలో,వున్నవాటి నుంచి తప్పించుకోడానికి సాకు వెతకడమేమో అనే భావన నాకు ఈ సందర్భంలో కలిగింది.ఒక వాచకాన్ని మళ్ళి మళ్ళీ చదవాలనే భావం ఈ సందర్భంలోనే యేర్పడింది.
    వెళ్ళినప్పుడల్లా రకరకాలా పప్పు వండేవారు.బలవంతంగా తినమనేవారు.కందిపప్పు,టమోటా పప్పంటే నాకు చాలా యిష్టం.చాలా రుచిగా వుండేది తన వంట.భవానీ నగర్లోని అంతచిన్నరూములో ప్రతి ఒక్క వస్తువు ఒక క్రమపద్ధతిలో వుండేవి.మాటల్లో క్రితంసారి కలిసినప్పుడు ప్రస్తావించిన విషయాలు,గుర్తు పెట్టుకొని ప్రస్తావించే వారు.ఎక్కువగా 'హిమజ్వాల','అనుక్షణికం;''Desirs and Liberation'గురించి మాట్లాడుకునేవాళ్ళం.తన రచనలలోని పాత్రలన్నింటి పైనా అతనికి స్పష్టమయిన,నిర్దిష్టమయిన అభిప్రాయాలున్నాయి.కాని తనకు భిన్నమయిన ఇతరుల అభిప్రాయాలను కూడా అంగికరించేవారు.ఒకసారి నేను 'స్వప్నరాగలీన,శ్రీపతులకన్నా నాకు గాయత్రి,మోహన్ రెడ్డి చాలా ఉన్నతమయిన పరిణతి చెందిన పాత్రలుగా కనిపిస్తారు'అంటే,కారణమడిగారు.అందుకు నేను 'స్వప్న.శ్రీపతిలలో ఆదర్శాలస్థాయి,అభిరుచులలో ఔన్నత్య మున్నా వారిలో అనుభవస్థాయి తక్కువ.అష్టాలు,పరిక్షలను ఎదురుకున్న జీవితాలు కావు వారివి'అన్నాను.కాని గాయత్రి,మోహన్ రెడ్డి,మిఖ్యంగా 'గాయత్రి పాత్ర చాలా అనుభవంతో నిండినది'అన్నాను.ఈ దృక్పధంతో చూస్తే మిరు చెప్పేదే నిజమనిపిస్తుందన్నారు.రచయితగా తనకు తెలుగులో మంచిపేరున్నా దార్శనికుడిగా గుర్తింపు రాలేదు.ఈసందర్భంలో దర్శన శాస్త్రంలోని Journal of Indian Council of Philosophical Research లో నేను తన ఫిలాసఫీ గురించిన వ్యాసం "Mapping Repetetion and Novelty in Creativity"ప్రచురింపబడినప్పుడు చాలా సంతోషపడ్డారు.
    యిలాంటి మార్పులకి,యిందులోని కాలం,గతి యొక్క స్వభావాన్ని చాలా సునిశితంగా గమనించాల్సిన అవసరముంది.ఈ మర్పులలోని ప్రత్యేకతలను గుర్తించడానికి అవకాశంగా వుత్తరాలను వేటిని తొలగించకుండా,అన్నిటిని క్రమ పద్ధతిలో యధాతధంగా ప్రచురించడం జరిగింది.ఎందుకంటే గొప్ప రచయిత తన రచనలలో ప్రస్తావించని ముఖ్యమయిన విషయాలను,సొంత అభిప్రాయాలను,వివిధ క్రమాలలో,స్థాయిలలో,స్థితులలో,నిష్పత్తులో తన ఉత్తరాలలో ప్రస్తావించారు.వీటిలో తరుచూ,తన యిష్టాయిష్టాల గురించి రాసేవారు."Ihave strong likes and dislikes' సాధారణంగా సకారణంగా'అని 14-1-04వుత్తరంలో తానే స్వయంగా రాసుకున్నారు.గాయత్రి గారి వీణ చాలా చాలా యిష్టం తనకు (భుహుశ,ఈ వుత్తరాలలో ఒక్కసారి తప్ప ఆమెని 'గాయత్రిగారు'అనే సంబోధిస్తారు.)అలానే ఈ ఉత్తరాలలో తనకు నచ్చిన  సంగీతకారులు, నటులు, నటీమణులు,  సినిమాలు, రాగాలు,కీర్తనలు,సంగీత,కళలను పొందే ఆనందాన్ని ఎలా వ్యక్తం చెయ్యాలి అనే దానికి కొత్త భాష ఈ వుత్తరాలలో ఉంది.వీటిలో రాజకీయాల గురించి,నాయకులు,నాయకరాళ్ళు గురించి ప్రస్తావన,క్లుప్తంగానయినా,ఉంది.ఇక కాకులు,పావురాలు,బల్లులు,సాలీళ్ళు,టేకు అల్మారాకు గుమ్మం తలుపులకు గల తేడా-లాంటి సూక్ష్మమయిన వివరాలను చండీదాస్ ఎంత నిశితంగా పరిశీలిస్తాడో ప్రకటిస్తాయి.
    వాళ్ళమ్మాయి లాగా నేనూ ఒకవైపు ఏదో ఒకటి చదువుతూ అదే సమయంలో సంగీతం వినడం అతనికి ఆశ్చర్యం కలిగించేది.వాళ్ళమ్మాయన్నా,అల్లుడన్నా అమిత గౌరవం,ప్రేమ,అభిమానం.అల్లుడును గురించి 'Ithink he is a genius'అంటారు.24-7-04వుత్తరంలో,నేను R.A.Sinari(వుత్తరాలలో సినారె)పుస్తకం Reason in Existential-ism పంపితే చదివి కొటేషన్స్ బావున్నాయని చెప్పారు,మా ఆవిడని అపోలోలో చూపించమని సలహా యిచ్చింది.ఆయనే ఆ తర్వాత చలం మైదానం నవలపై నేను రాసిన వ్యాసాలను పంపినప్పుడు తన అభిప్రాయాలను రాసేవారు.
    ఈ వుత్తరాలలోని మరొక అంశం 'Desire and Liberation'(వుత్తరాలలో dalలేక d,iఅని సూచించేవారు)పై కామెంటరీ,దీని గురించి యిక్కడ కొంచెం విపులంగానే ప్రస్తావించాలి.శాంతినికేతన్లోని దర్శనశాస్త్రవేత్త ఆచార్య కాళిదాస్ భట్టాచార్యగారు తిరిపతికి యునివర్సిటీ పనిపై వచ్చినప్పుడు అనుకోకుండా 'Desira and Lideration'రాతప్రతిని చూశారు.అందులోని దార్శనిక దృక్పధానికిక్రొత్తదనానికి ముగ్దుడయి ఆ ప్రతిని,యింకా అధ్యయనం చేయడం కోసం,భట్టాచర్యగారు తన వెంట తీసుకెళ్ళి దానికి సుదిర్ఘమయిన పరిచయ రాసి ఆ పుస్తకం ప్రచురిచేందుకు ప్రోత్సహించారు.అప్పుడు క్లుప్తంగా ఉన్న ఈ రచనను మూడు వందల పేజీలు తగ్గకుండా,ఎక్కువ మందికి అర్దమయ్యేట్లు విపులంగా వివరించమని కోరి చండీదాస్ దగ్గర మాట తీసుకున్నారు.ఆ మాటను  చాలా కాలం వరకు మన్నించ లేక పోయారు.1992-93మధ్య ప్రయత్నించి 'Desire and Lideration in a dialogical form'అని రాసి నాకు పంపారు.తప్పులేమన్నా ఉంటే సరిదిద్దమని.
    ఈ ప్రతిని కూలంకషంగా చదివిన తర్వాత 'ములరచన అర్ధమయ్యే అవకాశం అంతగా కనబడటం లేదు.అలాకాకపోతే రెండు రచనలు పాఠకులకు చేరే అవకాశం లేవు'అని నా అభిప్రాయాన్ని తెలిపాను.పాఠకులకు ఆర్ధమయ్యేట్లు నన్ను తిరగరాయమన్నారు.కొన్ని భాగాలు తిరగరాసి పంపాను.తనకు నచ్చాయి.మిగతా భాగాలు కూడా యిలానే చెయ్యమని అడిగారు.నేను చెయ్యగలనా అనే సందేహం చాలా సందర్భంలో వ్యక్తం చేసినా-లేదు చెయ్యగలరు అని ప్రోత్సహించారు.కొన్ని సంవత్సరాలు దాదాపు యిప్పటికి 14 సంవత్సరాలు తిరగ రాస్తూనే వస్తున్నాను,ఎన్నోసార్లు.అలా భట్టాచార్య గారికి తను యిచ్చిన మాటను తీర్చే భారాన్ని నాపై మోపి రచయితగా తను పక్కకు తప్పుకున్నారు.    మధ్యలో చాలా పబ్లిషర్స్ కి  పంపాను, తిరిగి పంపారు.  late professor john Harris అనే దర్శన శాస్త్రజ్ఞడు  Liberating Desire: convergence of  philosophical  conspiracies  అనే  నా కామెంటరి తయారిలో వుంది. మంచి  పబ్లిషర్ దానిని  ప్రచురించేందుకు అంగీకారం  తెలిపారు. ఈవిషయం నేను  బంధువుల పెళ్ళికోసం ఆగష్టు 2004లో తిరుపతి  వెళ్ళినప్పుడు చెప్పాను. చాలా సంతోషపడ్డారు. ఆరోజు పెళ్ళి నుంచి తిన్నగా చండీదాస్ గారి దగ్గరికెళ్ళను. పాటలు వింటున్నారు. చాలా విషయాలు మాట్లాడుకున్నాము. 'నడుంనొప్పి తగ్గింది. జ్వరంకూడా యిప్పడంత చికాకు కలిగించడంలేద'న్నారు. మళ్ళా సంభాషణలలో 'అనుక్షణికం' గురించి ప్రస్తావన. ఈ సందర్భంలో నేను స్వప్నరాగలిన, sexless లేక sexually impotent అని చాలా ఆధారాలు చూపెడుతూ మాట్లాడాను. చాలా సీరియస్ గా  అయిపోయారు. చాలా సేపు ఏమి  మాట్లాడలేదు. మంచంప్తె  అటుప్రక్కకి  పోర్లారు. దాదాపు అర్ధగంట తర్వాత మళ్ళి యిటు ప్రక్కకి తిరిగి  చాలా గంభీరంగా 'మీరు  చెప్పింది చాలా బావుంది. ఆశ్చర్యం కలిగించింది. రచయిత పాఠకుల  నుంచి యింతకన్నా కోరేది ఏమిలేదు' అని చెమర్చిన కళ్ళతో అన్నారు. టి  పెట్టారు. తాగి ర్తెలుకు టైమ్  అవుతుందని చెప్పి బయలుదేరుతుంటే ఇంకొకరోజు వుండడం విలుకాదా అన్నారు. ఈ సారోచ్చినప్పుడు కలుస్తాను అని బయలుదేరుతూ ఉంటే - యిక తనను చూడడం అదే ఆఖరుసారి అని నాకు అప్పడనిపించలేదు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS