Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 2

 

    
    "వెరీ గుడ్ !" మెచ్చుకున్నాడతను. "తూర్పు దిశ యింటికీ ఉంటె అదీ ఎడ్వంటేజ్!" ఆమెతో అన్నాడతను.
    ఇప్పుడు కొట్టాలి దెబ్బ.
    "కానీ మా గది కిటికీ తూర్పున లేదండీ! పశ్చిమంలో వుంది" అతను ఫజిలయి ఆమె వేపు చూశాడు.
    "పశ్చిమం వేపునా?"
    "అవన్సార్!"
    "అంటే మరి ఉదయం సూర్య కిరణం ఎలా పడుతుంది నీమీద?"
    "పడదండి! సంధ్యాకిరణం పడుతుంది. అంటే సాయింత్రపు నీరెండ."
    "మైగాడ్! అంతవరకూ పడుకుంటావా?"
    "ఉద్యోగం దొరక్కపోతే ఇంకేం చేయమంటారు మరి?"
    ఇద్దరి ముఖాలు వాదిపోయినాయ్ చావుదెబ్బ తిన్నందుకు .
    "ఓ.కే! ఇంగ్లీష్ చానెల్ అంటే ఏమిటో తెలుసా?"
    "తెలుసండీ! స్టార్ టి.వి. లో ఇంగ్లీష్ పిక్చర్స్ చూపించే చానెల్."
    "నో నో నో " అందామె కన్ ఫ్యూజవుతూ .
    "అవును మేడమ్! మా ఫ్రెండ్సెందరూ అలాగే అంటారు . శ్త్రీవల్లీ కూడా ........"
    రెండు దెబ్బలు - ఆమె ముఖంలో రంగులు మారుతున్నాయ్.
    "మీరు బుక్స్ చదువుతారా?"
    "లేదు మేడమ్! మనుష్యుల్నే బుక్స్ లాగా చదవటం నా హాబీ! ముఖ్యంగా అమ్మాయిలను లేకపోతే ఇంకో అలవాటేమిటంటే నాకు నైట్ రీడింగ్ ఇష్టం."
    ఆమె ఫినిషయిపోయినట్లే .
    డిఫెన్సివ్ గా మరొక్క డైలాగ్ "నేనడిగిందానికి సంబంధం లేని జవాబులు చెప్తున్నారు."
    గొంతులో కోపం -
    ఈసారి అతను అడిగాడు.
    "అన్యోన్య దంపతులంటే ఎవరు?"
    "ఒక భర్త -- అతని పక్కన పరాయి భార్య "
    ఆమె నవ్వాపుకోలేక పోయింది.
    అతని ముఖం మాత్రం వాడిపోయింది.
    "యూకెన్ గో"
    తరువాతి కాండిడేట్ కోసం బెల్ కొట్టాడు.
    వెనక్కు తిరుగుతుంటే అంది.
    మీరిచ్చిన అన్సార్ కి ఉద్యోగం దొరుకుతుందనే అనుకుంటున్నారా?"
    "మీరిచ్చే వర్జిన్ జీతాలకు దొరుకుతుందనే అనుకుంటున్నాను మేడమ్! బైదిబై మీరెప్పుడయినా మాణింగ్ సెవేనో క్లాక్ కి ఆ చౌరస్తా లో కెళ్ళారా? అక్కడ పొద్దున్నే పనికోసం లేబర్ నిలబడి ఉంటారు ముందు వాళ్ళ కూలి ఎంతో ఒకసారి అడిగి చూడండి! ఆ తర్వాత ఇప్పుడు మీ హాస్పిటల్లో ఉద్యోగాలకు మీరివ్వాలనుకుంటున్న జీతం దాంతో కంపేర్ చేసి చూడండి!" అడిషరెన్స్ చూస్తె గుండె బాదుకుని మీరే ఫస్ట్ పేషెంట్ గా ఈ హాస్పిటల్లో చేర్తారు..."
    బయటకు నడుస్తుంటే రాధిక లోపలికొస్తూ ఎదురయింది.
    "ఓ! ఇక్కడ కూడా వచ్చారన్నమాట ! బెస్టాఫ్ లక్!"
    ఆమె కళ్ళల్లో భయం -- టెర్రరిస్ట్ ని చూసినట్లు -
    తనతో మాట్లాడితే ఆమె ఉద్యోగం చాన్స్ పోతుందేమోనని అనుమానం --
    బయట చెట్టు కింద నిలబడి పదినిమిషాలు వెయిట్ చేశాక వచ్చింది.
    "ఎలా జరిగింది ఇంటర్ వ్యూ?"
    "అతను తేలిక కొశ్చన్సే వేశాడు గానీ ఆమె కావాలని అడ్డదిడ్డంగా మాట్లాడుతోంది."
    "మీకు తెలుసో తెలీదో , ఈ మధ్యన నేను జరిపిన సర్వేలో అదే విషయం బయట పడింది. స్త్రీలను ద్వేషించే ప్రతి అయిదుగురులోనూ నలుగురు స్త్రీలే!"
    రాధిక నవ్వింది .
    "మీరిలాంటి సర్వేలు కూడా చేస్తుంటారన్నమాట!"
    "ఇంకేం చేస్తాం. పనీ పాటా లేనప్పుడు -- అన్నట్లు మీకు అప్పటి నుంచీ ఉద్యోగం దొరకనేలేదా?"
    "దొరుకుతే ఇలా ఇంటర్ వ్యూలకు తిరగడం ఎందుకు? నాకు చాలా నిరాశగా వుంటుంది! అసలేప్పటికయినా ఉద్యోగం దొరుకుతుందా నేను పైకోస్తానా అని!"
    "భలే వారే! చాలామంది సక్సెస్ ఫుల్ సినిమా స్టార్ట్ "టాప్ " కి ఎలా వెళ్ళారనుకుంటున్నారు!"
    "ఎలా వెళ్ళారు?"
    "వాళ్ళూ టాప్ కెల్తూ , వాళ్ళ బట్టలు కిందే ఉంచేయటం వల్ల-"
    ఆమె ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది.
    "ఛీ! మీ మాటలన్నీ ఇంతే!" ఇక్కడివారి కోసం వెయిట్ చేస్తున్నారు?"
    "మీ కోసమే! మీలాంటి మంచి అమ్మాయికి హలో చెప్పి , మంచీ చెడూ తెలుసుకుందామని...."
    "నేను మంచి అమ్మాయినని మీకెలా తెలుసు?" పొంగిపోవటం కనిపించకుండా అడుగుతోంది.
    "మిమ్మల్ని చూడగానే ఎవరికయినా తెలిసిపోతుంది మీరెంత మంచివారో --"
    "ఎలా తెలుస్తుంది ?" కుతూహలం!
    "అదే నారో వెస్ట్ - బ్రాడ్ మైండ్! ఈ రెండూ మంచి అమ్మాయికి కొండ గుర్తులు."
    ఆమె నవ్వాపుకోలేకపోయింది.
    "ఇలా ఓవర్ గా ఉండటం వల్లే మీకు ఉద్యోగం దొరకటం లేదు."
    "పోనీ ఇంత డల్ గా ఉన్నందుకు మీకు ఉద్యోగం వచ్చిందా?"
    "ఎప్పటికయినా వస్తే నాకే వస్తుంది గానీ మీకు మాత్రం రాదు --- మీ ధోరణి మార్చుకోకపోతే!"
    "పోనీ మీకోచ్చినా చాల్లెండి! మీరు నిరుద్యోగుల కిచ్చే డోనేషన్స్ తో గడిపేస్తాను ---"
    ఆమె నవ్వేసింది.
    "ఓకే! వెళ్తున్నా!"
    "అదేంటండీ!  ఇంతసేపు నిలబెట్టి కాఫీ నీళ్ళయినా తాగించకుండా పంపించేస్తారా?"
    "నేను కాఫీ తాగను--"
    "నేను తాగుతానండీ! ఫర్లేదు ---- మీరు కంపనీ ఇవ్వలేదనీ కూడా నేనేం అనుకోను -"
    "సారీ! పరాయి మగాళ్ళతో హోటళ్ళకు వెళ్ళటం నాకిష్టం లేదు -" వెళ్ళిపోతోంది.
    "ఏమండోయ్ - వన్ మినిట్ ! రాధికగారూ కాఫీ వద్దులెండి! ఒక్క మాట--------"
    వెనక్కు తిరగకపోయినా నవ్వుకుంటూ నమస్తోందని 'సైడ్ వ్యూ' ద్వారా తెలుస్తోంది.
    బస్ స్టాప్ మాములుగానే రద్దీగా వుంది.
    కళ్ళజోడు ప్రౌడ. ఆమె పక్కన కాలేజ్ ఏజ్ గాళ్. వాళ్ళ పక్క దిక్కులు చూస్తోన్న జస్ట్ మారీడ్ కేస్-
    బస్ వచ్చేలోగా కొంచెం టైమ్ పాస్ అవసరం.
    "హలో! గుడ్ మాణింగ్" తనూహించినట్టే , ఆశ్చర్యం--
    కూలింగ్ గ్లాసెస్ ప్రౌడ తనను కాదనుకుని ఓసారి వెనక్కు తిరిగి చూసింది.  


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS