Previous Page Next Page 
అతడు భార్య ప్రియుడు పేజి 19

   
    అతని  కళ్ళు మెరిశాయి.

     చేతుల్లోకి క్రొత్తబలం చిక్కినట్లయింది.అడుగులో అడుగు వేస్తూ ఆ గొలుసు తీసుకుని టైగర్ దగ్గరికి నడిచాడు.

     యజమానిని చూసి విశ్వాసంతో తోకాడించింది టైగర్.

    ఆనందం పొంగి పొర్లింది.

     అస్థిమితంగా కదిలిపోతోంది.

     ఆ క్షణంలో పిడికిలి బిగించిన చేయి విసురుగా గాలిలోకి లేచింది.

    గొలుసు టైగర్ని తాకింది.

     జూబ్లీ హిల్స్ ప్రతిధ్వనించించిన చేయి విసురుగా అరిచింది టైగర్.ఛెళ్ ఛెళ్మని కొడుతున్నాడు.

     ఎందుకు కొడుతున్నదీ అర్థంకాని అయోమయావస్థ. శరీరంపైన పడుతున్న గొలుసు దెబ్బలకి తట్టుకోలేక హృదయ విదారకంగా  ఆర్తనాదం చేస్తోంది నోరులేని జీవం.

    శరీరం చీరుకుపోయింది.

     అయినా జి.కె. ఆపటంలేదు. పనివాళ్ళు పరుగెత్తి జచ్చి నిర్ఘాతపోయారు.

     నుదుటనుంచి కళ్ళపైకి జారిన  చెమట జి.కె. కళ్ళని భగ్గున మండించింది.

     యజమాని విత ప్రవర్తన అర్థంకాక ప్రక్కకి పడిపోయింది టైగర్.

     విశ్వాసానికి మారుపేరు కాకపోతే తిరిగి  చీల్చిపారేసేది జి.కె. ని టైగర్. తోటమాలి, పనిమనిషి కళ్ళు తుడుచుకున్నారు.

     జి.కె. ఆవేశం చల్లారిందనడానికి నిదర్శనంగా  అతని చేతిలోంచి గొలుసు జారిపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

     మల్లన్న పరుగున వెళ్ళి టైగర్ని అక్కున చేర్చుకున్నాడు.

           *           *             *         

:    "కాఫీ  తీసుకోండమ్మా!""

     మెల్లగా తలెత్తిం దెన్యంగా చూసింది  నాగమణి.

     మల్లన్న  కాఫీ కప్పుని అందించాడు.

     ఏడ్చి ఏడ్చి ముఖం ఉబ్బిపోయిం వుంది.

     "అమ్మా ఆయనగారంతే! ఎప్పుడేంచేస్తారో తెలీదు"

    చురుగ్గా చూసిందతని కళ్ళలోకి నాగమణి.

      " నా బిడ్డలాంటిదానివమ్మా! మీ పరిస్థితి చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. ఆఖరికి రాత్రి టైగర్ని చితక్కొట్టివేశారమ్మా! నోరు లేనిజీవం. అదేం చేసిందట."

     నాగమణి మట్లాడలేదు. మెల్లగా కాఫీ త్రాగింది.

     ఆలిగితే ఓదార్చే వాళ్ళు లేరు.

     తనకి  తనే ఓదార్పు చెప్పుకోవాలి. తప్పితే పనివాళ్ళు.

     ఇంట్లో పనివాళ్ళందిరికీ తనంటే ఇష్టమే!

    నాగమణి తెల్లవార్లూ ఆలోచించింది.

    ఇక ఈ పద్దతికి స్వస్తి చెప్పాలి.

     ఎదురు తిరిరగితేనే తనకి మోక్షం లేకపోతే ప్రతి రెండు  రోజులు అతను పెట్టే హంస భరించటం ఇక తనవల్ల కాదు.

    తనిక లక్ష్యం చేయదు.

     తనిష్టం వచ్చినట్లు తనుంటుంది. దీంతో  జి.కె. రెచ్చిపోతాడని తెలుసు.

    ఇంట్లోంచి గెంటుతాడా?ఏడిశాడు. బయటి ప్రపంచంలో పురువు కావాలి మళ్ళీ.

    " పెద్దమ్మగార్ని కూడా ఇలాగే కష్టాలు పెట్టేవారమ్మా!"

     మౌనంగా విన్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS