భారత యుద్ధంలో బర్బరీకుడు
Barbarika in Kurukshetra
బర్బరీకుడు ఘటోత్కచుని కుమారుడు. ఇతని తల్లి మౌర్వి. మరొక కథనం ప్రకారం తండ్రి ఘటోత్కచుడే కానీ, తల్లి ఆహితవతి. ఆమె నాగకన్య. బర్బరీకుని తల్లి ఎవరనే విషయంలో భిన్న కథనాలున్నా, బర్బరీకుని గురించి మిగిలిన కథంతా ఒకటే విధంగా ఉంది. బర్బరీకుని బాల్యమంతా తల్లి వద్దే గడిచింది. ఆమె వద్దే శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్నాడు.
మహాభారత యుద్ధం జరగబోతున్నదని తెలుసుకుని, ఆ యుద్ధంలో ఓడిపోయేవారి తరపున పోరాడతానని తల్లి వద్ద ప్రతిన చేసి కేవలం మూడు బాణాలతో యుద్ధ భూమికి వస్తాడు బర్బరీకుడు. అప్పటికతడు పిల్లవాడే. అయితేనేం మహా యోధుడు. కేవలం మూడు బాణాలతో యుద్ధ ఫలితాన్ని మార్చేయగలనన్న నమ్మకం, శక్తి బర్బరీకునిది. అతని ప్రతిజ్ఞ తెలిసిన శ్రీకృష్ణుడు బర్బరీకుడిని పరీక్షించాలనుకుని బ్రాహ్మణుడి వేషంలో అతని వద్దకు వెళ్ళి ‘నీ శక్తి చూపించు’ అని కోరాడు.
బర్బరీకుడు ఒక బాణం తీసుకుని సుదూరంలో ఉన్న వృక్షానికి బాణాన్ని సంధించాడు.
ఆ ఒక్క బాణం వృక్షానికి ఉన్న ఆకులన్నింటికీ రంద్రాలు చేయడమే కాక, శ్రీకృష్ణుడి కాలికింద ఆకు ఉన్నదని గ్రహించిన ఆ అస్త్రం కృష్ణుడి కాలికి గాయం చేసి మరీ ఆ ఆకుకూ రంధ్రం చేసింది.
బర్బరీకుని శక్తి గ్రహించిన శ్రీ కృష్ణుడు, తనకు మరో సాయం చేయాలని కోరాడు.
ఆ సాయానికి బర్బరీకుడు అంగీకరించిన తర్వాత, ‘మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు ఒక మహాయోధుని బలి ఇవ్వవలసి ఉందని, ఆ బలికి నీ శిరస్సు కావాల’ని కోరతాడు. అయితే తనకు మహాభారర యుద్ధం చూడాలని ఉందని, తనను బలి ఇచ్చినా శిరస్సుకు మాత్రం యుద్ధాన్ని చూసే శక్తిని ప్రసాదించాలని బర్బరీకుడు కోరాడు.
అలా మహాభారత యుద్ధానికి ముందు బలి అయిపోయాడు బర్బరీకుడు.
Barbarika son of Ghatotkacha, Barbarika in Kurukshetra war, Barbarika son of Mouri, Barbarika and 3 arrows, Barbarika challenged in kurukshetra, Barbarika in hindu epics, Barbarika in Mahabharat