విష్ణువు ధరించే ఈ ఆయుధాల గురించి తెలుసా!

 విష్ణువు హిందూ మతంలో త్రిమూర్తులలో ఒకరు. విష్ణువు ను కొలిచే వారిని వైష్ణవులు అని అంటూ ఉంటారు. ఒక్కో దేవతకు ఒక్కో విధమైన ఆయుధాల ఉంటాయి.  ఈ ఆయుధాలలో ఆయా దేవతల శక్తులు నిక్షిప్తం అయి ఉంటాయి.  విష్ణువు ధరించే 5 ఆయుధాల గురించి తెలుసుకుంటే..

వైష్ణవాస్త్రం..

వైష్ణవాస్ర్తం చాలా శక్తి వంతమైన ఆయుధం. దీన్ని స్వయంగా విష్ణువు సృష్టించాడని చెబుతారు. దీనికి నారాయణాస్త్రంతో సమానంగా శక్తి ఉంటుందని చెబుతారు.  ఈ అస్త్రాన్ని కేవలం విష్ణువు మాత్రమే నియంత్రించగలడట.  ఇది చాలా వేగంగా కదిలే ఆయుధం.  దీనిని చాలా విధ్వంసకరమైన ఆయుధం అని చెబుతారు. ఇది విష్ణువు దివ్య బాణం.  దుష్టశక్తులను నాశనం చేయడానికి దీనిని విష్ణువు ఉపయోగిస్తాడని చెబుతారు.

నారాయణాస్త్రం..

నారాయణాస్త్రం అనేది విష్ణువు సత్య యుగంలో సృష్టించిన విధ్వంసకర ఆయుధం. ఈ నారాయణాస్త్రం విశిష్టత ఏమిటంటే.. ఈ అస్త్రం విడుదలైన వెంటనే వేలాది అగ్నిబాణాలు  ఉత్పత్తి అవుతాయి.  ఇవి శత్రువు పూర్తిగా నాశనం అవ్వడం లేదా శత్రువు లొంగిపోయే వరకు ఈ బాణాలు వస్తూనే ఉంటాయి.

సుదర్శన చక్రం..

సుదర్శన చక్రం అనేది విష్ణువు ధరించే అత్యంత శక్తివంతమైన ఆయుధం.  పైగా ఇది దోషరహితమైనది కూడా. దీనిని విష్ణువు కుడిచేతి చూపుడు వైలుపై ధరించి ఉంటాడు. ఈ సుదర్శన చక్రం మెరుపు వేగంతో తిరుగుతూ ఉంటుంది.  లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏదైనా అడ్డంకి ఉంటే ఆ అడ్డంకిని ఇది చేదిస్తుంది. చెడును నాశనం చేయడానికి శ్రీకృష్ణుడు కూడా సుదర్శన చక్రం ఉపయోగించాడు.

శారంగ విల్లు..

శారంగ విల్లును విష్ణువు మాత్రమే కాకుండా విష్ణువు అవతారాలు అయిన శ్రీరాముడు,  పరశురాముడు,  శ్రీకృష్ణుడు కూడా ధరించారు.  ఉపయోగించారు.  ఈ శారంగ విల్లును విశ్వకర్మ సృష్టించాడు. ఇది చాలా దివ్యమైనది. ఈ విల్లు నుండి విడుదల అయ్యే బాణాలు ఏ లక్ష్యాన్ని అయినా చేదించగలవు.

కౌమోదకీ గదం..

ద్వాపర యుగంలో విష్ణుమూర్తి అవతారం అయిన శ్రీకృష్ణుడు వరుణదేవుడి నుండి కౌమోదకీ గదను అందుకున్నాడు.  విష్ణువు ఈ ఆయుధాన్ని తన ఎడమ చేతిలో ధరిస్తాడు.   విష్ణువు దివ్య గద ఇది.  ఇది జ్ఞానం,  శ్రేయస్సుకు చిహ్నం గా పరిగణించబడుతుంది.  దీన్ని ప్రయోగిస్తే జరిగే దాడి చాలా వినాశకానికి దారి తీస్తుంది. శత్రువును,  దుష్ణశక్తిని తక్షణమే నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.


                                      *రూపశ్రీ.


More Purana Patralu - Mythological Stories