శిఖండి ఎవరో తెలుసా?

Shikhandi in Mahabharata

 

ఎవరైనా పంతాలూ పట్టింపులకు పొతే.. అనుకున్నది సాధించేవరకూ నిద్రపోనీ లక్షణాలు కనిపిస్తే ''శిఖండి'' అని గొణుక్కోవడం మామూలే. ఇంతకీ శిఖండి అంటే ఎవరరో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 

ద్రుపదరాజు కుమార్తె శిఖండి. పూర్వ జన్మలో శిఖండి పేరు అంబ. ఈమె గతజన్మలో సాల్వుడనే రాజును ప్రేమిస్తుంది. అయితే భీష్ముడు స్వయంవరానికి హాజరైన ఇతర రాజులను ఓడించి, అంబ, ఆమె చెల్లెళ్ళు అంబిక, అంబాలికలను తన సోదరులకిచ్చి వివాహం చేయాలనే ఆలోచనతో తనతో తీసుకువస్తాడు.

 

కానీ, అంబ సాల్వుడనే రాజును ప్రేమిస్తున్నదని తెలిసి, ఆమెను సాల్వుడి వద్దకే పంపగా, సాల్వుడు ఆమెను తిరస్కరిస్తాడు. భీష్ముడి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి, తనను వివాహం చేసుకోమని కోరుతుంది.

 

తను ప్రతిజ్ఞ చేసినందున, ఎవరినీ వివాహం చేసుకోమని చెబుతాడు. ఇలా భీష్ముని కారణంగా వివాహం కాకుండా పోయిన అంబ చివరికి శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి, తన చేతిలోనే భీష్ముని మరణం సంభవించాలని కోరుకుంటుంది.

 

అలా కోరుకున్న అంబే ఇప్పుడు శిఖండిగా జన్మించింది. ఈమెను కుమారుడిగానే పెంచిన ద్రుపదరాజు, యుక్తవయసులో వివాహం చేస్తాడు, తర్వాత శిఖండి పురుషుడు కాదని తెలిసిన అతని భార్య తిరిగి పుట్టింటికి వెళ్ళిపోగా, శిఖండి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు.

 

అప్పుడొక యుక్షుడు ప్రత్యక్షమై, ఆత్మహత్యయత్నాన్ని నివారించి అతడికి పురుషత్వాన్ని ప్రసాదిస్తాడు. మహాభారత యుద్ధ సమయంలో భీష్ముడిని జయించడానికి శిఖండిని అడ్డుపెట్టుకుంటాడు అర్జనుడు.

 

శిఖండిని చూసిన భీష్ముడు అస్త్రసన్యాసం చేసిన తర్వాత ఆయనను తీవ్రంగా గాయపరుస్తాడు. అలా గాయపడిన భీష్ముడు తర్వాత మరణిస్తాడు.

 

ఆ విధంగా శిఖండి కారణంగానే భీష్ముని మరణం సంభవిస్తుంది.

 

Shikhandi Character, Drupada's daughter Shikhandi, Shikhandi and Salva, Shikhandi and Bheeshma, Shikhandi and Mahabharat hindu Epic, Shikhandi's challenge


More Purana Patralu - Mythological Stories