|
sree | sri | devi | sridevi | vaishya | mahanubhavaa | dhana | pithru | pathi | mithrudaa | vaishyudu | prema | bhumanam | ayya | vyam | rajadhani | surathudu
|
' సురథుడు' |
బహుపురాతన కాలంలో , స్వారోచిషమన్వంతర సమయంలోచైత్రవంశంలో అవతరించిన 'సురథుడు' అనే ఉత్తమ క్షత్రియుడు
భూమండలాన్నంతటినీ చక్రవర్తిగా పాలిస్తూ౦డేవాడు.ప్రజల్ని కన్నా సంతానం కన్నమిన్నగా పాలించే ఆ ప్రభువునకు కోలావిధ్వంసి రాజుతో వైరం ఏర్పడింది .మహాపరాక్రమ సంపన్నుడైన సురథుడిపై ఆ శత్రువులు దండెత్తారు . వారు అల్పసత్త్యులె అయినా సురథుణ్ణి ఓడించి వేసారు . ఓడిపోయిన సురథ భుపాలుడు స్వదేశానికి వచ్చి రాజధానిలో నివసిస్తున్నాడు .అయినా దురాత్ములైన శత్రువులు అతణ్ణి విడిచిపెట్టలేదు . బలమదగర్వంతో వారు విజ్రుంభించారు.వారికి తోడు విశ్వాసశూన్యులైన సురథుని మంత్రులంతా విపత్సమయంలోఉన్న తమ ప్రభువును విడనాడి , శత్రువులతో చేతులు |
|
కలపి ధనాగారాన్ని దోచుకుని ,సైన్యాన్న౦తటిని స్వాధీనం చేసుకున్నారు.దానితో రాజ్య భ్రష్టుడైన సురథుడు వేటాడే నెపంతో ఏకాకియై అశ్వారూడుడై ఓ ఘోరారణ్యంలోకీ వెళ్ళిపోయాడు . ఆ కీకారణ్యంలో అతనికి మేధామునిశ్వరుని ఆశ్రమం కనిపించింది .అక్కడి వాతావరణం అతి ప్రశా౦తంగానూ అత్యంత నిర్మలంగాను వుంది .క్రూర భయంకర మృగాలు సైతం పరస్పర శత్రుభావాన్ని విడిచిపెట్టి ,స్నేహభావంతో సంచరిస్తున్నాయి .శిష్య సమూహంతో ఆశ్రమం కళకళ లాడుతుంది.తన ఆశ్రమానికి వచ్చిన సురథుని ఆ మహర్షి అతిధి సత్కారాలు చేసాడు .ఆ క్షణం నుండి సురథుడు ఆ ఆశ్రమంలోనే ఉంటూ ,ఆ ప్రా౦తంలోనే తిరుగుతూ రోజులు గడుపుతున్నాడు . అప్పుడు కూడా మామతాపాశం అతణ్ణి ఆకర్షించటంతో అతడు ''నా రాజధానీ నగరాన్ని నా పూర్వీకులు తమ యవచ్చక్తిని అర్పించి రక్షించారు .అట్టి దానిని నేను విడనాడి పారిపోయి ఇలా వచ్చిన్నాను .దుర్మార్గులు స్వార్ధ పరాయుణులూ య్యైన నా అనుచరులు సహచరులు లందరూ నా రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తున్నారో లేదో? నాకత్యంత ప్రేమ పాత్రమైన ''శూర'' అనే మదపుటేనుగు శత్రుహస్తాలలో పడి ఎలాంటి బాధలు పడుతున్నదో? నేను బహుకరించిన సత్కారాలతో భోజనవస్త్రాదులతో నా సేవకులు సంతుస్టా౦తరంగులై నన్ను సేవిస్తూ౦డేవారు .వాళ్ళంతా ఇప్పుడాశత్రురాజుల సేవలో అప్రమత్తులై తన్మయులైవుంటారుకదా! నా అమాత్యులూ ఇతరేతరాధికారులూ ,అపరిమిత వ్యయం చేసి కష్టపడి నేను కూడబెట్టిన కోశాగారాన్ని ఖాళీ చేస్తూ౦టారు ''అని పరిపరివిధాలుగా చింతిస్తూ అక్కడ తిరుగుతున్నాడు.ఓ నాడు అలా తిరుగుతూన్న సురథునికి ఆ ప్రాంతంలోఓ వైశ్యుడు తిరుగుతుండడంకనిపించింది..అతడా వైశ్యుని ఉద్దేశి౦చి ''ఆర్యా !మీరెవరు ? ఇలా ఎందుకు వచ్చారు ?మిమల్ని చూస్తుంటే ఎందుకో తీవ్రంగా బాధపడుతూన్నారనిపిస్తుంది .కారణం చెబుతారా?''అని స్నేహభావంతో ప్రేమగా ప్రశ్నించగా, ఆ వైశ్యుడు సమాధానమిస్తున్నాడు:-'' ఆర్యా !''సమాధి నా పేరు .వైశ్య కులంలో జన్మి౦చాను . నా దురదృష్టం వల్ల మహా లోభవశులైన నా దారాపుత్రులు ఇంటినుండి నన్ను తరిమేసి , నా సర్వస్వాన్ని హరించివేశారు .ఈ అడవుల పాలై ఇడుములు పడుతున్నాను .ఇక్కడ నివసించే నాకు నావరి కుశల సమాచారాలేమి తెలియవుగదా! నా బిడ్డలు కుశలంగా ఉన్నారో లేదో ? ఏం బాధలు పడుతున్నారో ? అనే విచారంతో కుమిలిపోతున్నాను '' అని అన్నాడు .
ఆ సమాధి మాటలకు సురథుడు ఆశ్చర్యపోతూ ''మిత్రుడా !పరమ లోభంతో నీ సర్వస్వాన్ని అపహరించి నిన్ను ఇంటి నుండి తరిమివేసిన నీ భార్య బిడ్డలాపై నువ్వుఇంత మమకారాన్ని ఎలా చూపెట్టుగలుగుతున్నావు ?'' అని ప్రశ్నించగా .''అయ్యా !మీరు చెప్పింది నిజమే .కాని నా వాళ్ళు నన్ను తరిమివేసినా వారి పై నాకూ గల మమకారాన్ని విడిచిపెట్టి కఠినంగా ఉండలేకపోతున్నాను .ధనలోభపిడితులై పితృభక్తినీ, పతిభక్తినీ ,స్వజనానురక్తిని త్యజించినా-నా భార్య బిడ్డలపై నా మనస్సు ప్రేమనే వర్షిస్తుంది .మహానుభావా !లోభులు సద్గుణదూరులైన బంధు బాంధవుల వైపు నా మనస్సు ఎందుకు ఆకర్షింపబడుతున్నదోనాకు అర్ధ౦ కావడంలేదు .వారి కోసమే నేను బ్రతుకుతున్నాను .నా హృదయం మమతాశూన్యం కావడంలేదు .ఎమి చేయుదును ?'' అని మౌనం వహించాడు . |
ఇంకా ఉంది..... |
|
|
|
|