తత్సమయంలో నారాయణుని కర్ణముల నుండి ''మధుకైటభు ''లనే ఘోర రాక్షసులు అవిర్భవి౦చి, శ్రీ హరి నాభికమలంలో సుఖాసినుడై యున్న బ్రహ్మదేవునిపై దండెత్తారు .అందుకు బ్రహ్మ భయంతో కంపి౦చిపోతూ శ్రీహరి నేత్రాలను ఆవహించి యున్న యోగ మాయను స్తుతిస్తూ :-
''హే జగత్సృష్టిస్థితిసంహరకారిణి !మాతా !స్వాహ, స్వధా ,వషట్కార స్వరూపిణి !జననీ!ఉదా త్తానుదాత్త స్వరస్వరూపిణి!నిత్యరూపా!వర్ణమాలాతర్గత మాతృస్వరూపుణి !హ్రస్వదీర్ఘప్లుత స్వరూపిణివీ, సంధ్యాగాయత్రి స్వరూపిణివీయైన జగన్మాతవు.
అమ్మా!యవద్విశాన్ని సృష్టించి పాలించి చివరకు లయం చేసే లయకారిణివీ కూడా నువ్వే .సృష్టి వేళ్ళలో సృజిమ్పబడే స్వరూపిణివీ నువ్వే. సృజనక్రియా స్వరూపిణివీ నువ్వే .లయ సమయంలో స౦హారణ,సంహార్య స్వరూపాలు నీవే .జననీ !మహా విద్యవూ ,మహామాయావూ,మహా మేథావూ ,మహా స్మృతివీ, మహా మోహినీ రూపిణివీ,మహా దైవీశక్తివీ నువ్వే .మహా ఆసురీ శక్తివీ,త్రిగుణాత్మక మూలప్రకృతివీ, ప్రళయ రూప కళ రాత్రివీ, అఖిలైశ్వర్యశాలినివీ,ఈశ్వరివీ, హ్రీంకారరూపిణివీ, బుద్ధిరూపిణివీ, నువ్వే .లజ్జ ,పుష్టి , తుష్టి ,శాంతి క్షమారూపాలను ధారణ చేసేది నువ్వే .ఖడ్గ , శూల , గదా , శంఖ, చక్ర, ధనుర్భాణ భిశుండిపరిఘాది ఆయుధాలను నువ్వు ధరిస్తావు. సౌమ్య , సౌమ్యేతర స్వరూపిణివీ నువ్వే. రాశీ భూత నిఖిల సౌ౦దర్యమూర్తి కన్ననీ రూపం సుందరమైనది.
అనంతకోటి బ్రహ్మ౦డాత్మకమైన సృష్టిలో సదసద్రుప పద్దార్ధశక్తివీ నువ్వే .అట్టి నిన్ను ,అమ్మా !నేనేల స్తుతి౦చగలను?ఈ విశ్వసృష్టి,స్థితి సంహార కారకులైన త్రిమూర్తులే భవదీయ యోగ నిద్రలో మునిగిపోతూ౦టారు నీ అనంత మహిమల నెవరు స్తుతించగలరు? హరిహరాదులూ , నేను నీ వల్లనే అవతరించాము .నిన్నూ ,నీ అనంత శక్తినీ కీర్తించే సామర్ధ్యం ఎవరికి ఉంది ?జగజ్జనని !మహా మాయా స్వరూపిణి !విశ్వజననీ మహిమాన్వితమైన యోగ శక్తితో దురాత్ములై, దుర్దుర్షులై విజ్రుంభిస్తున్న ఈ మధుకైటభ రాక్షసులను మోహపరవశులను చెయ్యి.తద్వారా శ్రీహరి యోగ నిద్రనుండి లేచి ఈ రాక్షసులను సంహరించేటట్లు ప్రేరేపించు మాతా'' అని ప్రార్ధించాడు. |