Bhakti Home
monday tuesday wednesday thursday friday saturday sunday
Home News Cinema TV Radio Comedy Romance Shopping Bhakti VOD Classifieds NRIcorner KidsOne Greetings Charity More
  User Login |  Sign Up  | Feedback |  Contact 
 
Untitled Document
Untitled Document
:: Home :: Bhakti
Kadha Prarambham
Kadha Prarambham
Kadha Prarambham
sree | sri | devi | sridevi | vaishya | mahanubhavaa | dhana | pithru | pathi | mithrudaa | vaishyudu | prema | bhumanam | ayya | vyam | rajadhani | surathudu
మేథారిషి సమాధానం ఇచ్చుట
అలా సమాధి సురథుల మధ్య కొంతసేపు సంభాషణ జరిగింది. తరువాత వారిద్దరూ మేథా ఋషి౦ద్రుని చేరి ఆ మహాత్మునికి సాష్టాంగ నమస్కారాలు చేసి అనేకమైన ప్రశ్నలు వెయ్యసాగారు.
''మహాత్మా !వశం తప్పిన మా చిత్తాలు మాకు విశేషం బాధ కలిగిస్తూన్నాయి . మూఢ చితులైన వారు విషయ వాసనలలో చిక్కుకుని మోహపాశబద్దులైనట్లే, విజ్ఞానులమై కూడా రాజ్య, రాజకియాదులపట్ల , కుటుంబసభ్యులపట్ల మమకారాన్ని వర్ధిల్ల జేసుకుని బాధపడుతున్నాము .అని వారు చింతించగా.....
Kadha Prarambham
వారి ప్రశ్నలకూ , సందేహాలకూ మేథాఋషి ప్రశాంత చిత్తముతో సమాధానం ఇస్తున్నాడు :''సమాధి,సురథులారా!విషయవాసన జ్ఞానం లేని ప్రాణులేలేవు .ఈవాసనలు అనేక విధాలుగా ఉంటాయి . గుడ్లగూబాది ప్రాణులు పగలు చూడలేవు .కాకి , కోకిల అదిగా గల అసంఖ్యాక ప్రాణులు రాత్రి వేళ చూడ జాలవు .కించుల్కాది ప్రాణులు అహోరాత్రులు అన్నాడు చూడజలవు మేము ''జ్ఞానులం'' అని మీరనుకుంటున్నారు. విషయవాసన జ్ఞానం మనుష్య మాత్రులకు నైసర్గికమైనది .ఇది పశుపక్ష్యాదులకు కూడా ఉంటుంది. ఆహార విహర సంబధమైన జ్ఞానం మానవులవలె జంతువులకు కూడా ఉంది . అయినా పక్షులు ఆకలితో ఉన్నా తాము తెచ్చిన ఆహారాన్ని అంతటిని తమ పిల్లలకే అందిస్తాయి.ఈ విశ్వంలో సామాన్యంగా జరుగుతున్న ఓ విషయాన్నీ మీరు గమనించాలి .మానవుడు తన అవసాన దశ సమీపించే కొద్ది ప్రతిఫలపేక్షతో లోభంతో స్వసంతానం పట్ల విశేషించి పుత్రులపట్ల అత్యంత ప్రేమతో చరిస్తూ౦టాడు .విశ్వస్టితికి కారకుడైన భగవంతుని మాయ ప్రభావం వల్లనే సమస్త ప్రాణికోటి మమతాపాశంలో చిక్కుకుని మోహ౦ధకార కూపంలోదిగపోతుంటుంది .
యావద్విశ్వం ఆ మహామాయ యొక్క మోహపాశంలో చిక్కుకు తీరుతుందన్న విషయంలో ఎంత మాత్రం సంశయం లేదు .లోకాలకే ఎలికైన దేవాదిదేవతలే శక్తిచే మోహింపబడుతున్నారు ఇక సామాన్యుల విషయం వేరే చెప్పలా ?ఆ పరాశక్తి సర్వే౦ద్రియాలను స్వాధీనంలో ఉంచుకుంటుంది.ఆ జనని విభూతుల అచింత్యాలు.మహాజ్ఞానులైన వారి చిత్తాలను కూడా బలవంతంగా ఆకర్షించి మోహి౦పజేయగల అఖండశక్తి ఆమహామాయ శక్తి ఉంది . ఆమె వల్లనే చారచర విశ్వం సృష్టింపబడుతున్నది.ఆ తల్లి ప్రసన్నత వల్లనే జీవులకు ముక్తి లభిస్తున్నది , జీవుల బ౦ధనానికి కూడా ఆమెయే కారణము . ఆ మాతయే ముక్తి ప్రదాత్రి కూడా.స్వరూపాలను విశదీకరించే పరమవిద్య,బ్రహ్మాది దేవగణ సర్వస్వానికి కూడా భగవత్స్వరూపిణి ఆ మహామాయా శక్తియే''అని క్షణం మౌనం వహించిన మహర్షిని మహారాజు మరల ఇలా ప్రశ్నిస్తున్నాడు .
''స్వామి !మీరింతగా వర్ణిస్తున్న ఆ మహామాయా శక్తి ఎవరు ? ఆ జనని అవతార రహస్య మేలాంటిది ?ఆ జనని సాధించిన మహత్తర కార్యాలేమిటి ?ఆమె స్వభావమేలా౦టిది? ఆమె నిత్యయా కాదా?ఈ నా సందేహాలకు దయచేసి సమాధాన మిచ్చేదరుగాక!'' దానికి మేథాఋషి౦ద్రుడు ప్రశాంత ప్రసన్న చిత్తంతో ఇలా బదులుపలుకుతున్నాడు.
ఇంకా ఉంది.....
 
TeluguOne Services
TV Cinema NEWS Radio (TORi)
KidsOne Comedy Panchangam Bhakti
Greetings Shopping Romance Vanitha
Health Audio Songs Buy DVDs NRI Corner
Classifieds Music Classes Games Matrimonial
Charity       SocialTwist Tell-a-Friend  
Share |
TeluguOne FOR YOUR BUSINESS
Ad Tariff
 
About TeluguOne
About TeluguOne