Bhakti Home
monday tuesday wednesday thursday friday saturday sunday
Home News Cinema TV Radio Comedy Romance Shopping Bhakti VOD Classifieds NRIcorner KidsOne Greetings Charity More
  User Login |  Sign Up  | Feedback |  Contact 
 
Untitled Document
Untitled Document
:: Home :: Bhakti
Kadha Prarambham
Kadha Prarambham
Kadha Prarambham
Sridevi | sree | devi | mahatyam | bhakthi | brama | shivudu | parvathi | saraswathi | kundali | vishwakarma | alamkaram.
మధుకైటభ వధ
బ్రహ్మస్తుతికి ప్రసన్నురాలై తమోరూపంలో ఉన్నదేవి శ్రీహరికి నిద్రాభ౦గం చేసి, మధుకైటభ రాక్షసులను  సంహరి౦చే నిమిత్తం అతగాడి (శ్రీహరి) నేత్ర, ముఖ, నాసిక,భుజ, హృదయ వక్ష:స్థలాల నుండి బహిర్గతమై బ్రహ్మదృష్టిని ఆవహించింది.
శ్రీహరి యోగనిద్ర నుండి లేచి రాక్షసులను ఇద్దరినీ ఎదురుగా చూసాడు. బలమదగర్వితులైన ఆ మధుకైటభ రక్కసులిద్దరూ బ్రహ్మపైకి ల౦ఘి౦చడం చూసాడు.వెంటనే వారిద్దరిమీదా దండెత్తాడు  శ్రీహరి. ఇరుపక్షాల మధ్య బహుకాలం బహాబహియుద్ధం జరిగింది.
Madhu kaitabha vadha

తత్సమయంలో ఆ బలోన్మత్తులిద్దరరూ మహా మాయా మోహితులై విష్ణువును తనకు కావలసిన వరం కోరుకోమన్నారు. “మీరిద్దరూ నా హస్తాలలో అంతం కావడమే నా కోరిక” అన్నాడు శ్రీహరి.
ఆ విధంగా ఆ రాక్షసులిద్దరూ విధివంచితులై, చేసేదిలేక, సర్వం జలమయం కావడం చూసి” జలాలు లేని ప్రదేశంలో మమ్మల్ని వధించు” అన్నారు. శంఖచక్రగదా ధరుడైన శ్రీమన్నారాయణుడు ఆ కోరికకు సమ్మతించి వారిద్దరి తలలూ తన విశాలమైన తోడపై ఉంచి చక్రాన్ని ప్రయోగించి ఖండించి వేసాడు బ్రహ్మ ప్రార్దానానుసారం మహామాయాశక్తి ఈ విధంగా ప్రాదుర్బవి౦చింది. ఆ తల్లి ఇంకా. ఏఏ స్వరూపాలలో అవతరించి ఏఏ లీలలను దర్శించినదో వివరిస్తాను వినండంటు మేథాఋషి అనంతరం గాథలను వివరించాడు.
మేథా ఋషీ౦ద్రుడు దేవీమహాత్మ్యాన్నికొనసాగిస్తున్నాడు. భక్తులారా! రాక్షసులకు మహిషాసురుడు దేవతలకు పురందరుడు రాజులుగా పరిపాలన కొనసాగించే కాలంలో వారిద్దరి మధ్యా ఘోర భయంకర యుద్ధం అరంభైమై౦ది. ఆ యుద్ధం అనేక స౦వత్సరాల కాలం జరిగింది . ఫలితంగా రాక్షసులకు విజయలక్ష్మి వరించింది .దానితో దేవరాజ్యాన్ని కూడా మహిష రాక్షసుడు స్వాధీనం చేసుకుని ఇంద్రాసనాన్నిఅధిష్టి౦చాడు. ఓడిపోయిన దేవతలందరూ బ్రహ్మ నాయకత్వంలో శివకేశవుల సన్నిధి చేరి తమ బాధలను వివరిస్తూ “రాక్షసులు పెట్టె బాధలను, వారి దుర్వ్యవహార దుష్కార్యాలను భరించలేక పోతున్నాము. మీరు తప్ప మా రక్షణభారం ఎవరు భరించగలరు?” అని అర్త భావంతో ప్రార్ధించగా, అది విన్న శివకేశవులు క్రోధం ప్రతిక్షణం ప్రవర్ధమానం కాసాగింది . అనంతరం ముమ్మూర్తుల ముఖాలనుండీ ముడు మహాతేజ:పుంజాలు బహిర్గతమయ్యాయి. అదే సమయంలో మహేంద్రాదుల దేహలను౦డి కూడా తేజస్సులు వేలువడసాగాయి.
అన౦తరం దేవతలందరి శరీరాల నుండీ వెలువడిన తేజోరాసులు ఓ స్త్రీ రూపాన్ని ధరించాయి . ఆ నారి శరీరాన్ను౦డి బహిర్గతమయ్యే దివ్య ప్రకాశం లోకత్రయాన్ని భాసమానం చేస్తున్నది. ఆమె వదనంలో శివతేజస్సు, కేశాలలో యమతేజస్సు,బహుద్వయ౦లో హరి కాంతీ,జఘన ఊరు దేశాల్లో వరుణ తేజస్సు,నితంబ భాగంలో పృధ్వీప్రకాశం, స్తన తను మధ్య – చరణద్వాయాలలో క్రమంగా చంద్ర – ఇంద్ర – బ్రహ్మతేజస్సులు, సూర్య- అష్టవసువుల తేజస్సుల నుండి చరణ హస్తాంగుళులూ కుబేర తేజస్సు నుండి నాసికా భాసిల్లసాగాయి.దంతాలు ప్రజాపతి తేజస్సు నుండి, అగ్ని తేజస్సు నుండి త్రినేత్రాలూ, సంధ్య తేజస్సు నుండి భ్రూయుగళమూ, వయి తేజం నుండి కర్ణద్వయమూ ఏర్పడ్డాయి.అదే విధ౦గా సమస్త దేవతల తేజోరుపంగా మహాశక్తి ప్రాదుర్భవించి౦ది.తమ తేజస్సుల నుండి అవతరించిన పరాశక్తి స్వరిపిణిని సందర్శించి బృందారక సందోహం పరమానంద౦ చెందింది. తాత్సమయంలో మహా దేవుడు తన త్రిశూలం నుండి మరోశూలాన్ని సృష్టి౦చి దేవికి అందించాడు.
అది చూసి నారాయణుడు తన సుదర్శన చక్రన్నండి మరో సుదర్శనాన్ని సృష్టిం ఇచ్చాడు. వరుణుడు పాశశ౦ఖాలను, అగ్ని శక్త్యయుధాన్ని,వాయువు  ధనుర్భాణతూణీరాలనూ శ్రీదేవికి అర్పించారు .మహేంద్రుడు వజ్ర,ఐరావత,ఘంటాదులనూ, యముడు దండాన్నీ, ప్రజాపతి అక్షరమాలా కమండలాలనూ సమర్పించగా,భాస్కరుడు శ్రీదేవి రోమాలలో తన తేజోమయ కిరణాలను ప్రవేశపెట్టాడు. కాలుడు ఖడ్గ నిర్మల చర్మాలను అందించగా, క్షీరసాగరుడు శ్రీదేవికి ఉజ్జ్వల హారాన్ని,శిధిలం కానీ దివ్యవస్త్రద్వయాన్నీ, మనోహర చూడామణినీ, కుండల, వలయ, అర్ధచంద్రాలంకార కేయురాభారణనూపురాలానీ క౦ఠాభరణాన్ని, అంగుళియకాలనూ అర్పించాడు. విశ్వకర్మ నిశిత పరశువునూ,అనేకాస్త్రాలనూ అభేద్యకవచాన్నీ సమర్పించాడు. సముద్రుడు శిరోపరిభాగ,వక్షస్థలాలలో, కమలహరదులను అలంకారాలుగా అర్పించాడు . ఇతెరేతర దేవతలందరూ వివిధాభరణాలనూ, అస్త్రాడులనూ శ్రీదేవికి అర్పించి ఆనందించారు.

ఇంకా ఉంది.....
 
TeluguOne Services
TV Cinema NEWS Radio (TORi)
KidsOne Comedy Panchangam Bhakti
Greetings Shopping Romance Vanitha
Health Audio Songs Buy DVDs NRI Corner
Classifieds Music Classes Games Matrimonial
Charity       SocialTwist Tell-a-Friend  
Share |
TeluguOne FOR YOUR BUSINESS
Ad Tariff
 
About TeluguOne
About TeluguOne