తమన్నాకు ఏమాత్రం తీసిపోని రకుల్.. ఇద్దరి మధ్య పోలికలు
on Oct 28, 2015
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీ బజీగా గడిపేస్తుంది. అయితే ప్రస్తుతం ఓ విషయం గురించి టాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే తమన్నా.. రకుల్ గురించి. వీరిద్దరికి కొన్ని కామన్ పోలికలు ఉన్నాయంట అవేంటో తెలుసా.. తమన్నా విషయానికి వస్తే తాను సినీ పరిశ్రమకు వచ్చిన తరువాత మొదట చిన్నహీరోలతో ఆడిపాడి ఆతరువాత శేఖర్ ఖమ్ముల తీసిన హ్యాపిడేస్ హిట్ తో హిట్ హీరోయిన అయిపోయి.. ఆతరువాత స్టార్ హీరోల అందరి పక్కన వరుసపెట్టి నటించేసింది. రకుల్ విషయంలో కూడా అదే జరిగింది.. మొదట తను సినీ అరంగేట్రం బాలీవుడ్ లో చేసినా ఆతరువాత టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి.. మొదట్లో చిన్న హీరోలతో నటించి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది.
అంతేకాదు డ్యాన్స్ విషయంలో కూడా వీరిద్దరికి పోలికలు కనపడుతున్నాయి. మొదట డ్యాన్స్ ను అంత పట్టించుకోని తమన్నా ఆతరువాత అల్లూ అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ పక్కన డ్యాన్స్ చేయడానికి కష్టపడి నేర్చుకొని బెస్ట్ డ్యాన్సర్ అనిపించుకుంది. ఇప్పుడు రకుల్ కూడా అదే తరహాలో డ్యాన్స్ పై శ్రద్ద పెట్టిందట. ఇప్పటికే బ్రూస్లీ సినిమాలో డ్యాన్స్ తో అలరించిన రకుల్ ఎన్టీఆర్ మా నాన్నకు ప్రేమతో సినిమాలో మంచి స్టెప్పులే వేసిందట.
అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తమన్నా వరుసపెట్టి అన్ని సినిమాలు తీసినా ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ అందుకోలేకపోయింది. యావరేజ్.. జస్ట్ యావరేజ్ రేటింగ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో కొంతకాలం ఆఫర్లు అంతగా రాకపోయినా మళ్లీ బాహుబలితో ఇప్పుడు ఫాంలోకి వచ్చింది. మరి ఈ విషయంలో కూడా రకుల్ తమన్నాతో పోటీపడుతుందా.. ఒకరకంగా చూసుకుంటే ఈ విషయంలో కూడా ఇద్దరికి కొంచం పోలికలు ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే రకుల్ ఇప్పటి వరకూ నటించిన సినిమాల్లో ఒక్క వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా కొంచం హిట్ టాక్ రాగా ఆతరువాత తీసిన సినిమాలు అన్నీ దాదాపు అంత సూపర్ హిట్టయిన దాఖలాలు లేపు. ఇక రీసెంట్ గా వచ్చిన బ్రూస్ లీ సినిమా గురించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమాలో నటిస్తుంది. ఇంక బన్నితో మరో సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలను బట్టి రకుల్ ఫ్యూచర్ ఎంటో తెలిసిపోతుంది. దాన్నిబట్టి ఈ విషయంలో కూడా ఇద్దరు ఒకటే అని తేలిపోతుంది. అది తెలియాలంటే ఇంకా కొంత సమయం ఆగాల్సిందే.