జాగ్వార్ కారు కొట్టేసిన మగాడు!!
on Oct 29, 2015
శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ అవడంతో దర్శకుడు కొరటాలకి 'ఆడి' వంటి ఖరీదైన కారును గిఫ్ట్ గా అందజేశారు మహేష్ బాబు. అదే స్ఫూర్తి తో కొంతమంది నిర్మాతలు ఈ బాటలోనే ముందుకు వెళుతున్నారు. మారుతి తెరకెక్కించిన భలే భలే మగాడివోయ్ సూపర్ డూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. అందుకుగాను ఆ సినిమా నిర్మాతలు యువీ క్రియేషన్స్ కి చెందిన వంశీ మారుతికి జాగ్వార్ కారును బహుమానంగా ఇచ్చాడు. హైదరాబాద్ లోని ఓ షో రూమ్ లో ఆ కారును మారుతికి అందజేశారు.ఈ కారును అందుకున్న మారుతి ఇది ఓ పెదవాడు సాధించిన విజయం అని పేర్కొన్నారు. ప్రస్తుతం మారుతి వెంకటేష్ హీరోగా ఓ సినిమాని తెరకెక్కించే ఆలోచనలో వున్నాడు. ఈ సినిమా కూడా హిట్టైతే మారుతి టాప్ దర్శకుల లీగ్ లోకి వెళ్ళడం ఖాయం.