కాస్త ఆలోచించమ్మా అవికా!
on Apr 30, 2015
ఓ సినిమా హిట్టవగానే స్టార్ హీరోయిన్ అయిపోయా అనుకుంది. కండిషన్స్ అప్లై అంది. సినిమా లెక్కన కాదు రోజుల లెక్కన రెమ్యునరేషన్ కావాలంది. వామ్మో అమ్మడు కోరికలు మామూలుగా లేవనుకున్నారంతా. ఎందుకొచ్చిన తలనొప్పిలే అని పక్కనపెట్టారు. కట్ చేస్తే చిన్నది ఫుల్ ఖాళీ అయిపోయింది. పలకరించే వాడే లేడాయే. దీంతో కాంప్రమైజ్ కాక తప్పదని డిసైడైంది. దేనికైనా రెఢీ అంది. ఎట్టకేలకు స్పందించిన ఉయ్యాలజంపాల దర్శకుల్లో ఒకడైన రామ్మోహన్ అవికాని తన సినిమాలో తీసుకోవాలని డిసైడయ్యాడట. ఇంతకీ హీరో ఎవరనుకున్నారు....ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్. ప్రేమకథ కాబట్టి కొత్త హీరోతో ట్రై చేస్తే బావుంటుందనుకున్న రామ్మోహన్...రోషన్ ను సంప్రదించడం...అటునుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు కాబట్టి తన కొడుక్కి మంచి డెబ్యూ మూవీ అవుతుందని శ్రీ పొంగిపోతున్నాడట. ఆ సంగతి పక్కనపెడితే....ఉయ్యాల జంపాల హట్టు తర్వాత బిజీ అవ్వాల్సిన అవిక బలుపు చూపించి బ్యాక్ అయిపోయింది. ఇకనైనా కాస్త ఆలోచించి అడుగేస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. మరి ఈ మాటలు అవికా గోర్ చెవికెక్కించుకుంటుందో లేదో చూద్దాం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
