మే 1న భయపెట్టబోతున్న 'గంగ'
on Apr 30, 2015
రాఘవ లారెన్స్ హీరోగా నటించి దర్శకత్వం వహించగా ‘కాంచన’(ముని2) ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువ నిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మించి ‘గంగ’(ముని3) మే 1న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ‘‘మా బేనర్‌లో ‘కాంచన’గా వచ్చిన ముని 2 ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘గంగ’గా నిర్మించిన ముని 3 చిత్రాన్ని మే 1న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఈ చిత్రం తమిళ్‌లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ‘గంగ’ చిత్రం కూడా పెద్ద హిట్ అయి మా బేనర్‌లో మరో సూపర్‌హిట్ మూవీగా నిలుస్తుంది. రాఘవ లారెన్స్ పెర్‌ఫార్మెన్స్, డైరెక్టర్‌గా ఆయన టేకింగ్, తాప్సీ, నిత్య మీనన్‌ల గ్లామర్ సినిమాకి పెద్ద ఎస్సెట్స్ అవుతాయి. ఈ చిత్రం తర్వాత త్వరలోనే ‘ముని4’ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాం’’ అన్నారు.