అది శ్రుతి హాసన్ బ్రేకప్ సాంగేనా?
on Apr 10, 2020
"I JUST WANT TO STAY A LITTLE LONGER, CAUSE I CAN FEEL MY BREATH TAKE ITS SPACE AGAIN" - హీరోయిన్ కమ్ సింగర్ కమ్ మ్యుజిషియన్ శ్రుతి హాసన్ రాసిన ఒక పాటలో లైన్స్ ఇవి. "నేను మరికొంత కాలం ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే... నా శ్వాస మళ్లీ యథాస్థానాన్ని చేరుకోవడం నేను ఫీలవుతున్నాను" అని తెలుగు మీనింగ్.
ప్రస్తుత పరిస్థితులకు ఈ లైన్లు చక్కగా సరిపోతాయి. కరోనా రక్కసి కోరలు చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ శాతం మంది మరికొన్ని రోజులు ఇలాగే (లాక్ డౌన్ లో) ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ పొడిగించమని కోరారు. ప్రకృతి విషయానికి వస్తే... ఊపిరి పీల్చుకుంటోంది. వాయు, నీటి కాలుష్యం తగ్గుతున్నాయి. మరికొన్ని రోజులు లాక్ డౌన్ కొనసాగితే యథాస్థానానికి చేరుకుంటాయేమో. ఈ పాటను శ్రుతి హాసన్ ఇప్పుడు కొత్తగా రాయలేదు. కొన్నాళ్ల క్రితం తన జీవితంలో జరుగుతున్న పరిణామాలను ఉద్దేశించి రాశారు. కానీ, ప్రస్తుత పరిస్థితికి ఇంతలా అద్దం పట్టేలా ఉంది.
మరి, శ్రుతి హాసన్ ఈ పాటను ఎప్పుడు రాశారు? బ్రేకప్ టైమ్లో రాశారా? ప్రేమ బంధం నుండి బయటకొచ్చిన తర్వాత కొన్నాళ్లు ఒంటరిగా ఉండాలని అనుకున్నారా? తన శ్వాస మళ్లీ యథాస్థానానికి చేరుకోవడం అంటే... అంతకు ముందు ఉన్నట్టు సంతోషస్థితికి చేరుకుంటున్నట్టు శ్రుతికి అనిపించిందా? ఏమో... ఎవరు చెప్పగలరు? శ్రుతి హాసన్ తప్ప!!