ప్రేమ గుట్టు విప్పిన ప్రియమణి
on Nov 24, 2014
ఈమధ్య ప్రియమణి పేరు గాసిప్పులలో తెగ నానుతోంది. ప్రియమణి ప్రేమలో పడిందని, కన్నడ నటుడు గోవిందా పద్మ సూర్యతో డేటింగ్ చేస్తోందని, ఇటీవలే రహస్యంగా వీరిద్దరూ వివాహం కూడా చేసుకొన్నారని గుసగుసలు వినిపించాయి. వీటిపై ప్రియమణి ఓ క్లారిటీ ఇచ్చింది. తాను ప్రేమలో పడ్డానన్న సంగతి నిజమే అని తేల్చి చెప్పింది. అయితే... ప్రియుడు మాత్రం గోవిందా పద్మ సూర్య కాదట. అసలు తామిద్దరి మధ్య అలాంటి సంబంధమే లేదంది. తాన మనసు దోచిన వాడి పేరు త్వరలోనే మీడియాకు చెప్తానని ఊరిస్తోంది ఈ హాట్ భామ. తన పెళ్లి విషయంలో వస్తున్న రూమర్లను కూడా ఖండించింది. రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, అందరినీ పిలిచే పెళ్లి చేసుకొంటానంటోంది. మొత్తానికి ప్రియమణి ప్రేమలో పడిందన్నది మాత్రం నిజమే అన్నమాట. మరి అతగాడెవరో తెలియాలంటే కొంతకాలం ఆగాలి. అన్నట్టు ప్రియమణి కెరీర్ ఇప్పుడు క్లైమాక్స్‌కి చేరుకొంది. పెళ్లి చేసుకొని... తనకు తాను ఈ రంగం నుంచి దూరమవ్వాలని ప్రియమణి గట్టిగా డిసైడ్ అయ్యిందట. ఈలోగా ఒకట్రెండు మంచి పాత్రలైనా దక్కకపోతాయా? అని ఆశ పడుతుంతోంది. ప్రియమణి కల నెరవేరుతుందంటారా??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
