'పిల్లా నువ్వులేని జీవితం' ఫస్ట్ వీక్ కలెక్షన్స్
on Nov 24, 2014
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం 'పిల్లా నువ్వులేని జీవితం' మూవీ బాక్సాపీస్ వద్ద మొదటివారం కలెక్షన్స్ బాగానే రాబట్టింది. ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఓ రేంజ్ లో లేకపోయినప్పటికీ, పర్వాలేదనిపించాయి. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న హీరోగా, "పిల్ల నువ్వులేని జీవితం" మూవీకి విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. అంతే కాకుండా సాయి ధరమ్ తేజ్ కోసం మెగా ఫ్యామిలీ అంతా కదిలి రావడంతో అందూ ఈ కొత్త మెగా హీరో మూవీ పై ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. మరి అభిమానులు, ఆడియెన్స్ ఆశించిన విధంగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వున్నాయో లేదో ఓసారి పరిశీలిద్దాం.
నైజాం : రూ. 2.76 కోట్లు
సీడెడ్ : రూ. 1.31 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 84 లక్షలు
గుంటూరు : రూ. 61 లక్షలు
తూర్పు గోదావరి : రూ. 52 లక్షలు
కృష్ణా : రూ. 48 లక్షలు
పశ్చిమ గోదావరి : రూ. 40 లక్షలు
నెల్లూరు : రూ. 24 లక్షలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి రూ. 7.16 కోట్లు.