హాలీవుడ్ స్టార్ ట్రైనర్ దగ్గర షూటింగ్ నేర్చుకున్న బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్!
on Aug 14, 2020
సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింటా ప్రస్తుతం యు.ఎస్.లో భర్త ఇంట కాలక్షేపం చేస్తోంది. ఈ క్వారంటైన్ పీరియడ్‌లో తాను చేస్తున్న పనులను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తోంది. వాటిలో భర్త జీన్ గుడెనఫ్‌కు హెర్కట్ చేస్తున్న వీడియో లాంటివి కూడా ఉన్నాయి. వాటిని చూస్తుంటే అందరికంటే ఈ టైమ్‌లో చాలా జాగ్రత్తగా గడుపుతున్నట్లు అనిపించక మానదు. సినిమాల్లో యాక్షన్ సీన్స్ చేయాలన్న తన డ్రీమ్ తీరకపోయినా ఇప్పుడు పిస్టల్ షూటింగ్ నేర్చుకోవడం ద్వారా యాక్షన్ రోల్‌కు సిద్ధమని చెపుతోంది. అవును. లేటెస్ట్గా షేర్ చేసిన వీడియోలో ఆమె షూటింగ్ నేర్చుకుంటూ కనిపిస్తోంది మరి.
పిస్టల్‌ను గురిచూసి పేల్చడంలో ఆమె కాన్ఫిడెన్స్‌కు నమస్కారం పెట్టాల్సిందే. ఆమె ఆరోన్ కోహెన్ గైడెన్స్‌తో షూటింగ్ నేర్చుకుంటోంది. ఆరోన్ ఎవరో కాదు.. జాన్ విక్ లాంటి బ్లాక్‌బస్టర్‌లో టైటిల్ రోల్ చేయడానికి కియాను రీవ్స్ లాంటి సూపర్ స్టార్‌కు షూటింగ్లో ట్రైనింగ్ ఇచ్చిన ఇన్స్ట్రక్టర్. ప్రీతి షూటింగ్ స్కిల్స్ చూసి అభిషేక్ బచ్చన్ ఆమెను ప్రశంసించాడు. అర్జున్ రాంపాల్ అయితే మా పని అయిపోయినట్లేనని సరదాగా కామెంట్ పెట్టాడు. చూద్దాం.. త్వరలో ప్రీతి తన యాక్షన్ రోల్ డ్రీమ్‌ను నెరవేర్చుకుంటుందేమో!