'బాహుబలి' కండలు పెంచాల్సిందే
on Jul 31, 2015
ఇక బాహుబలి 2 గురించే ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ప్రభాస్, రానా, అనుష్క తదితరులు తమ శరీరాకృతిని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అనుష్క ఇప్పట్నుంచే జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ తనని తాను తీర్చిదిద్దుకుంటోంది. ప్రభాస్ తొలిభాగం షూట్ పూర్తవ్వగానే రిలాక్సయిపోయాడు. ఆ తర్వాత ఎక్కడ చూసినా స్లిమ్ లుక్ లో కనిపించాడు.అయితే ఇక సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుంది కాబట్టి ఇప్పట్నుంచే మళ్లీ కసరత్తుల్లో స్పీడ్ పెంచాల్సి ఉంది. పైగా అమరేంద్ర బాహుబలి యుద్ధ విన్యాసాలు గొప్పగా చేశాడన్న పేరొచ్చినా మజిల్ పవర్ ని ఓపెన్ చేసి చూపించడంలో ఫెయిలయ్యాడన్న విమర్శలొచ్చాయి.
అక్కడ యుద్ధ రంగంలో కవచ౦ అతడి దేహాకృతిని పూర్తిగా కవర్ చేసేసింది. ఎంతసేపూ ఆయుధ లాఘవం తప్ప మెలితిరిగిన కండల్ని చూపించే ప్రయత్నం చేయలేదు. శివుడు కూడా చొక్కా విప్పి శివలింగాన్ని ఎత్తే సన్నివేశంలో తప్ప ఎక్కడా మెలితిరిగిన కండల్ని చొక్కా లేకుండా చూపించే ప్రయత్నం చేయలేదు. అయితే ఇక రెండో భాగంలోనైనా ప్రభాస్ తన దేహాకృతితో మోప్పించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
