ముగ్గురికి అత్యవసరం
on Dec 2, 2014
దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ కాజల్... ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా టెంపర్. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఎందుకంటే ముగ్గురికి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. కానీ కొద్దికాలంగా సరైన హిట్లే లేవు. అందుకే ఆ ముగ్గురూ సినిమాను హిట్ చేయాలని కంకణం కట్టుకున్నారు. అన్నింటికి మించి ఈ సినిమా హిట్ కావడం ముగ్గురికి అత్యవసరం. ఎందుకంటే కొంతకాలంగా పూరీకి భారీ హిట్ లేదు. ఎన్టీఆర్ దీ అదే పరిస్థితి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది ఎన్టీఆర్ కెరీర్. మంచి పెర్ఫార్మర్ అయినా మంచి సినిమా పడడం లేదు. అది ఎందుకో ఎవరికీ అర్థం కానీ పరిస్థితి. ఇక హీరోయిన్ కాజల్ హిందీపైనే ఫోకస్ పెట్టడం వల్ల తెలుగులో అవకాశాలు తగ్గించుకుంది. ఇప్పుడు మళ్లీ తెలుగుపై ఇంట్రెస్ట్ పెట్టి ఇక్కడా తన మార్కెట్ ఏమాత్రం తగ్గలేదని చాటుకునేందుకు సిద్ధమవుతోంది. ఇలా ఏరకంగా చూసినా ఈ ముగ్గురికీ అర్జెంటుగా ఒక్క హిట్ కావాలి. అందుకే ముగ్గురూ ఈ సినిమాను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారని సినీజనాలు గుసుగుసలాడుకుంటున్నారు.