కాబోయే భర్తతో కలిసి జిమ్‌కు వచ్చిన నిహారిక!
on Oct 31, 2020
నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల శనివారం తన వర్కవుట్ సెషన్ తర్వాత జిమ్ బయట కనిపించింది. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే నిహారిక తరచూ జిమ్‌కు వెళ్తుంటుంది. అయితే ఈసారి స్పెషల్ ఏమంటే హైదరాబాద్‌లోని ఆ జిమ్‌కు నిహారికతో పాటు వర్కవుట్స్ చేయడానికి ఆమె కాబోయే భర్త చైతన్య కూడా రావడం. జిమ్‌లో కసరత్తులు చేసిన అనంతరం ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, చాలా ఆనందంగా కనిపించారు ఆ జంట. చైతన్య క్యాప్ పెట్టుకోగా, నిహారిక ఫేస్ మాస్క్ ధరించి కనిపించింది. ఇద్దరూ బ్లాక్ డ్రస్ ధరించి ఉండటం గమనార్హం. ఆ ఇద్దరికీ ఆగస్ట్ 13న ఎంగేజ్మెంట్ జరిగింది.
కుటుంబ సభ్యులు మాత్రమే ఆ నిశ్చితార్ధానికి హాజరైనప్పటికీ, కన్నుల పండువగానే అది జరిగింది. చైతన్య హైదరాబాద్‌లోనే టెకీగా పనిచేస్తున్నాడు. అతని తండ్రి మెగాస్టార్ చిరంజీవికి బాగా పరిచయం. ఆయనే ఈ సంబంధాన్ని కుదిర్చారు. ఎంగేజ్మెంట్ వేడుకలో రామ్‌చరణ్, ఉపాసన జంట కూడా మెరిశారు. నిహారిక, చైతన్య జోడీతో అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ లాంటి ఫ్యామిలీ మెంబర్స్ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read