చాలా కాలానికి ఒక గుడ్ ఫిల్మ్ చూశాను.. 'కలర్ ఫొటో'కు బన్నీ ప్రశంస!
on Oct 31, 2020
సందీప్ రాజ్ డైరెక్ట్ చేయగా, సుహాస్ హీరోగా నటించిన 'కలర్ ఫొటో' సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలై అనేకమంది ప్రశంసలు పొందుతున్న విషయం తెలిసిందే. డిజిటల్ వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్న ఈ సినిమాలో తాను భాగం అయితే ఎంతో ఆనందించేవాడినని జగపతిబాబు సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. అదే సమయంలో ఇలాంటి చక్కని సినిమాల్లో తనను ఎందుకు తీసుకోరనే ఆవేదననూ వ్యక్తం చేశారు.
కాగా లేటెస్ట్గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'కలర్ ఫొటో'ను తిలకించారు. సినిమాను బాగా ఆస్వాదించారు. డైరెక్టర్ సందీప్ రాజ్ పనితనం, నటీనటుల అభినయం, సన్నివేశాల చిత్రీకరణ ఆయనను బాగా ఆకట్టుకున్నాయి. వెంటనే 'కలర్ ఫొటో' టీమ్‌ను గీతా ఆర్ట్స్ కార్యాలయానికి పిలిపించుకొని, వారిని అభినందించారు. ఒక మొక్కను వారికి ప్రెజెంట్ చేశారు. ఆ టీమ్‌తో ఫొటో దిగారు. దానిని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. "Congratulations to the entire team of #ColourPhoto . Very sweet love story & a haunting film with amazing music, emotions and performances. Very happy to see a good film in a long time." అని రాసుకొచ్చారు.
అల్లు అర్జున్ను కలిసిన 'కలర్ ఫొటో' టీమ్‌లో నిర్మాత సాయిరాజేశ్, డైరెక్టర్ సందీప్ రాజ్, హీరో సుహాస్, హీరోయిన్ చాందినీ చౌదరి, కమెడియన్ వైవా హర్ష, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ ఉన్నారు. 'హృదయ కాలేయం', 'కొబ్బరి మట్ట' సినిమాల ఫేమ్ సాయిరాజేశ్ నిర్మించిన 'కలర్ ఫొటో'లో సునీల్ ఒక కీలక పాత్ర చేశాడు. కాలభైరవ సమకూర్చిన సంగీతం సినిమాకు ఎస్సెట్‌గా నిలిచింది.
Also Read