రామ్ చరణ్ సినిమాలో పవర్ స్టార్ అత్త
on May 20, 2015
టాలీవుడ్ రీఎంట్రీతో యామా బిజీ అయిపోయింది నదియా. మిర్చిలో ప్రభాస్ తల్లిగా నటించిన తరువాత పవన్ 'అత్తారింటికి దారేది' ఏకంగా టైటిల్ రోల్ ప్లే చేసింది. దీంతో ఆమెకి వరుస అవకాశాలు చుట్టుముట్టినా సెలక్టివ్ గా మంచి పాత్రల వైపే మొగ్గు చూపుతుంది. ప్రస్తుతం నదియా రామ్ చరణ్ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. చరణ్ -శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె ప్రముఖపాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చరణ్ కు సిస్టర్ గా హీరోయిన్ కృతి కర్బందా నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కధానాయిక.