విలువలే నా ఆస్తి అంటోన్న బ్యూటీ
on May 26, 2015
విలువలే నా ఆస్తి అంటోందట బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. అది సన్నాఫ్ సత్యమూర్తి ట్యాగ్ లైన్ కదా అంటారా? అది ఓ సినిమాకు మాత్రమే ట్యాగ్ లైన్. కానీ ఇది నా రియల్ లైఫ్ ట్యాగ్ లైన్ అంటోంది. రెండుకోట్ల రూపాయాల ఓ యాడ్ ని తోసిపుచ్చిందట. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా...నెమ్మదిగా నిలదొక్కుకుంది. ఇప్పుడేకంగా బీటౌన్ క్వీన్ గా కిరీటం పెట్టించుకుంది. అమ్మడి ఫాలోయింగ్ చూసి యాడ్ కంపెనీల వాళ్లు క్యూ కడుతున్నారు. ఈ మధ్య ఓ ఫెయిర్ నెస్ క్రీం కంపెనీ యాడ్ లో నటించాలని కోరుతూ కంగనాకు 2 కోట్లు ఆఫర్ చేసిందట. ఈ బ్యూటీ నో వే అందట. డబ్బులేమైనా సరిపోవా అంటే...విలువలే నాఆస్తి అందట. మనీ మ్యాటర్ కాదు...అసలు ఫెయిర్ నెస్ అంటే ఏంటి? ఒక సెలబ్రిటీగా ఈ యాడ్ ద్వారా యువతకు ఏం సందేశం ఇస్తున్నానని ప్రశ్నించింది. అందుకే 2కోట్లు వదులుకుందట. మొత్తానికి కంగనా నటనలోనే కాదు ఆలోచనల్లో కూడా క్వీన్ అనిపించుకుందని అంతా పొగిడేస్తున్నారు. మిగిలిన ముద్దుగుమ్మలు కూడా కాస్త నేర్చుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.