కళ్యాణ్ రామ్ ను పూరీ ఇలా తయారుచేశాడు..!
on May 31, 2016
పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో కళ్యాణ్ రామ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జర్నలిస్ట్ రోల్ చేస్తున్నాడు కళ్యాణ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగారి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు పూరీ. కళ్లద్దాలు, సైడ్ హెయిర్ స్టైల్, కొద్దిగా గడ్డం పెంచి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు కళ్యాణ్ రామ్. పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూరీ ఒక సోషల్ మేసేజ్ ను కూడా ఇవ్వబోతున్నాడట. ఇన్నాళ్లూ కళ్యాణ్ రామ్ కు ఉన్న ఇమేజ్ ను కూడా పూర్తిగా ఛేంజోవర్ చేసేయాలని పూరీ డిసైడైనట్టున్నాడు. అందుకే కళ్యాణ్ రామ్ తో కొన్ని కేజీల బరువు కూడా తగ్గించే వరకూ షూట్ స్టార్ట్ చేయలేదట. లుక్ బట్టి చూస్తే, కళ్యాణ్ రామ్ ఇరగదీసేశాడు. ఇప్పటి వరకూ తన సినిమాల్లో ఎప్పుడూ లేని క్లాస్ లుక్ తో కనిపిస్తున్నాడనడంలో డౌట్ లేదు. మరి పూరీ వారు సినిమాను ఎలా తెరకెక్కించబోతున్నారో చూడాలి.