గ్యారేజ్ లో ఆ సీన్లు లేపేశారు
on Aug 29, 2016
ఇచ్చట అన్నీ రిపేరు చేయబడును అనేది జనతా గ్యారేజ్ ట్యాగ్ టైన్. దానికి తగ్గట్టే ఈ సినిమాకి ఇప్పుడు భయంకరమైన రేంజులో రిపేర్లు జరుగుతున్నాయని టాక్. ఇటీవలే ఈ సినిమాకి సెన్సార్ పూర్తయ్యింది. నిడివి 2 గంటల 40 నిమిషాల వరకూ వచ్చిందట. మరీ అంత లెంగ్త్ అయితే బోర్ కొడుతుందేమో అని కొరటాల శివ, ఎన్టీఆర్లు భయపడుతున్నారు. సెన్సార్ తరవాత `సెకండాఫ్ లెంగ్తీగా ఉంది` అన్న ఫీలింగ్ మరింత బలపడిందట.
దాంతో.. ఈ సినిమాకి ఆఖరి నిమిషాల్లో రిపేర్లు మొదలెట్టారు. దాదాపు 12 నిమిషాల సీన్లు లేపేశారని, అవన్నీ మోహన్లాల్కు సంబంధించినవని తేలింది. ఈ సీన్లు మలయాళం వెర్షన్లో మాత్రం చూడొచ్చట. తెలుగులో మాత్రం కనిపించవు. బ్రహ్మాజీ, అజయ్లపై తెరకెక్కించిన సీన్లు కూడా లేపేశారని టాక్. ఫైనల్గా సినిమా అవుట్ పుట్ చూసుకొంటే... ఎన్టీఆర్, కొరటాల శాటిస్పైగా ఉన్నారని, ట్రిమ్ చేయడం మంచిది అయ్యిందని, లేదంటే ఫలితంలో తేడా కొట్టేసేదని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒకవేళ రిజల్ట్ పాజిటీవ్ గా వస్తే ట్రిమ్ చేసిన సీన్లు కలిపే అవకాశాలున్నాయి.