అనుష్క తప్పు చేసినా....!!
on Jul 30, 2015
మహనీయుడు భారతరత్న అవార్డ్ గ్రహీత కలాంకు నివాళులు అర్పిస్తూ ABJ Kalam Azad అని రాయడంతో అనుష్క శర్మ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నించి రెండోసారి కూడా మిస్టేక్ రాసింది. ఇక రెచ్చిపోయిన నెటిజన్లు రీట్వీట్ లతో పిల్లదాని ప్రొఫైల్ పేజ్ ని నింపేశారు. నేను తప్పు చేసినా అందులో నిజాయితీ ఉంది. నా ఉద్దేశ్యం అర్ధం చేసుకోకుండా తప్పులు వెతుకుతున్నారు. కానీ నేను ఏ ఉద్దేశ్యంతో ఆ పోస్ట్ చేశానో నాకు తెలుసని చెప్పింది అనుష్క శర్మ. ఒకవైపు తప్పు చేశానంటూనే... మరోవైపు తనపై విమర్శలు చేసినవారిని చెడుగుడు ఆడేసింది అందాల అనుష్క.