సుకుమార్ ఇంకో బ్యానర్ ఓపెన్ చేశాడోచ్..
on Jun 2, 2016
తెలుగు డైరెక్టర్లలో మిగిలిన డైరెక్టర్లతో పోలిస్తే సుకుమార్‌కు ఓ స్పెషాలిటీ ఉంది. జీనియస్ డైరెక్టర్‌గా..కొత్త తరహా సినిమాలతో ట్రెండ్ బెండ్ తీస్తుంటాడు సుక్కు. ఒకటి రెండు సినిమాలు హిట్ అవ్వడం ఆలస్యం, కొత్త బ్యానర్ పెట్టేసి ఒకేసారి డైరెక్షన్ కమ్ పోడ్యూసర్‌గా స్థిరపడిపోతున్నారు మన డైరెక్టర్లు. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. లేటేస్ట్‌గా తన తండ్రి బండ్రెడ్డి పేరుతో బీటీఆర్ క్రియేషన్స్ అనే మరో కొత్త బ్యానర్‌ను స్థాపించబోతున్నాడు. ఈ బ్యానర్‌లో మొదటి సినిమాను తన అన్న కొడుకు హీరోగా తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు హరిప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా జూన్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనుంది. ఈ చిత్రానికి దర్శకుడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.