దిల్ రాజు..మెగా హీరో..మూడో సినిమా
on Jul 29, 2015
దిల్ రాజుకు మెగా హీరోతో దోస్తీ బాగానే కుదిరినట్టు వుంది. అందుకే అతనితో వరుస సినిమాలు చేస్తూ వేరే వాళ్ళకి ఛాన్స్ లేకుండా చేస్తున్నాడు. సాయిధరమ్ తేజతో 'పిల్లా నువ్వు లేని జీవితం' తీసిన దిల్ రాజు ఆ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పుడు సడన్ అతనితో మరో భారీ చిత్రాన్ని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ఏడాది ‘పటాస్’ వంటి చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది.‘పటాస్’ చిత్రం కంటే ఈ సినిమాలో కామెడి రేంజ్ ఎక్కువగా ఉండేలా కథను సిద్ధం చేశాడట. సెప్టెంబర్ నుండి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభం చేస్తారట. రాశిఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని 2016 సమ్మర్ లో రిలీజ్ చేస్తారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
