అమ్మా.. బ్రహ్మీని ఎంతమాటన్నాడు??
on Nov 27, 2014
నిన్న కాక మొన్న ఫేస్ బుక్‌లో రవితేజపై, మెగా ఫ్యాన్స్‌పై హాట్ హాట్ కామెంట్లు చేసి అడ్డంగా దొరికిపోయాడు ఏఎస్ రవికుమార్ చౌదరి. ఆ తరవాత అయ్యో. నేనేం అనలేదే.. నా ఫేస్ బుక్ హ్యాక్ అయ్యింది అని కవర్ చేసుకొన్నాడు. ఇప్పుడు ఏకంగా బ్రహ్మానందంపై పడ్డాడు. ఆయన్నా టార్గెట్ చేసుకొని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన పిల్లా నువ్వు లేని జీవితం ఇటీవలే విడుదలైంది. మీ సినిమాలో బ్రహ్మానందం లేకుండా కూడా కామెడీ పండించారు కదా.. అని అడిగితే - కామెడీ పండాలంటే బ్రహ్మానందమే అవసరం లేదు, ఆయన లేకపోయినా వినోదం పండుతుంది... కథలో దమ్ముంటే చాలు అంటున్నాడు. అంతేకాదు.. బ్రహ్మానందాన్ని వాడుకొని సినిమా నడిపించలేనని, తన సినిమాలో బ్రహ్మానందం చేసే కామెడీకి స్కోప్‌లేదని సెలవిచ్చాడు ఈ దర్శకుడు. బ్రహ్మానందం కామెడీ అడ్డుపెట్టుకొని కొన్ని సినిమాలు ఆడేశాయని తన మాటలతో చెప్పకనే చెప్పేశాడు. మొత్తానికి ఓ యావరేజ్ సినిమా చేతికి రాగానే.. ఈ దర్శకుడికి కాస్త కాన్పిడెన్స్ డోస్ ఎక్కువైనట్టుంది. మరి ఈ జోరు ఎంత కాలమో...??

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
