ఆ రెండు పోస్టర్ల కలయికే... అదే కాపీయే సాహో
on Oct 24, 2017
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన సాహో ఫస్ట్ లుక్ పోస్టర్ కి అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటే, కొందరు హాలీవుడ్ రేంజ్ లో ఉందని కితాబిచ్చారు. మొహానికి ముసుగుతో ప్రభాస్ టీజ్ చేస్తే, అందరూ ప్రధానంగా మాట్లాడుకుంది పోస్టర్ డిజైన్ మరియు, ప్రభాస్ వేషధారణ గురించే. పోస్టర్ విషయంలో కామన్ ఒపీనియన్ ఏంటంటే, భలే చేశారే... అదిరిపోయింది అని...
అయితే, సాహో పోస్టర్ ఒరిజినల్ గా చేసింది కాదు. ఈ డిజైన్ చేయడానికి రెండు సినిమాల పోస్టర్లు కాపీ చేసారు. బ్యాగ్రౌండ్ కోసం బ్లేడ్ రన్నర్ సినిమా పోస్టర్ ని కాపీ చేస్తే, ప్రభాస్ లుక్ కోసం బ్లేడ్ రన్నర్ 1985 పోస్టర్ ని వాడుకున్నారు. ఈ రెండు సినిమాల పోస్టర్లు చూడండి మీకే క్లారిటీ వస్తుంది. ఒకప్పుడు సోషల్ మీడియా లేనప్పుడు ఎవరు ఏది కాపీ చేసిన అంత ఈజీ గా దొరికిపోయేవారు కాదు. కానీ, ఇప్పుడు తప్పించుకోవడం మాత్రం చాలా కష్టం. ఇంతకీ, సాహో సొంత కథతో చేస్తున్నారా లేక హోలీవుడో ఇంకేదో వుడ్ నుండో కాపీ చేస్తున్నారా!
Also Read